గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 20 December 2015

శ్రీ అయ్యప్పస్వామి వారి దేవాలయం , ద్వారపూడి, తూర్పుగోదావరి జిల్లా.శ్రీ అయ్యప్పస్వామి వారి దేవాలయం , ద్వారపూడి, తూర్పుగోదావరి జిల్లా.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి.మీ. ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ద్వారపూడిలో వెలిసిన ఈ ఆలయ సముదాయంలో అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు దర్శకులను అమితంగా ఆకర్షిస్తాయి. అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్పగుడి తరహలో నిర్మించారు.

ప్రాంగణం ముఖద్వారంకు ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం, సగం విష్ణురూపం) విగ్రహం దర్శనం యిస్తుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కలదుత్. లోనికి వచ్చిన భక్తులు మొదట గణపతి ఆతురువాత హరహరి దర్సనంచేసుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడివున్నది .అయ్యప్పగుడి రెండు అంతస్తులగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్పస్వామి వున్న మందిరమున్నది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరంకు వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం వున్నది. అయ్యప్ప విగ్రహం వున్న మందిరం (గర్భగుడి) పైభాగాన గోపుర నిర్మాణమున్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి. ఆయ్యప్ప స్వామి మందిరంకు ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారి విగ్రహంవున్నది


ఇక్కడ ప్రతిష్టింపబడ్డ అయ్యప్పస్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేసినది. 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిచే ప్రతిష్టింపబడినది. ఈ స్వామి సన్నిధికి చేరటానికి ఏర్పాటు చేసిన పధ్దెనిమిది మెట్లనూ తమిళనాడులోని తురుమూరునుంచి తెప్పించిన ఏక శిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయించారు.ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు.

అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమలదాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు. అలాంటివారు ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలనుంచేకాక ఒరిస్సానుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

Read More

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, బొప్పూడి, గుంటూరుజిల్లా.శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, బొప్పూడి, గుంటూరుజిల్లా.

గుంటూరుజిల్లా-చిలకలూరిపేట మండలంలో 5వ నెంబరు జాతీయ రహదారిపై బొప్పూడి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. జాతీయ రహదారిలో గతంలో తీవ్రంగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆ ప్రమాదాలను అరికట్టడానికి ఆధ్యాత్మిక గురువైన తక్కెళ్ళపాడు అయ్యవారు ఆంజనేయస్వామి వారి ఆలయం నిర్మిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. దాంతో బొప్పూడి గ్రామప్రజల సహకారంతో ఆలయం 1984వ సంవత్సరంలో నిర్మించటం జరిగింది.

ముఖమంటపంపై, ప్రధానాలయ గోపురంపై పలురీతులలోని ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి. గర్భాలయంలో ఆంజనేయస్వామి తిరునామంతో భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ ఆంజనేయస్వామి వారికి ఎడమ వైపున శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలు కొలువై ఉన్నాయి.


వాహన పూజలకు, మాలదీక్షాదారులకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిధ్ధిచెందింది. ఈ ప్రాంత ప్రజలు ఏ క్రొత్త వాహనం కొనుగోలు చేసినా ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు.ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి మూర్తి ఉంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో భక్తులు మాలధారణ స్వీకరిస్తున్నారు.ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు, పండుగ పర్వదినాలలో విశేషార్చనలు, ప్రత్యేక పూజలు, హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు.
Read More

అగస్థీశ్వర స్వామి ఆలయం, తొండవాడ, చిత్తురు జిల్లా.అగస్థీశ్వర స్వామి ఆలయం, తొండవాడ, చిత్తురు జిల్లా.

తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో 12 కి.మీటర్ల దూరంలో స్వర్ణముఖీ నదీ తీరాన
తొండవాడ అనే గ్రామం ఉంది. ఈ ప్రదేశాన్నే ముక్కోటి అని పిలుస్తారు. ఇక్కడ 3 పుణ్యనదులు కలుస్తాయి. అవి స్వర్ణముఖి ,భీమా ,కళ్యాణి .. ఇక్కడి లింగాన్ని అగస్తీశ్వరమహాముని ప్రతీష్ఠించారు కాబట్టి అగస్తీశ్వరలింగం గా ప్రఖ్యాతి. ఇది చాలా ప్రాచీన సాంప్రదాయ కట్టడము.పక్కనే చిన్న కోనేరు. నదీమధ్యలో ఓ మండపము.పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.


అగస్థ్య మహర్షి ని దర్శించు కోవటానికి కళ్యాణ వేంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు విచ్చేసాడు. ఇక్కడ అగస్థ్య మహర్షి ప్రతిష్ఠిత శివ లింగమే అగస్థీశ్వర స్వామి గా ప్రసిద్ది చెందింది. అగస్థీశ్వర స్వామిని ఆకాశరాజు, ధరణి దేవి మరియు పద్మావతి దేవి దర్శించుకొనే వారని ప్రతీతి. అగస్థ్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలూ కలిసి ఉన్నన ప్రదేశం లో తపస్సు చేసుకొనే వారని చెప్తారు. ఇక్కడ మరో విశేషం కూడ ఉంది. వేంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతి లో అడుగు పెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది. అదే శ్రీ పాదం అని పేరు.


Read More

హిందూ ధర్మం పట్ల ఇంత ఎగతాళా??

హిందూ ధర్మం పట్ల ఇంత ఎగతాళా?? అది హిందువులు పరమ పవిత్రంగా చూసుకునే గోపురం .. దానిలో ఉండాల్సింది హిందూ ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలూ లేదా వీర బ్రహ్మం గారు.. యోగి వేమన లాంటి సిద్ద పురుషులు .. పరమపవిత్ర కోటప్పకొండ పాదశ్రేణుల్లో నిర్మాణంలో ఉన్న వేద పాఠ శాల పక్కనే ఉన్న వేమారెడ్డి సత్రం దగ్గర ఈ అపచారం చోటు చేసుకుంది..ఆ గోపురంలో ఆది దంపతులు శివ పార్వతులు ఉండడం ఇంకా అపచారం .. ఆ గోపురం అన్నా తీసేయండి లేదా ఆ విగ్రహానన్నా మార్చండి... పోనీ మీరు ఆయన్ని దేవుడో సెయింటో అనుకుంటే కనీసం ఆయన హిందువు కాదు... నేను క్రైస్తవున్ని నా కుటుంబమంతా క్రైస్తవమే అని బహిరంగంగా ప్రకటించిన నిఖార్సైన క్రైస్తవుడు...కనుక ఆ విగ్రహాన్ని ఏ చర్చిలోనో పెట్టుకోండి... .


Read More

శ్రీ కోటదుర్గమ్మ దేవాలయం, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా.శ్రీ కోటదుర్గమ్మ దేవాలయం, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా.

శ్రీకాకుళం పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలొ పాలకొండ అనే గ్రామములో కోట దుర్గమ్మ దేవాలయం ఎంతో ప్రసిధ్ధి చెందింది. బొబ్బిలి రాజుల ఆరాధ్యదేవత పాలకొండ కోట దుర్గమ్మ ఆలయం ఉత్తరాంద్రకే ప్రసిధ్ధి. జిల్లాలోలే అత్యధిక ఆదాయానిచ్చే ఆలయాల్లో ఇది రెండవది. ప్రతీయేటా దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులూ పాటు అతివైభవంగా జరుగుతాయి.
Read More

అనుగ్రహించే దైవం శ్రీ అభయాంజనేయస్వామిఆనందాన్నీ,అభయాన్నీ జంటగా అందించి అనుగ్రహించే దైవం శ్రీ అభయాంజనేయస్వామి. అంజనా నందనుడు, వాయు నందనుడు, వజ్రబల సమన్నితుడు ఆ పవనసుత హనుమానుడు.
'ఆంజనేయః పూజితా - పూజితాః సర్వ దేవతా' అని వేదోక్తి . అనగా ఒక్క ఆంజనేయుని పూజిస్తేచాలు సర్వ దేవతలనీ ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఈ స్వామిని వేడుకుంటే జన్మ లగ్నాత్ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శ్రీరామభక్తుడైన హనుమంతుని దేహం వజ్ర కటినం.దుర్బేధ్యము. అందుకే " వజ్రంగభళీ, భజరంగభళీ " అని హనుమంతుని కొలుస్తాము. ఆపదలలో కేవలం ఈ నామం ఉచ్చరించినంతనే సమస్త శుభాలు కలిగి, నూతన ఉత్సాహం మనకు కలుగుతుంది
Read More

భగవంతుడు పంచాత్మ స్వరూపుడని తైత్తరీయ ఉపనిషత్తు పేర్కొంటోంది

భగవంతుడు పంచాత్మ స్వరూపుడని తైత్తరీయ ఉపనిషత్తు పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలలో చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది.
Read More

నెమ్మదిగా హిందువుగా మారుతున్న జీసస్.నెమ్మదిగా హిందువుగా మారుతున్న జీసస్.

మనం ఇంతవరకు సూర్య నమస్కారాలే చూసేం కానీ, డిసెంబర్  25 - 2015  నుండి క్రిస్టమస్ సందర్భం గా సరిగ్గా సూర్య నమస్కారాలను పోలిఉన్న, జీసస్ నమస్కారాలు అమలులోకి రానున్నవి .Read More

వైకుంఠ ఏకాదశి .

వైకుంఠ ఏకాదశి .
. మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాంటి రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వ శుభాలను ఇస్తుంది.అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజనియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు,కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పండితులు చెబుతున్నారు.ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య ఐదుగా ఉండాలి.కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజువిష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పండుగ ప్రాశస్త్యంముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించేకొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
వైకుంట ఏకాదశి.
ఒకనాటి వైకుంట ఏకాదశినాడు నారదుడు నారాయణుని ఇలా ప్రశ్నించాడు ప్రభు నేను పుట్టిన క్షణం నుంచి మీ నమ స్మరణే చెస్తునాను సంసారం భంధాలలో చిక్కుకొండ సన్యాసం స్వికరించాను మీ భక్త బృందం లో నేనే కదా ఉత్తమ్మ భక్తుడను అన్నాడు నారదుడు, నారాయణుడు చిద్విలాసం చేసి నారదనీ ప్రశ్న కు సమాధానం చెప్తాను కాని ముందు ఈ కథ విను తరువాత నీకే అర్థం అవుతుంది ఒక పల్లెటూరిలో విష్ణుదాసుడు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న తముడు చెల్లి ఉన్నారు అతని సంపాదన పైన వారి కుటుంబం ఆధారపడి ఉంది, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రెండు పూటలా అన్నం వాళ్ళ మనుషులకు పెట్టడానికి 18గంటలు పనిచేస్తుంటాడు చెల్లి కి పెళ్లి చేస్తాడు, తముడు కి వ్యాపారం పెట్టించాడు తల్లి తండ్రులకు మంచి వైద్యం అందించాడు భార్య బిడ్డలకు ఏ కొరత రానీకుండా చుసుకునాడు అతనే నాకు ఇష్టమైన భక్తుడు అనడు విష్ణు దేవులు, నారదుడు ఇలా ఆశ్చర్యం తో ఇలా అడిగాడు ప్రభు విష్ణుదాసుడు ఎలా మీ భక్తుడు అయ్యాడు మీ కోసం ఉపవాసాలు చేయలేదు గుడి గోపురాలు తిరగలేదు అర్చన అభిషేకాలు చేయలేదు మరి ఎలా మీ ఇష్ట భక్తుడు అయ్యాడుఅని ప్రశ్నించాడు నారదుడు నారద నా భక్తుడు కావాలి అంటే నా కోసం గుడి కట్టకర్లేదు ఉపవాసాలు అర్చన అభిషేకాలు యజ్ఞాలు చేయకర్లేదు, ఒకటి చేస్తే చాలు అది ఏమిటి అంటే నా కుటుంభం అంటే విశ్వం నేను ఇచ్చిన భంధాలు అంటే అమ్మ నాన్న భార్య భర్త కొడుకు కూతురు సోదరి సోదరులు ఇలా నేను వేసిన జీవాత్మ సంకెళ్ళను సునితంగా విపుకోవాలి, అది ఎలా అంటే ప్రతి ఒకరి లో నన్ను చూడటం ప్రతి ఒక్క భందానికిన్యాయం చేయటం నేను ఇచ్చిన భంధాలలో నన్నే చూసుకొని వారికీ నిర్వర్తించే భాధ్యతని నా సేవ కైకర్యం అనుకోని నాకు అర్పిస్తే చాలు నేను ఆనందిస్తాను నిరంతం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటె చాలు వారి వెంటే నేను ఉంటాను ఇలానే విష్ణు దాసుడు నాకు ఇష్ట భక్తుడు అయ్యాడు నా పైన నిందలువేయలేదు భందాలను ఇచ్చినందుకు నా పైన చిరాకు చూపలేదు పిలిచినా నేను పలుకనందుకు భక్తి తో భంధలా కర్మలను అనుభవిస్తూ నన్ను ధ్యానించాడు నన్ను శరణు వెడుతూనే వారి కుటుంబ వ్యక్తులకు న్యాయం చేసాడు విష్ణు దాసుడు చేసి చూపిన భక్తి అంటే నాకు ఇష్టం నారదః అన్నారు విష్ణు దేవులవారు. స్నేహితులారా మనకు స్వర్గం నరకం ఎక్కడో లేదు ఎదుటి వారికీ మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమనే తిరిగి వస్తుంది ద్వేషం చూపిస్తే ద్వేషం తిరిగి వస్తుందిదీనికి మనం భగవంతుడ్ని తిట్టడం లేదా మన భక్తి తో దేవుడ్ని బయపెట్టడం చేయకూడదు మన భందాలను గౌరవిదాం ప్రేమిదాం సేవిదాం భగవంతునికి ఇష్టులం అవుదాం.
Read More

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళిఅయ్యప్ప గురించి కొన్ని నక్కలు మాట్లాడుతున్నాయి వారు చదివి తెలుసుకోగలరు

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి
:-
1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా
మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం
ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి
తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా
చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష
చేయాలి.
2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును
దర్శించాలి.
3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.
4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.
5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు.
అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు
ముందుగా దీక్ష ఆరంభించాలి.
6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం
చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా
కత్తిరించకొనరాదు.
7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట
అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో
వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము
మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.
8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద
కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.
9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన
స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి
వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన
పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.
10. దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును
ఎప్పుడూ జపించవలెను.
11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా)
దేవతామూర్తులుగా భావించాలి.
12. తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను
'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం' లేదా
'మాతా' అని పిలవాలి.
13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే
తిరస్కరించరాదు.
14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము,
కుంకుమ బొట్టు ఉండాలి.
15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి
దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.
16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు
అల్పాహారము సేవించవలెను.
17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు
ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత
ప్రీతి.
18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి.
అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక
ప్రసంగములకు దూరముగా వుండాలి.
19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును
ప్రీతికొద్ది ధ్యానించాలి.
20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు,
విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే
పదునెట్టాంబడి.
21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు
అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.
22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం
కూడా కర్పూర హారతి ఇవ్వాలి.
23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి
సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు.
దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము
చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం
చేయరాదు.

అయ్యప్ప స్వామిని ను హరిహరసుతుడని, ధర్మశాస్త,
మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా
సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య
( విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమం తో
'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి
అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల
ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను
బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే
కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో
ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల,
పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు.
శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది
భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి
అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప
తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో
కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని
అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర
తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి
బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి
పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ
కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక
రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు
కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు'
అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు
అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి
కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న
మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి
కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు
శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు
శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల
కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా
సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో
అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన,
ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే
ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక
సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన
'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి
'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు
పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు.
సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ
శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో
ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ
శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది.
ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన
ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది.
మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని
మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి
'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు
కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు
అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా
అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన
సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో
విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు
రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది
ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు
పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి
బయలుదేరుతాడు అయ్యప్ప.

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను
చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని
హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి
వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని
వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో
వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం
చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య
జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ
దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా
ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు.
అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను
చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి
మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు.
ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు.
ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా
మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం
చేరుతాడు.

చేరుతాడు.
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని
తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక
ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం
ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ
తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో
ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల
పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
స్వామియే శరణం అయ్యప్ప !

శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.

దేవాలయ నిర్మాణము
అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి
దేవాలయము భారతదేశ ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం
కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని
నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం
మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు.

భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల
వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన
సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది
వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి
భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం
ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున
లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని
వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు
ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో
గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని
సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక
మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప
స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు
దిద్దుకొంది.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్దనుండి
ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన
మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ
భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను
విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
భజన
పడిపూజ
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ
హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల
ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని
పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను,
పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి
కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ
స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది
నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు
సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో
హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ
అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు.
అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు.
తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను
మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి
ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం
చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం
కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ
శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం
అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని
చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి
శ్లోకం -

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శబరిమల యాత్ర :
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై
యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో
ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ
కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు
వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000
అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల
మద్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబర్
నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ
(నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన
ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన
మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే
ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు
తెరచియుంచుతారు.

ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో
"వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప
పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక
దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే
వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు
ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప
వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం
కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక
మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ
రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో
యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై
తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో
అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ
వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల
గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు
రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య
దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో
పెరుర్తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో
అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి
శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే
అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ
నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు
వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన
చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి
పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది
చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది.
ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై
పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం
కాళినడకన వెళ్ళాలి.

సన్నిధానం
భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై
పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం
ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష
తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి"
అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు
ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు.
40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ
మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో
మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18
మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను
ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18
వాయిద్యాలను మ్రోగించారట.

సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న
భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి
కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన
ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు

అయ్యప్ప స్వామి
ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా
పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ
భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు), అప్ప శివుడు) అని
పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే
రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై
హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శశబరిమలైలో
అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన
దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే
"కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్
కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను
పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా
ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు

జనన కారణము :
1.క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు
అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి
కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న
మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
2. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ...
తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు
వారము పొంది ... తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష
నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు
భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను .
శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి
భస్మాసుర వధ గావించెను .
ఏది ఏమైనా ... వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము,
30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా
లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల
కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ
ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో
శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి . ఇలా
హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష ను
సంహరించాదానికే ... ఈ మహిష ఎవరు ? .

పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మించిన
దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్యలైన - సరస్వతి
,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మించిన 'లీలావతి'ని పెళ్లి
చేసుకుంటాడు . లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని
దత్తాత్రేయుల వారు అంటే ... మరికొంతకాలము ఇక్కడే
సుఖిద్దామని భార్య కోరగా , దత్తు నకు కోపము వచ్చి" మహిషి " గా
జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను
"మహిష " గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు ...
రంబాసురుడు అనే రాక్షసుడు కి యక్షకి దత్తుడు
మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి
లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దిని తో
(దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి
బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని
వారము అడుగుతుంది . పుట్టిన వానికి గిట్టక తప్పదు ... అని
ఇంకో వారము కోరుకోమంటాడు బ్రహ్మ . హరి హర సుతుని చేతిలో
తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా వరము కోరిననది . హరి
హరులు వివాహమాడారు గదా .. వారికి బిడ్డ పుట్టాడనే తెలివితో
కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష
మరణిస్తుంది .
మహిషి వధ

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను
చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని
హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి
వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని
వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో
వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం
చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య
జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ
దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా
ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు.
అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను
చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి
మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు.
ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు.
ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా
మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం
చేరుతాడు.

అయ్యప్ప చరితము :
హరి హర పుత్రుడైన అయ్యప్ప పందల రాజ్యాన్ని పాలించే
"రాజషేఖరపాన్ద్యుడు "నకు పంపానదీ తీరాన లభిస్తాడు . సర్పం
నీడన పవళించి ఉన్న అతనికి " మణికంఠుడు " అని పేరు పెట్టి
విద్యా బుద్దులు నేర్పిస్తాడు .
మనికంటుడు అనగా మన అయ్యప్ప స్వామి .. గురుకులం లో
చదువుకునే రోజుల్లో వారి గురువు ఎడల్ అత్యంత భక్తీ
శ్రద్దలతో వుండేవాడు . సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ
గురువు ద్వార సకల విద్యలు నేర్చుకున్నాడు . అయితే
గురుదక్షిణగా గురువు కోరికపై అంధుడు , ముగావాడైన ఆయన
పుత్రునికి మాట , ద్రుష్టి ప్రసాదించి తన గురుభక్తిని
చాటుకున్నాడు . ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్న
"వానరుడనే " బందిపోటు దొంగను ఓడించి అతనికి దివ్యత్వాన్ని
బోధించాడు .
తండ్రి అప్పజేప్పబోయిన సింహాసనాన్ని త్యజిస్తాడు
మనికంటుడు . ఆయన కోరికమేర తను బాణం వేసిన చోట ఓ
ఆలయం నిర్మించి ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు తండ్రి .
అదే శబరిమల ఆలయము . అందులో మనికంటుడు అయ్యప్ప
స్వామి గా అవతరిచాడు .
ఎవరైతే నియమ నిష్టలతో సేవించి "పదునేట్టాంపడి " నెక్కి దర్శిస్తారో
వారికి ఆయురారోగ్య ఇష్వర్యాలను పర్సాదిస్తాడు . మాటలు రాణి
వారికి మాటలు వచ్చే మహిమాన్వితమైన ప్రదేశమిది . చూపులేనివారికి
చూపునిచ్చే కన్నుల పండువైన ప్రదేశమిది . భగవంమహిమ
కలిగిన శబరిమలై లో గల దివ్య ఔషధాల వనములికా పరిమళ ప్రభావం
తో కూడిన ప్రాణవాయువును పీల్చగానే ఎంతటి అనారోగ్యమైనా
చక్కబడుతుంది . సంతానము , సౌభాగ్యము , ఆరోగ్యము ,
ఐశ్వర్యము మొదలైన కోరిన వరాలనిచ్చే స్వామి అయ్యప్ప .
Read More

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మద్దిలేటి, కర్నూలు జిల్లా.శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మద్దిలేటి, కర్నూలు జిల్లా.

కర్నూలు జిల్లా, బేతంచెర్ల మండలం R.Sరంగాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ క్షేత్రం మహిమాన్నితమైనది. ఈ క్షేత్రం నిరంతరం భక్తులతో స్వామివారి మహిమలతో విరాజిల్లుతోంది. భక్తులు ముఖ్యంగా శనివారాలలో ఈ స్వామివారికి తలనీలాలు అర్పించి, మద్దిచెరువు అనే కోనేరులో స్నానమాచరించి మెట్ల మార్గంలో స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారు వెలసిన రోజు ఫాల్గుణశుధ్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం ఆ రోజున భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.


నరసింహస్వామి ఒకసారి లక్ష్మీదేవితో పాచికలాడి ఓడిపోయాడట లక్ష్మీదేవి పరిహాసంగా నవ్విందనే కోపంతో స్వామివారు లక్ష్మీనివాసాన్ని వదిలి ఎర్రమల కొండలలోని యాగంటి క్షేత్రానికి వచ్చాడట. కారణం ఏమిటని శివుడు ప్రశ్నించగా నేను కూడా ఇక్కడే ఉంటానని సమాధానమిచ్చి ఈ ప్రాంతంలో ఉడుము రూపం ధరించి సంచరిస్తుండగా ఒక బోయవాడు పట్టుకొనుటకు వెంబడించి అలసిపోయి ఒకచెట్టు క్రింద నిద్రించగా స్వామి కలలో కనిపించి తను శిలారూపంలో ఈ ప్రాంతంలో ఒక పుట్టలో వెలసినట్లుగా అందుకే ఉడుము రూపంతో నిన్ను ఇక్కడకు రప్పించినట్లుగా చెప్పాడట. నిద్రమేల్కొన్న బోయవాడు ఈ ప్రాంతంలో వెదకి పుట్టను కనుగొని తవ్వగా అందులో స్వామివారు విగ్రహరూపంలో దర్శనమిచ్చినట్లుగా చెబుతారు.
Read More

శ్రీ వైద్యనాధేశ్వరాలయం-పుష్పగిరిశ్రీ వైద్యనాధేశ్వరాలయం-పుష్పగిరి

కడపజిల్లా, పుష్పగిరి గ్రామంలో, పినాకినీ నదీ తీరాన ఈ ఆలయం కలదు. ఈ దేవాలయం అతి ప్రాచీనమైనది. ఆయుర్వేద స్వరూపుడైన ధన్వంతరి, పరమేశ్వరుని గూర్చి, ఈ పుష్పగిరి యందు తపస్సు చేయగా, ఆయనకు పరమేశ్వరుడు వైద్యనాధునిగా దర్శనమిచ్చి, వైద్యవిద్యను- ఔషద రహస్యాలను లోకాలకు వెల్లడించమని ఆదేశించాడు. తరువాత ధన్వంతరి కోరికపై ఆ ప్రదేశమునందు పరమేశ్వరుడు లింగరూపంలో వెలిసాడు.

ఒకసారి ఆదిశంకరాచార్యులు స్వామివారిని దర్శించి ఈ ప్రదేశంలో శ్రీచక్రాన్ని ప్రతీష్ఠించారు. తరువాత కాలక్రమంలో ఈ ఆలయ ఆవరణలోనే త్రికూటేశ్వరాలయం, భీమేశ్వరాలయం, ఉమామహేశ్వరాలయం కూడా నిర్మింపబడ్డాయి. ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు చైత్రబహుళ త్రయోదశి నుండి తొమ్మిది రోజులు జరిగే పుష్పగిరి తిరునాళ్ళ ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి.
Read More

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, తూర్పు యడవల్లి, పశ్చిమగోదావరి జిల్లా.శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, తూర్పు యడవల్లి, పశ్చిమగోదావరి జిల్లా.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో తూర్పు యడవల్లి అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ దేవాలయం అతి సుందర కళావైభవంతో 52 అడుగుల రాజ గోపురంతో, 14 అడుగుల ఎత్తుతో సింహద్వారము మరియు ఆలయ ముఖమండపంలో ఉన్న స్థంభాలపై గజరాజులు, నాగమోహిని మొదలగు శిల్పాలు కళావైభవం ఉట్టిపడేలా ఉన్నాయి. ఆలయ పైభాగంలో 12 రాశుల చిహ్నాలు వాటిమధ్య చిన్నికృష్ణుని శిల్పం అత్యంత మనోహరంగా, దేవాలయానికే వన్నెతెచ్చేట్లుగా ఉన్నాయి.

ఈ ఆలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య హస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ గావించబడినది. ఆ తరువాత ఈ దేవాలయాన్ని ద్వారకా తిరుమల దేవస్థానంవారు దత్తత తీసుకొని మరింత అభివృధ్ధి చేశారు.


ఈ ఆలయంలో పాంచరాత్రాగమాను సారము అర్చనాకార్యక్రమములు, ఉత్సవములు జరుపుతారు. నిత్యపూజలతో పాటు శ్రీరామనవమికి కల్యాణ ఉత్సవము, వసంతోత్సవము అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాలనుండి భక్తులు ఎక్కువసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులవుతారు.

Read More

శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం, శ్రీకాకుళం.శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం, శ్రీకాకుళం.

శ్రీకాకుళంలో వంశధార నదీతీరాన ఈ ఆలయం ఉండి. ఇది అతి పురాతన మరియు మహిమాన్నితమైనదిగా ప్రసిధ్ధి చెందినది. ఈ ఆలయంనందు శ్రీ ఉమారుద్రకోటేశ్వరుడు ప్రధాన మూర్తిగా భక్తులకు దర్శనమిస్తుండగా, మండపమునందు నవగ్రహాలు కొలువై ఉన్నాయి.

స్థలపురాణం


బలరాముడు ప్రతీష్టించిన పంచలింగ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పబడినది. మహాభారత యుద్దంలో ఎందరో రాజులు, సన్నిహితులు, బంధువులు మరణించిన వార్త విన్న బలరామునికి మనసు కలతచెంది తరుణోపాయం చెప్పమని శ్రీకృష్ణుడిని అడగగా వివిధ పుణ్యప్రదేశాలలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించమని సూచించాడు. ఆ ప్రకారం బలరాముడు ఈ ప్రదేశానికి వచ్చి తన ఆయుధమైన నాగలితో ఒక నదిని ప్రవహింపచేసి ఆ నదీ తీరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించుటకు సిధ్ధమవగా ఆ లింగమునందు రుద్రకోటిగణములు కనిపించటం వలన బలరాముడు ఈ లింగానికి రుద్రకోటేశ్వరునిగా నామకరణం చేసి పూజించినట్లు స్థలపురాణం.Read More

శ్రీ సంజీవరాయస్వామి ఆలయం, వెల్లాల, కడపజిల్లా.శ్రీ సంజీవరాయస్వామి ఆలయం, వెల్లాల, కడపజిల్లా.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు 20 కిలోమీటర్ల దూరంలో కుందూనది ఒడ్దున వెల్లాల అనే గ్రామంనందు ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ భీమలింగేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలు ఉన్నవి. ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులు కొలువుదీరినా సంజీవరాయునికున్న వైభవం చాలా గొప్పది.

స్థలపురాణం


సంజీవరాయుడు అంటే శ్రీ ఆంజనేయస్వామివారు. సంజీవిని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూనది సమీపంలో ఒక గుండంలో స్నానం చేసి, సూర్య భగవానునుకి ఆర్ఘ్యం సమర్పించినట్లు స్థలపురాణం. అందువలన ఆ గుండానికి హనుమంతుగుండం అనే పేరు వచ్చింది. సంజీవిని కోసం వెళ్తున్న స్వామివారు కాబట్టి ఆయనను సంజీవరాయునిగా భక్తులు కొలుస్తున్నారు. గుండం దగ్గర రాతిమీద స్వామివారి పాదముద్రలు కనిపిస్తాయి.

సంజీవరాయుని దర్శనం కోసం ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. గ్రహదోషాలను తొలగిస్తాడని, దీర్ఘవ్యాధి బాధలనుండి దూరంచేస్తాడని, కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ నిత్య పూజలతో పాటు, పండుగ పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. హనుమ జయంతి నాడు ప్రత్యేక ఉత్సవాలను జరిపిస్తారు.
Read More

అమ్మవారు-కాళికాదేవిఅమ్మవారు-కాళికాదేవి

లోకకల్యాణం కోసం ఆదిపరాశక్తి అనేక రూపాలను ధరిస్తూ వచ్చింది. అమ్మవారు ప్రశాంతమైన వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ... అభయ వరద హస్తాలతో కొలువుదీరి వుంటే, భక్తులు నయనానందకరంగా దర్శించుకుంటూ వుంటారు. ఇక ఆ తల్లి కాళికాదేవిగా కొలువై వుంటే చూడటానికే కొంతమంది సంశయిస్తుంటారు.

నల్లని మేని రంగుతో ... చెదిరిన జుట్టుతో ... వెన్నులో వణుకు పుట్టించే చూపులతో ... రక్తం అంటిన ఎర్రని నాలుకను బయటికి చాపి అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. జగన్మాతగా చెప్పబడుతోన్న అమ్మవారు ఎందుకు ఇంతటి భయంకరమైన రూపాన్ని ధరించిందనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. కాళికాదేవి రూపాన్ని అమ్మవారు ధరించడం వెనుక కూడా లోకకళ్యాణమే కనిపిస్తుంది.


'రక్తబీజుడు' అనే రాక్షసుడు వరబలగర్వంతో దేవతలను ... సాధుసజ్జనులను వేధిస్తుంటాడు. వాళ్ల అభ్యర్థన మేరకు ఆ రాక్షసుడిని సంహరించడానికి కుమారస్వామి రంగంలోకి దిగుతాడు. అయితే ఆ రాక్షసుడి శరీరం నుంచి కిందపడిన ఒక్కో రక్తపు చుక్క నుంచి మరో రక్తబీజుడు పుట్టుకొస్తుంటాడు. దాంతో అసహనానికి లోనైన కుమారస్వామి తన తల్లిని ప్రార్ధిస్తాడు.

అప్పుడు పార్వతీదేవి ... కాళికాదేవి రూపాన్ని ధరిస్తుంది. కుమారస్వామి రక్తబీజుడిని సంహరిస్తూ వుండగా, ఆ అసురుడి శరీరం నుంచి చిందిన రక్తం నేలపై పడకుండా తన నాలుకను చాపలా పరుస్తుంది. దాంతో కుమారస్వామితో ఒంటరిగా పోరాడలేకపోయిన రక్తబీజుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోతాడు. అలా లోకకల్యాణం కోసం అమ్మవారు అంతటి భయానకమైన రూపాన్ని ధరించినా, ఆ రూపం వెనుక కన్నతల్లి వంటి ఆమె చల్లని మనసు భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటుంది.
Read More

శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనదిశ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది. సకల పాతకాలను రూపుమాపి భవబంధాలను తొలగించగల తారకమంత్రము. కలియుగంలో మానవులు తరించగల మార్గము. ‘రా’ అంటే మన పెదవులు విడివడి మనలోని పాపాలన్నీ బయటకుపోయి ‘మ’ అన్నప్పుడు పెదవులు మూసుకుని తిరిగి వాటిని లోపలికిపోకుండా చేస్తుంది. రామనామ జపం సకలార్థ సాధనం, మోక్షప్రదాయం.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే


‘‘రామ రామ రామ అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే విష్ణు సహస్ర నామ పారాయణ చేసినంత ఫలం’’ అని శివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం. పరమేశ్వరుడు కూడా శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉంటాడట.

‘రామ’ శబ్దం అత్యంత సులభంగా ఉండి ఆబాలగోపాలం నోట పలకటానికి అనువుగా ఉంటుంది. ‘శ్రీరామ’ అనే శబ్దం వల్ల అనేక శుభాలు కలుగుతాయ కనుక ఆ నామాన్ని కోటిసార్లు వ్రాయడం. నేటికీ ఎందరో భక్తులు ‘రామకోటి’ వ్రాస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖంగా జీవించగలుగుతున్నారు. కొన్ని ప్రముఖ రామాలయాలలో రామకోటి రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేసే శ్రీరామనామ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీరామ నామాన్ని నిరంతరం జపించటం వలన శత్రుపీడలు, సకల రోగాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవించగలుగుతారు. ‘శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష!’- తెలిసి పలికినా తెలియక పలికినా రామనామం రక్షిస్తుంది. చంటి పిల్లలకు స్నానం చేయించాక చివరలో ‘శ్రీరామరక్ష’ పెట్టటం తల్లులందరికీ అలవాటు. ఏ కష్టం కలిగినా ‘శ్రీరామచంద్రా! నీవే దిక్కు’ అని అనుకోవటం అనాది నుండి వస్తున్న ఆనవాయితీ! తుమ్మినా ‘రామచంద్రా!’, క్రింద పడినా ‘రామచంద్రా!’, ఆకలి వేసినా ‘అన్నమో రామచంద్రా!’ అంటూ ఉండే సామాన్య జనులకు కూడా అండదండగా ఉండి ఆదుకుని కాపాడేది రామనామమే!
Read More

ఆంజనేయుని రామభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.ఒకసారి ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో తన స్వామి అర్థాంగియైన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ 'హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తాను' అని అన్నది.

అప్పుడు హనుమంతుడు 'అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకమ్మా' అని ప్రశ్నించాడు. "దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు" అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు.


సీతమ్మ ఆశ్చర్యపడి 'హనుమా ! శరీరమంతా సింధూరం ఎందుకు పూసుకొన్నావు ?' అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై 'సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని' సమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని స్వామి భక్తికి సంతోషపడి హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని రామభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.


Read More

అగస్త్య మహర్షి సలహా ప్రకారం శబరిమల మీద అయ్యప్పస్వామి దేవాలయాన్ని18 మెట్లతో నిర్మించారు.

అగస్త్య మహర్షి సలహా ప్రకారం శబరిమల మీద అయ్యప్పస్వామి దేవాలయాన్ని18 మెట్లతో నిర్మించారు. ధర్మశాస్త ఆదేశానుసారం పరశురాముడు అయ్యప్ప విగ్రహమును తయారుచేయుటకు శబరిమలకు వెళతాడు. పరశురాముడు మకర సంక్రాంతినాడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. "ఎవరైతే 41 రోజులు నా దీక్షను నియమాలతో ఆచరించి, బ్రహ్మచర్యం చేసి, మంచి పనులు చేస్తూ, నా దర్శనానికి వచ్చేటప్పుడు ఇరుముడిని తలమీద పెట్టుకుని, పంబలో స్నానమాచరించి, నా నామస్మరణ చేస్తారో వారు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కుటకు అర్హులు, వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను" అని స్వామి తెలిపాడు. "గంగానది అంత పవిత్రమైనది పంబానది, కాశి అంతటి పుణ్యమైనది ఈ శబరిమల. మకర సంక్రాంతి నాడు నా కోసం చేయించిన ఆభరణాలను నాకు అలంకరించండి" అని తెలిపాడు అయ్యప్ప.
Read More

శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది.శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది. సకల పాతకాలను రూపుమాపి భవబంధాలను తొలగించగల తారకమంత్రము. కలియుగంలో మానవులు తరించగల మార్గము. ‘రా’ అంటే మన పెదవులు విడివడి మనలోని పాపాలన్నీ బయటకుపోయి ‘మ’ అన్నప్పుడు పెదవులు మూసుకుని తిరిగి వాటిని లోపలికిపోకుండా చేస్తుంది. రామనామ జపం సకలార్థ సాధనం, మోక్షప్రదాయం.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే


‘‘రామ రామ రామ అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే విష్ణు సహస్ర నామ పారాయణ చేసినంత ఫలం’’ అని శివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం. పరమేశ్వరుడు కూడా శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉంటాడట.

‘రామ’ శబ్దం అత్యంత సులభంగా ఉండి ఆబాలగోపాలం నోట పలకటానికి అనువుగా ఉంటుంది. ‘శ్రీరామ’ అనే శబ్దం వల్ల అనేక శుభాలు కలుగుతాయ కనుక ఆ నామాన్ని కోటిసార్లు వ్రాయడం. నేటికీ ఎందరో భక్తులు ‘రామకోటి’ వ్రాస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖంగా జీవించగలుగుతున్నారు. కొన్ని ప్రముఖ రామాలయాలలో రామకోటి రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేసే శ్రీరామనామ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీరామ నామాన్ని నిరంతరం జపించటం వలన శత్రుపీడలు, సకల రోగాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవించగలుగుతారు. ‘శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష!’- తెలిసి పలికినా తెలియక పలికినా రామనామం రక్షిస్తుంది. చంటి పిల్లలకు స్నానం చేయించాక చివరలో ‘శ్రీరామరక్ష’ పెట్టటం తల్లులందరికీ అలవాటు. ఏ కష్టం కలిగినా ‘శ్రీరామచంద్రా! నీవే దిక్కు’ అని అనుకోవటం అనాది నుండి వస్తున్న ఆనవాయితీ! తుమ్మినా ‘రామచంద్రా!’, క్రింద పడినా ‘రామచంద్రా!’, ఆకలి వేసినా ‘అన్నమో రామచంద్రా!’ అంటూ ఉండే సామాన్య జనులకు కూడా అండదండగా ఉండి ఆదుకుని కాపాడేది రామనామమే!
Read More

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలిహనుమదాలయానికి వెళ్లిన ప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కొనాలి. సకల రోగ, భూత ప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్ట కి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ పఠించవలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'


శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసిచివరిలో స్వామికి విశేషర్చన జరిపించి'' మయాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వర దో భూత్వా మామాభిష్ట సిద్దం ద దాతు'' అని జలమును అక్షత లతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

అభి షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కావున ఆయనకు అభిషేకం ఇష్టం. అందునా మన్యు సూక్త భిషేకంచే పర మానంద భరితుదౌతాడు. కోరికలి తీ రుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర నాడు తప్పక చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగల్గుట మరీ మంచిది.
Read Moreసింహాచలం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి చందనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అప్పన్న నిజరూప దర్శనంతో భక్తులు తరించారు. ఏడాది పొడవునా చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుధ్ధ తదియ నాడు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దీనినే చందన యాత్రగా పిలుస్తారు.


ఉత్సవంలో భాగంగా స్వామివారిని అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుప్రభాత సేవతో మేల్కొల్పి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య అప్పన్నదేహంపై ఉన్న చందనాన్ని బంగారు వెండి బొరిగెలతో తొలగించి అనంతరం పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించి ప్రత్యేక అర్చన నిర్వహించారు.

సుందర దివ్యతేజో స్వరూపుడైన స్వేతవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని కనులారా వీక్షించి భక్తులు పునీతులయారు.
Read More

పొన్నూరు, గుంటూరు జిల్లా, శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి

పొన్నూరు, గుంటూరు జిల్లా.
పురాణ ప్రసిధ్ధి చెందిన శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి బ్రహ్మ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు యోగ నరసింహుడిగా భక్తులకు అభయమిచ్చాడు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం తిరువంజనోత్సవాన్ని జరిపారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన సింహవాహనంపై శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. యోగ నరసింహుడిగా అభయమిచ్చిన శ్రీ సాక్షిభావన్నారాయణ స్వామిని దర్సించుకునేందుకు వివిధ ప్రాంతాలనుండి భక్తులు విశేషంగా తరలివచ్చారు.


Read More

చింతపల్లి, విశాఖ జిల్లా, ముత్యాలమ్మ అమ్మవారి నూతన ఆలయంచింతపల్లి, విశాఖ జిల్లా.
శుక్రవారం ఉదయం ముత్యాలమ్మ అమ్మవారి నూతన ఆలయం, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అమ్మవారికి వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమ పూజలను నిర్వహించారు.

అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వందలాది భక్తులు హిందూ సంప్రదాయం ప్రకారం సారెను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.


Read More

నెమలి, కృష్ణా జిల్లా.నెమలి, కృష్ణా జిల్లా.

ప్రసిధ్ధ పుణ్యక్షేత్రమైన నెమలిలోని వేణుగోపాలస్వామిని సోమవారం చందనంతో అలంకరించారు. వైశాఖమాసంలో ఉష్ణతాపం నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు చందనంతో అలంకరిస్తారు. గురువారం వరకు స్వామివారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.


స్వామివారి మాస కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు దంపతులు పీఠలపై కూర్చొని స్వామివారికి కన్యాదానం చేశారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.Read More

శ్రీకాకుళం పట్టణంలోని ఇలిసుపురం ప్రాంతంలో కొలువుదీరిన భద్రమహంకాళిశ్రీకాకుళం జిల్లా.

శ్రీకాకుళం పట్టణంలోని ఇలిసుపురం ప్రాంతంలో కొలువుదీరిన భద్రమహంకాళి అమ్మవారి అనుపు ఉత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది గతనెల 12న ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమలతో, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు దప్పు వాయిద్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు, విచిత్ర వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు ఆలయం వద్ద ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ముర్రాటలు సమర్పించి మొక్కుకున్నారు.Read More

భక్త మార్కండేయ దేవాలయం, కొత్తవాడ-పద్మనగర్, వరంగల్.భక్త మార్కండేయ దేవాలయం, కొత్తవాడ-పద్మనగర్, వరంగల్.

వరంగల్ పట్టణంలోని కొత్తవాడ-పద్మనగర్ లో 2006లో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. సరస్వతీ పీఠాధిపతులు పరమహంస రామానందస్వామి చేతులమీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నాటి నుండి ప్రతిరోజూ అనేక పూజాకార్యక్రమాలు, హోమాలు, అభిషేకాలు జరపబడుతున్నాయి.

ఆలయంలో భక్త మార్కండేయ విగ్రహానికి కుడివైపు మహాగణపతి విగ్రహం, ఎడమ వైపు గాయత్రిమాత విగ్రహం ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతి మంగళ, శని వారాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ఆవరణలో నవగ్రహాల ప్రతిమలను ఏర్పాటు చేశారు.


ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం సుప్రభాతసేవ, మహాగణపతి ఆరాధన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ప్రతినెల మొదటి సోమవారం ప్రత్యేకంగా మహారుద్ర హోమం జరుపుతారు. అలాగే సంవత్సరంలో నాలుగు విశిష్ఠ మహాపూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Read More

శ్రీనివాసుని నిజరూప దర్శనంశ్రీనివాసుని నిజరూప దర్శనం

నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.
Read More

గోదాదేవి భక్తిగోదాదేవి భక్తి

విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుని ముద్దుల తనయ గోదాదేవి. తాన్నున్న ఊరినే రేపల్లెగా భావించేది. తన చెలులనే గోపీజనులుగా అనుకొనేది. అలా అనుకునే కోవై - గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించా లనుకొంది. మాసాల్లో మార్గశిరం తానని చెప్పిన శ్రీకృష్ణుని తలుచుకుని వెంటనే ధనుర్మాసంలో తన చెలులకు హితబోధచేస్తూ రోజుకొక్క పాశురాన్ని పాడుతూ సిరినోమునోచింది. నోము సమాప్తి చేస్తూ ఆ రంగరంగనితో అంగరంగ వైభోగంతో వివాహం చేసుకొంది. ఆ రంగనిలోనే ఐక్యమైంది. ఆ నాడు పాడిన ఆ తల్లి పాడిన పాశురాలనే నేడు ప్రతివైష్ణవా లయాల్లోనూ అనుసంధానిస్తూ గోదా వ్రతం చేస్తున్నారు భక్తజనసందోహమంతా. ఆ భక్తజనులు ఆలపించే కీర్తనలు నాడు మాలదాసరి ఆలపించిన కైకశిరాగాలాపనను అనుభవంలోకి తెప్పిస్తాయ. ఈ నాడు కూడా తన భక్తులను అలరించేందకు, వారి కోరికలను తీర్చేందుకు వైకుంఠం నుంచి లక్ష్మీ వల్లభుడైన రంగడు సతీ సమేతుడై వచ్చినిల్చున్న అనుభూతిని పొందుతున్నారు రంగని భక్తులు.
Read More

లక్ష్మీదేవి రూపంలక్ష్మీదేవి రూపం

ఈ ప్రపంచంలో ఏది, ఎవరికి, ఎంత, ఎప్పుడు, ఎలా అవసరమో గమనించి తగిన విధంగా అందించే ప్రకృతి స్వరూపమే లక్ష్మీదేవి. సర్వజగతికీ, సర్వసంపదల మూల స్వరూపము కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. మట్టి అనే మూలధాతువు వివిధ వస్తువులుగా అయినట్లే, లక్ష్మీ దేవి కరుణ మాత్రమే సిరిసంపదలను కలగజేస్తుంది. ఆ తల్లి ఎవరిని వరిస్తుందో వారే ధన్యులు. లక్ష్మీదేవిని చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.

యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్యపురాణంలో ఇలా చెప్పారు. "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి, ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాలా కంకణధారియై ఉండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలుఉండి, పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ, చక్ర , గదా, పద్మ, ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై ఉండును.


స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.
Read More

సీత – కాకి కథసీత – కాకి కథ

శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలను గ్రహించి వెళ్ళిన తరువాత రాముడు, సీతా, లక్ష్మణుడు చిత్రకూట పర్వతానికి చేరారు. ఆ పర్వత ప్రాంతంలో సీతారాములు సుఖమయంగా జీవిస్తున్న రోజుల్లో ఒక రోజున ఆ కొండకు ఈశాన్య దిక్కున కింది భాగంలో ఉన్న సెలయేళ్ళు ప్రవహించాయి. సుందర ప్రదేశానికి సీతారాములు చేరుకున్నారు. అనేక పరిమళ పుష్పభరితమైన తరువులతో, పండ్లతో నిండి ఉన్న చెట్లతో ఆ ప్రదేశమంతా అలరారుతుంది. సీతాదేవి ఆ సెలయేటిలో స్నానం చేసి పక్కనే ఉన్న కొండ బండ మీద బట్టలను తడి ఆర్చుకుంటున్నప్పుడు ఇంద్రుడి పుత్రుడు గర్వంతోనూ, మూర్ఖత్వంతోనూ కాకి రూపంలో అక్కడకు వచ్చి సీతాదేవిని ముక్కుతో పొడిచాడు. ఆమె పక్కనే వున్న మట్టి గడ్డలను తీసి ఆ కాకి మీద విసిరి కొట్టింది. అయినా మరి కొద్దిసేపు దూరంగా వెళ్ళినట్టే వెళ్ళి ఆ కాకి మళ్ళీ వచ్చి సీతాదేవిని బాధించసాగింది. రాముడు రాగానే కాకి ఎటో వెళ్ళిపోయింది.


ఆ ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు సీతారాములిద్దరూ ముచ్చటించుకున్నారు. మంద్రమలయ మారుతం వీస్తుండగా రాముడికి మెల్లగా కునుకు పట్టింది. సీత ఆయనకు తలను తన ఒడిలో పెట్టుకొని నిద్ర పుచ్చుతున్నప్పుడు కాకి మళ్ళీ వచ్చి తన ముక్కుతో, కాళ్ళతో సీతను రక్కి పొడిచింది. ఆ గాయం నుండి స్రవించిన రక్త బిందువులు శ్రీరాముడి మీద పడ్డాయి. వెంటనే ఆయనకు మెలకువ వచ్చింది. తన మీద రక్తపు బొట్లు పడటానికి కారణం తెలుసుకోవటానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన ఎదురుగా ముక్కుకు, గోళ్ళకు రక్తం అంటి ఉన్న కాకిని చూసి తాను కూర్చున్న దర్భాసనం నుండి ఒక దర్బను తీసి దాన్ని మంత్రించి బ్రహ్మస్త్రంగా కాకి మీదకు ప్రయోగించాడు. ఆ బ్రహ్మస్త్రం కాలాగ్ని లాగా జ్వలిస్తూ కాకిని వెంటబడి తరమసాగింది.

అప్పుడు ఆ కాకి తనను తాను రక్షించుకోవటానికి దేవేంద్రుడి దగ్గరకు మిగిలిన అన్ని లోకాలకు తిరిగింది. కానీ రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుని కాకిని రక్షించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అప్పుడా కాకి లోకాలన్నీ తిరిగి తిరిగి చివరకు రాముడి వద్దకే వచ్చి ఆయన పాదాల మీద పడి శరణు వేడింది. శరణన్న వారిని రక్షించే తత్వం ఉన్న శ్రీరామ చంద్రుడు ఆకాకికి అభయమిచ్చాడు. కానీ అంతలోనే మరి తాను ప్రయోగించిన బ్రహ్మస్త్రానికి తిరుగుండదని మరి ఆ అస్త్రం మాటేమిటని కాకిని అడిగాడు. అప్పటికి కానీ గర్వాంధుడు, మూఢుడు ఆయిన కాకికి తాను చేసిన తప్పేమిటో పూర్తిగా తెలిసివచ్చింది. ఎంతో మంచి మనసుతో తనకు అభయమిచ్చిన శ్రీరామ చంద్రుడు ప్రయోగించిన బ్రహ్మస్త్రాన్ని తాను గౌరవించటం తన విధి అని అలా చేసయినా తనవల్ల జరిగిన తప్పునకు కొంతవరకైనా పరిహారాన్ని చెల్లించుకోవాలన్న ఒక ఆలోచనకు ఆ కాకి వచ్చింది. వెంటనే రాముడి పాదాల మీద తన తలను వాల్చి బ్రహ్మస్త్రం వ్యర్ధం కాబోదని అది తన కుడి కన్నును తీసుకోవచ్చని కాకి వినయంగా రాముడికి చెప్పింది. కాకి అన్నట్లుగానే రాముడు ప్రయోగించిన బ్రహ్మస్త్రం కాకి కుడి కన్నును దహించి వేసింది. దాంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అయి ఎలాగో ఒకలాగా ప్రాణాలను దక్కించుకుంది ఆ కాకి. తాను ఇంద్రుడి కొడుకునన్న ఒక అహంభావం వల్ల ఆ కాకి చివరకు అలా తన కన్నును పోగొట్టుకోవలసి వచ్చింది. రామాయణ కథలో కనిపించే ఎంత చిన్న సంఘటన అయినా మానవాళికి నిత్యం ఏదో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేదిగా ఉండి తీరుతుందనటానికి ఈ కథ ఒక చక్కని ఉదాహరణ
Read More

ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యనారాయణుడు

"ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్" అని వేదోక్తి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అలాంటి ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యనారాయణుడు. ప్రత్యక్షంగా కనబడే ఏకైక భగవానుడు కాబట్టే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడన్నారు. సూర్యనారాయణమూర్తి అత్యల్ప సంతోషి కూడా. "ఆదిత్యో నమస్కార ప్రియః". ఆయన ఎదురుగా నిలచి చేతులు రెండు శిరసు పై జోడించి నమస్కరిస్తే చాలు, అడిగినవన్నీ ప్రసాదించే దైవం ఆయన. ఇంద్రధనుస్సులోని ఏడు రంగులను ప్రతిఫలించే ఏడు అశ్వాలను పూన్చిన, ఒకే చక్రం కలిగిన రథం సూర్యనారాయణుని వాహనం. సూర్యుని ద్వాదశ నామాలు - మిత్ర, రవి, సుర్య, ఖగ, అహను, పూషణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర.
Read More

ఆర్ధిక సమస్యలనుండి కాపాడి లక్ష్మీకటాక్షం పొందుదురుఆర్ధిక సమస్యలను పారద్రోలుటకు చేయుచున్న పనులయందు ధనలాభం చేకుర్చుటకు అప్పుల ఊభి నుండి మానవులను బయటకు తీసి ప్రసాంతత చేకుర్చుటకు ధనలక్ష్మి కటాక్షం పొందుటకు ఆర్ధిక సమస్యలనుండి కాపాడి లక్ష్మీకటాక్షం పొందుదురు ఈ యంత్రము వలన ధనలాభం చేకూరును మానవులకువ్యాపార అభివృద్దికి కలుగ జేసి దినదినాభివృద్ది తో మానవులు ఆర్దికభాధలు లేకుండా చేసి కుటుంబము ఆనందముగా జీవించుటకు ఉపయోగపడి ఇంటిలోనవారందరికి వర్చస్సు, ఆర్ధిక పుష్టి కలుగజేసి ఆనందమయ జీవితం గడుపుటకు దోహదపడును. ఈ యంత్రం ఇంటిలో దేవుని మందిరం నందు ఉంచి ప్రతీ రోజు ఈ మంత్రంజపించవలెను. " ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః" అని కనీసం 11 సార్లు యంత్రమును చుస్తూ పఠించి మనసున మీరు కోరిన కోరికను యంత్రములో ఉన్న మహాలక్ష్మి దేవికి విన్నవించుకోవలెను. మీ ఏకాగ్రత శ్రద్ధ భక్తి తో మీరు అమోఘమైన ఆర్ధిక విజయాలు సాదింతురు.


ఈ యంత్రం వ్యాపార స్థలం లో తూర్పు ఈశాన్యం లేక ఉత్తరము ను చూచునట్లు గా యజమాని కుర్చునున్న కుర్చీ వెనుక గోడకు స్తాపన చేసిన యెడల యంత్రము నుంచి ప్రసరించు అద్భుతమైన శక్తీ కిరణములు ల వలన యజమానికి మంచి తేజస్సు ఆకర్షణ శక్తీ లభించి మంచి ప్రశాంత చిత్తము కలిగి వ్యాపారాభివ్రుది జరుగును సమస్త జనులకు ధనాకర్షణ యంత్రం ఆకర్షణకు గురిచేసి వ్యాపారాభివ్రుదికి పూర్తిగా ఉపకరించును ప్రతిరోజూ దుకాణం తెరచిన వెంటనే మనః పూర్వకముగా యంత్రమునకు నమస్కరించవలెను దుకాణం మూసేటప్పుడు యంత్రమునకు నమస్కరించవలెను.
Read More

హనుమంతుని సంకల్పంహనుమంతుని సంకల్పం

రామాయణంలో ఆంజనేయుడు సీతానే్వషణకు ఉపక్రమిస్తాడు. మొదట ఆయన అనుకున్నది తడవగా ఆమె జాడకై వెతకలేదు. ముందుగా ఆ స్వామి మనసులో బలంగా సంకల్పం చేసుకున్నాడు. మనసులో ఆ రాముడిని స్మరించుకుని ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనాసరే నేను సీతమ్మ జాడను కనిపెడతాను. ఆ రామయ్య వద్దకు సీతమ్మని చేరుస్తాను అని మనసులోనే బలంగా సంకల్పించుకున్నాడు. అతను అంత బలంగా సంకల్పించుకోవడం చేతనే ఆయన అంత పెద్ద సముద్రాన్ని సైతం అవలీలగా దాటిసాగాడు. రాక్షసులు ఎంత ప్రయత్నించినా చిక్కకుండా వారిని ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి సీతమ్మను చూశాడు. ఆ విషయాన్ని శ్రీరాముడికి తెలియజేశాడు. అలా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు.


ఈ సంకల్పం అనేది ఎంత బలంగా వుంటే అంతే వేగంగా కోరికలు కార్యరూపం దాల్చుతాయి. సంకల్పం బలహీనమైతే కోరికలు ఎట్టి పరిస్థితులలో నెరవేరవు. అసలు ఈ సంకల్పం అంటే ఏమిటి. అది ఎలా బలపడుతుంది. మనసులో మనం ఏదైతే కావాలని పదే పదే మనసా వాచా బలంగా కోరుకుంటామో అదే సంకల్పంగా మారుతుంది. సంకల్పం బలపడాలంటే దానికి మనస్సు, వాక్కు, ఆత్మశుద్ధి వుండాలి. వీటికితోడు దైవబలం వుండాలి.

ఎవరైతే పవిత్రమైన మనసుతో ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటారో, అట్టివారు తక్షణమే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. సంకల్పం నిస్వార్థమైనది అయితే అంతా శుభకరమే జరుగుతుంది. స్వార్థంతోకూడిన సంకల్పాలు ఎన్నటికీ నెరవేరవు. వ్యక్తి జీవితం అంతా సంకల్ప వికల్పాల చుట్టే తిరుగుతుంది. మానవ సంకల్పానికి దైవ సంకల్పం తోడైతే అది ఎంతటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది.
Read More

శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయముశ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము

శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.

ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.


క్షేత్ర పురాణము

ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె వొకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.

భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ
ఆలయం శిధిలావస్థలో వుంది.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం


లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.


Read More

హనుమాన్‌ దీక్ష స్వీకరించిన దీక్ష పరులుహనుమాన్‌ దీక్ష స్వీకరించిన దీక్ష పరులు ఉదయం నాలుగు గంటలకు లేచి సంధ్యవేళ ప్రార్థన చేసుకొని పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు బిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట పూజ నిర్వహిస్తారు. అనంతరం దీక్ష స్వాములు వారి వారి ఇండ్లలో పిఠ పూజను ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దీక్ష స్వీకరించిన స్వాములు అందరు కలిసి హనుమాన్‌ మందిరంలో సన్నిదానం ఏర్పాటు చేసుకొని కలశంపెట్టి 41 రోజులు కఠినమైన పూజలు నిర్వహిస్తారు. దీక్ష విరమణ అయినంత వరకు కలశంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కడతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేస్తారు.


హనుమాన్‌ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హరితి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి ‘జైహనుమాన్‌ జీ’, 'జై శ్రీరాం' , అని పలుకరించి రామనామ స్మర ణం చేయటం ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. హనుమాన్‌ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీక్ష స్వీకరించిన స్వాముల్లో అధిక శాతం యువకులు ఉండడంతో వారిలో మార్పు రావడం ఎంతగానో దోహదపడుతుంది.


Read More

శుక్లాంబరధరం విష్ణుం,శుక్లాంబరధరం విష్ణుం,
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్,
సర్వవిఘ్నోపశాంతయే


చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి
స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి
అయ్యప్ప స్వామి అద్భుత స్వామి.

సుబ్రహ్మణ్య స్తోత్రం:
గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజం స్వరూపం
సేనాన్యాం తారకఘ్నం గురుమచల మతిం కార్తికేయం షడస్యం
సుబ్రహ్మణ్యం మాయూరధ్వజరధ సహితం దేవదేవం నమామి
Read More

శ్రీ వేణుగోపాలస్వామి (రాధా-గోవిందస్వామి) ఆలయం, మెళియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.శ్రీ వేణుగోపాలస్వామి (రాధా-గోవిందస్వామి) ఆలయం, మెళియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.

శ్రీకాకుళం జిల్లా, టెక్కలికి 24 కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి వద్ద తనయా నదీతీరాన మెళియాపుట్టి అనే పట్టణంలో ఈ ఆలయం ఉన్నది. 1840వ సంవత్సరంలో పర్లాఖిమిడి మహారాజు వీరేంద్ర ప్రతాపరుద్రుడు తన భార్య విష్ణుప్రియ కోరికమేరకు ఈ ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో కంచుతో తయారు చేయబడిన విగ్రహాలను రాధా-గోవిందుడు మరియు చెలికత్తె లలితాంబలుగా భక్తులు కొలుస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి డోలోత్సవాలు తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి. జాతర సందర్భంగా వేలాది భక్తులు ఇచ్చటికి తరలివస్తారు. కృష్ణాష్టమి, రాధాష్టమి మొదలగు పర్వదినాల సందర్భంగా ప్రెత్యేక పూజలు జరుగుతాయి.
Read More

Tuesday, 15 December 2015

శివ అష్టోత్తర శత నామ స్తోత్రంశివో మహేశ్వరశ్శమ్భుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ ||

శఙ్కరశ్శూలపాణిశ్చ ఖట్వాఙ్గీ విష్ణువల్లభః
శిపివిష్టోమ్బికానాథః శ్రీకణ్ఠో భక్తవత్సలః || ౨ ||

భవశ్శర్వస్త్రిలోకేశః శితికణ్ఠః శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అన్ధకాసురసూదనః || ౩ ||

గఙ్గాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాన్తకః
వృషాఙ్కో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ ||

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వఙ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ ||

హవిర్యఙ్ఞమయస్సోమః పఞ్చవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజఙ్గభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||

కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుఞ్జయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగమ్బరః || ౧౦ ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖణ్డపరశురజః పాశవిమోచకః || ౧౧ ||

మృడః పశుపతిర్దేవో మహాదేవో‌உవ్యయో హరిః
పూషదన్తభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||

భగనేత్రభిదవ్యక్తో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదో‌உనన్తస్తారకః పరమేశ్వరః || ౧౩ ||

ఏవం శ్రీ శమ్భుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||రచన: విష్ణు
Read More

మార్తాండ సూర్య దేవాలయం

మార్తాండ సూర్య దేవాలయం
కాశ్మీర్ లో ఒకప్పుడు అత్యంత సుందరం గా
శోభిల్లిన మార్తాండ సూర్య దేవాలయం
ఆ ఆలయం యొక్క విశిష్టతను ఒక్కసారి చదవండి.
ఇక్కడున్న ఫోటోలు :
( 1 ) మార్తాండ ఆలయం కూలగొట్టబడక ముందు
ఎలా ఉండేది అన్న ఊహా చిత్రం .
( 2 )1868 లో జాన్ బుర్కే అనే బ్రిటీషర్ తీసిన
ఫోటో
( 3 ) ప్రస్తుతం మార్తాండ సూర్య దేవాలయం
యొక్క ఫోటో
కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయాన్ని రాజా
బుల్నాట్ అనే రాజు నిర్మించారు. ఆకాలంలో ఆలయం
ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది.
ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని
సికిందర్ అనే రాజు తన సైనికుల చేత ధ్వంసం
చేయించాడు. దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా
కలిసి ఎంతో కష్టపడితే, డెబ్బై శాతం ఆలయాన్ని
మాత్రమే కూలగొట్టగలిగారు.
అంటే.......ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో
మనకు అర్థమవుతోంది. చివరికి.... ఎలాగైనా
ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన
భాగానికి భారీగా నిప్పు పెట్టారు.
అలా......ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో
అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం
దొరికింది.
ఆ రాగి ఫలకంలో “ రాజా బుల్నట్ ఈ ఆలయాన్ని
నిర్మించారు. ఈ ఆలయ జీవిత కాలం రాజు
తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను
అడుగగా.........వారు ఈ ఆలయం నిర్మించిన 1100
సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు
చేతిలో ఇది ధ్వంసం అవుతుంది “ అని రాసి ఉంది.
దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం
ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన
అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి
ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ రాగి ఫలకం విషయం తనకు ముందే తెలిసి ఉంటే ,
ఈ ఒక్క ఆలయాన్ని కూలగొట్టకుండా ఉండి ,
భారతీయుల యొక్క ఈ శాస్త్రం తప్పని నిరూపించే
వాడిని అని సికిందర్ తన సైనికులతో వాపోయాడని
చరిత్ర కారులు అంటారు.Read More

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది. తప్పక చదవండి........(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు )హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.
తప్పక చదవండి........(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు )
హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...


"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"

హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.


Read More

Monday, 14 December 2015

వైద్య జ్యోతిషంవైద్య జ్యోతిషం

మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి. రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం . ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది . ముందుగా రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు ఈ దిగువన వివరిస్తున్నాం.


రాశులు - శరీర భాగాలు
మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.
వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .
కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం.
సింహం - గుండె , వెన్నెముక
కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం .
ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
మకరం - మోకాళ్ళు, కీళ్ళు.
కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.
ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి . గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.

గ్రహాలు - రుగ్మతలు
సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.
చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.
శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
ఇంద్ర- రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.
వరుణ- మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం, అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.
యమ - వంశ పారంపర్య వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు ,మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది .
Read More

అగ్రవర్ణాల వారు మరియు దళితవర్ణాల వారు అందరూ సమానం అని వివరించారు.అగ్రవర్ణాల వారు మరియు దళితవర్ణాల వారు అందరూ సమానం అని వివరించారు.


దళితవర్ణాలు అని వారిని అనకుడాదు. మనందరిలో మార్పు రావాలి.
1. రాజ్యాంగాని రాసిన వారు ఒక దళితుడు.
2. మనం నిత్యమూ అరదించే ఆంజనేయ స్వామి ఒక దళితుడు.
3. భక్త కన్నప ఒక దళితుడు.
4. శ్రీ రామునికి ఎంగిలి పళ్లను తినిపించిన శబరి ఒక దళితరాలు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ముఖ్యంగా ఆవు మాంసాని తినలి అనుకునే వెదవలు తప్ప కుండ చూడాలి.
గోమాంసం తింటే ఎన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోండి.
Read More

Sunday, 13 December 2015

రుద్రాక్ష ధారణ – మారేడు దళము

రుద్రాక్ష ధారణ – మారేడు దళము
భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్ష కేవలము సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు.
మీకు సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలదు.అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది. అందుకే రుద్రాక్ష మాలలో పగదమును ముత్యమును కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరం అయితే, ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలయిన రీతిలో మీ శరీరమునందు సాత్వికమయిన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటునుంచి అటు దారం వెళ్ళిపోయేటట్లుగా ఉన్న ఏకైక పవిత్రమయిన గింజ రుద్రాక్ష.
రుద్రాక్ష వేసుకోవడం అంటే ‘నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను” అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే ‘యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు.
ఉమానాథుడయితే మారేడు దళము, శ్రీమహా విష్ణువయితే తులసిదళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడుదళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీసూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము.
ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథబిల్వః!
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః!!
లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడిచేతితో ఆమెచేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉన్నది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడ్ ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు మూడు కింద తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనెకాని శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. ‘బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీసూక్తంలో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ (అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.
Read More

మంత్రాలయం ....భక్తుల పాలిట కామధేనువు

మంత్రాలయం ....భక్తుల పాలిట కామధేనువు ... కల్పవృక్షం శ్రీ రాఘవేంద్ర స్వామి...... అనేక పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన రాఘవేంద్రస్వామి కొలువుదీరిన ప్రాంతమే 'మంత్రాలయం'. ఆయన జీవసమాధి చెందిన ప్రదేశమే బృందావనమై అశేష భక్త జనకోటి ఆరాధనలు అందుకుంటోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో అలరారుతోంది.
ఈ ప్రదేశంలో రేణుకాదేవి 'మంచాలమ్మ' గా పిలవబడుతూ పూజలు అందుకుంటుంది. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి మంచాల అనే పేరు వచ్చింది. ఆ తల్లి అనుమతితో ... అనుగ్రహంతో రాఘవేంద్ర స్వామి ఈ పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకోవడంతో అది 'మంత్రాలయం' గా మారిపోయింది. ఇక ఎన్నో పుణ్య తీర్థాలను దర్శించిన రాఘవేంద్రస్వామి ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం లేకపోలేదు. పూర్వం ఇక్కడ ప్రహ్లాదుడు తపస్సు చేయడమే కాకుండా ఎన్నో యజ్ఞాలు చేయడం వలన ఈ ప్రదేశం మహా పవిత్రమైనదని రాఘవేంద్ర స్వామియే స్వయంగా చెప్పాడు.
ఇక శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు ఆయనను ఆ ప్రహ్లాదుడి అవతారంగానే భావించి పూజిస్తుంటారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాఘవేంద్ర స్వామి అసలుపేరు 'వేంకటనాథుడు'. అన్నగారి దగ్గర .. బావగారి దగ్గర... మఠంలోను ఆయన విద్యాభ్యాసం చేశాడు. సాక్షాత్తు సరస్వతీదేవి ఆదేశంతో ఆయన తన సంసార జీవితానికి స్వస్తి చెప్పి, రాఘవేంద్రస్వామిగా ఆశ్రమ జీవితాన్ని కొనసాగించారు.
దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే రాఘవేంద్ర స్వామి ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కున్నాడు. తనని పరీక్షించడానికి ప్రయత్నించినవారి కళ్లు తెరిపించాడు. చనిపోయిన వారిని సైతం బతికించిన మహాశక్తి సంపన్నుడు ఆయన. మహా సమాధి చెంది ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా ఆయన తన భక్తులు పిలవగానే పలుకుతున్నాడు. వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్నాడు. ప్రతియేటా మంత్రాలయంలో శ్రావణ మాసంలో జరిగే ఆరాధనోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వుంటారు....ఓం శ్రీ గురుభ్యో నమః
Read More

షణ్ముఖుడు ...

షణ్ముఖుడు ......అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి.
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - అందమైన వాడు (తమిళం)
శ్రీ వల్లీ దేవ సేన సమేతులైన కుమారస్వామి - సాంప్రదాయిక చిత్రం.
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు.
Read More

ఓంకారం

ఓంకారం
ఓంకారం
"ఓం" బ్రహ్మ స్వరూపత్వం. "ఓం" పదం శబ్ద బ్రహ్మం. "ఓం"కారం అక్షర పరబ్రహ్మ స్వరూపం. ప్రణవోహి పరబ్రహ్మ పణవః పరమం పదం ప్రణవం సర్వవేదాధ్యం సర్వదేవమాయం విద్దు:!! ప్రణవమే - పరబ్రహ్మం, ముక్తి, వేదాలకు మూలం, సకలదేవతలమయమైంది. సృష్టాదిన బ్రహ్మదేవుని కంఠంనుండి వెలువడిన శబ్దములు రెండు. మొదటిది 'ఓం'కారం. రెండవది 'అధః'. కావున ఈ రెండును పరమ పవిత్రమైన మంగళశబ్దములు. విధాత ప్రప్రధమమున ఓంకారమునే ఉచ్చరించెను. ఏ యొక్క పరమాత్మ శక్తి చేత తాను సృష్టికి శక్తిమంతుడయ్యనో, అట్టి పరబ్రహ్మం యొక్క స్వరూపం ఓంకారమనియు, అది దేవతలకు, సర్వజనులకు ధ్యేయమనియు తెలిపెను. భగవన్ కిం తదాదౌ ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం కిం తద్ధ్యానం కో వా ధ్యాతా కశ్చ ధ్యేయః!! అథర్వశిఖోపనిషత్తు భావం_ ఓ భగవంతుడా! ఆదికాలమునందు బ్రహ్మాది దేవతలు ఉపయోగించినది ఏది? ధ్యానము ఏది? ధ్యానింపదగినది ఏది? ధ్యానమునకు సాధనమయ్యేది ఏది? ధ్యాత ఎవడు? ధ్యేయం మంత్రముచే తెలుసుకొనదగినది ఏది? సఏభ్యో థర్వా ప్రత్యువాచ ఓ మిత్యక్షరమేతదాదౌ ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం!! ‪#‎అథర్వశిఖోపనిషత్తు‬ భావం_ ప్రణవాక్షరమే ఆదియందు ఉపదేశింపబడింది. అదియే ధ్యానం. దానినే ధ్యానింపవలయును. సకృదుచ్ఛరిత మాత్ర ఊర్ధ్వమున్నామయతీత్యోంకారః!! అథర్వశిఖోపనిషత్తు ఒక్కమారు ప్రణవం (ఓం) ఉచ్చరించినమాత్రముననే శ్రేష్టగతిని పరమపదంను చేర్పించుటంబట్టి ఓంకారమనబడును. ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయితీ త్యేతస్మాత్ ప్రణవః ప్రణవం అంటే సర్వప్రాణములను పరమాత్మునియందు లగ్నం చేయునది అని అర్ధం. సర్వేవేదా యత్పదమామనన్తి తపాగ్మ్ సి సర్వాణి చ యద్వదంతి యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదగ్మ్ సంగ్రహేణ బ్రవీమ్యో మిత్యేతత్!! కఠోపనిషత్తు ‪#‎భావం_‬ వేదములన్నియు ఏ వస్తువును పొందదగినదానినిగా చెప్పుచున్నవో, తపస్సులన్నియు దేనిని ఆచరింపమని చెప్పుచున్నవో, దేనిని కోరుచున్నవారై బ్రహ్మప్రాప్త్యర్ధం అగు బ్రహ్మచర్యం ఆచరించుచున్నారో ఆ వస్తువును గూర్చి నీకు సంగ్రహముగా భోదించుచున్నాను - అదే "ఓం". "ఓం" అనే పదమే అవినాశి అయిన పరబ్రహ్మం. అదే ఈ బ్రహ్మాండం-విశ్వం. ఇప్పటివరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇకపై ఉండబోయేది అంతా ఓం అనే పదమే. ఓంకార వివరణ_ అకార, ఉకార, మకారములతో కూడినది ఓంకారం. అక్షరములలో అకారం మొదటిది. ఈ శబ్దం కంఠంనుండి పుట్టుచున్నది. ఇది ప్రణవం యొక్క ప్రధమమాత్రయు, బ్రహ్మయు,బ్రహ్మశక్తి సృష్టియు అగుచున్నది. ఉకారశబ్దం దవడల మధ్యనుండి ఉద్భవించుచున్నది. ఇది ‪#‎ఓంకారం‬ యొక్క ద్వితీయమాత్రయు, విష్ణువై ఉన్నది. విష్ణుశక్తి స్థితియు అయివున్నది. మకారశబ్దం పెదవుల కొసనుండి జనించును. ఇది ప్రణవం యొక్క తృతీయమాత్రయు, మహేశ్వరుడును, శివశక్తి లయ మగుచున్నది. కంఠంనుండి అకారధ్వని ఆరంభించి ఓష్టాన్తమున అంతమగుటచే లయమగుటచే అన్ని అక్షరములు శబ్దములు ఈ మూడింటి ఆదిమధ్యాన్తములలో ఉద్భవించుట చేత వేదములన్నియు ఈ ఓంకారమునుండియే ఏర్పడినవని శ్రుతివాక్యం. కావున ఈ ఓంకారం ఒకదానిని పఠించినచో వేదములన్నింటిని చదివినవారగుదురని ఋషులు చెప్పెదరు. ప్రణవం హీశ్వరం విద్యాత్సర్వస్య హృది సంస్థితం సర్వవ్యాపినమోంకారం మత్వా ధీరో న శోచతి!! జనుడు స్మరణజ్ఞానమునకు స్థానమైన హృదయమునందున్నఈశ్వరుని ఓంకారముగా తెలుసుకోవలెను. ఇట్లు సర్వవ్యాపకమైన ఓంకారమును తెలుసుకొన్న జ్ఞాని శోకనిమిత్తమైన అజ్ఞానాది నాశమగుటవలన దుఃఖింపడు. 'ఓంకార ఆత్మేవ' ఓంకారం ఆత్మయేనని నిర్వచింపబడింది. 'తస్య వాచకః ప్రణవః' నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్టి సమర్ధమైన శబ్దం ఒక్క ఓంకారం మాత్రమే. 'అక్షరమంబరాన్త ధృతే:!! (బ్ర.సూ). పృధివి మొదలు ఆకాశం వరకు గల పంచభూతములను ధరించుటవలన అక్షరశబ్దముచే (ఓంకారముచే) చెప్పబడునది పరబ్రహ్మమే. ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసానిశితం సందదీత! ఆయమ్య తద్భావగతేనా చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి!! ముండకోపనిషత్తు #భావం_ ఉపనిషత్తులలో ప్రసిద్ధమగు, గొప్పఅస్త్రంవంటింది అగు (ప్రణవమగు) ధనస్సును గ్రహించి ఉపాసనంచేత పదునుపెట్టబడిన (ఆత్మయను) బాణమును ఎక్కుపెట్టవలయును. ఆ అక్షరబ్రహ్మమునందు (ధ్యానంను పొందిన చిత్తంచేత లాగి ఆ పూర్వం చెప్పియుండెడి) లక్ష్యమునుకొట్టవలయునని తెలుసుకొనుము. ప్రణవో ధనుశ్శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే! అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్!! భావం_ ఓంకారం ధనుస్సు, జీవాత్మయే బాణం,అక్షర పరబ్రహ్మమే ఆ బాణమునకు గురికావల్సిందిగా చెప్పబడెను. సావధానమగు (ఏకాగ్రత) మనస్సు కలవానిచేత కొట్టబడవలెను. ఆ బాణమువలనే జీవుడు లక్ష్యమగు బ్రహ్మముతో పరమసామ్యము పొందెను. యోగాలలో ఓంకారము ఎంతో ప్రముఖమైనది. వేదాలయందు తాను 'ఓం'కారము అయినట్లు గీతలో భగవానుడు తెలిపాడు. వేదాల యందు సారము ఓంకారము అని తెలియుచున్నది. 'సర్వదేదేషు' అని తెలపటం వల్ల సమస్త వేదముల యొక్క సారము ఓంకారమే అని స్పష్టమగుచున్నది. కావున ప్రణవము జపించునపుడు, ప్రణవార్థవమును చింతించుచు, ప్రణవ వాద్యుడగు పరమాత్మను ధ్యానించుచుండిన, పరమ శ్రేయస్సు లభించగలదు. ప్రాణాయామము చేయు యోగ సాధకులు, శరీరం, కంఠం, శిరస్సు తిన్నగా నిలిపి, తమ కళ్ళు మూసుకొని, యోగనిష్ఠలో ఓంకారాన్ని ఉచ్ఛరించాలి. ఓంకారమును శక్తివంతముగాను, దీర్ఘముగా, నిదానముగా ఉచ్ఛరించి, ఆ శబ్ధాన్ని నిశ్శబ్ధంలో లయం చేయాలి. హృదయమే ఆకాశము,నేత్రములు సూర్యచంద్రులు,శోత్రములు దిక్కులు,పాదములు భూమి,ప్రాణము వాయువు,రక్తము జలము,పరమాత్మ యొక్క శక్తి మూలకముగా ఇవి ప్రకాశవంతమవుతున్నాయి.దేవుడు అంటే ఒక శక్తి అని, ఆ శక్తియే సృష్టిని సృష్టించింది అని, సృష్టిని సృష్టించిన దేవుడు మనిషిని కూడా సృష్టించాడు అని, సృష్టికి కావలసిన పంచభూతాలు, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి (పృధ్వి) మనిషిలో కూడా ఉన్నాయి. అవి సృష్టి నడవటానికి కారణములు అయినట్లు, మనిషి కూడా ఆ కారణముల వల్లనే జీవిస్తున్నాడు అని, పంచభూతముల లోను, దేవుని శక్తి మూలకంగానే (ఆయన శక్తి వాటిలో ఉండటం వల్లనే) అవి పనిచేస్తున్నాయి. అదే విధంగా అణువు కన్నా చిన్న ఆకారంలో ఓంకార రూపంలో ఉన్న పరమాత్మ యొక్క శక్తి మూలకంగానే మనిషి జీవితం, చావు పుట్టుకలు జరుగుతున్నాయి.
Read More

అరుణాచలం (తిరువణ్ణామలై) ,అరుణాచలేశ్వరాలయము

అరుణాచలం (తిరువణ్ణామలై) ,అరుణాచలేశ్వరాలయము
అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వాసిస్తున్నారు.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక .పంచభూతలింగక్షేత్రములు
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము : అగ్ని లింగం,
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం : జల లింగం,
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం : ఆకాశ లింగం,
4. ఏకాంబరేశ్వరుడు - కంచి : పృధ్వీ లింగం,
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి : వాయు లింగం,
--------------------------------------------------------
* అరుణాచలేశ్వరాలయము
అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు ఉంటాయి .
తూర్పు రాజగోపురం - దక్షిణగోపురము-పడమర రాజగోపురం - ఉత్తర రాజగోపురం .
* పాతాళలింగము
ఇక్కడే రమణమహర్షి కొంతకాలం తపస్సు చేసారు . రమణ మహర్షి ఫొటొలు కూడ ఇక్కడ ఉన్నవి . మీరు వాటిని కూడ వచ్చు . మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది. ఒకసారి అరుణాలేశ్వర దేవాలయములో ముఖ్యస్థానముల లిష్ట్ చూస్తే . . . .
పెద్ద నంది, - వెయ్యిస్తంభాల మండపము, -చిలుక (కిలి) గోపురం,,- బ్రహ్మ ప్రతిష్ఠింఛిన లింగం ,చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు. గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .
* బ్రహ్మ ప్రతిష్ఠింఛిన లింగం
గర్భగుడి లో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ ఉంటుంది.
ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే మీరు పంచ లింగాలయల దర్శనం కూడ చెయవచ్చు.
ఈ ఆలయం లో శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో మాత్రమే తెరుస్తారు
* తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు .. సాయంత్రం 3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు
ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు . గర్బగుడి ఒకటే తెరచి ఉండదు .
కిలి గోపురానికి ఎదురుగా మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి పక్కన ఉంటుంది . పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .
* గిరి ప్రదక్షణం (గిరివలం)
ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.
శ్రీరమణులు దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .
గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి. అగ్ని లింగం రమణాశ్రమానికి వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి 2కి.మి దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .
దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..
* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటు*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ..
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
* రమణాశ్రమం
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమంలో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి , కాకి సమాధి , కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసగ ఉంటాయి . అక్కడ గ్రంధాలాయం లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి . మీరు ఆశ్రమం లో ఉండలాంటె ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.
* శేషాద్రి స్వామి ఆశ్రమం
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది. ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.
జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML