గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 November 2015

దీపావళి పండుగ

దీపావళి పండుగ
పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది.మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.
నరక చతుర్దశి నాడు సూర్యోదయమునకు ముందుగా లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగువత్తులతో దీపమును దానము చేయాలి. సాయంకాలం గుళ్ళలో దీపాలని వెలిగించాలి. ఆనాటి వంటలో మినప ఆకులతో కూర వండుకుంటారు.
అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేస్తారు. సాయంత్రము లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్ళలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగా చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్ళల్లో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో, నూతులలో(బావి) తెప్పలవలే వదులుతారు.
ఆనాటి రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని(అలక్ష్మి, పెద్దమ్మారు,దారిద్ర్యానికి సూచన) ఇండ్లనుండి తరుముతారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజింస్తారు. ఇది మూడవ రోజు. బలిపాడ్యమి. ఉదయము జూదములాడుతారు. ఆరోజు గెలిచిన వారికి సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఈనాడు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు.అందులో ప్రధానమైనవి:
1.నరకాసుర వధ
2.బలిచక్రవర్తిరాజ్య దానము
3.శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని
4.విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు
ఈ కథలలో బలిచక్రవర్తికథ తప్ప మరి ఏది వ్రతగ్రంథములలోను,ధర్మశాస్త్రగ్రంధములలోను కనిపించదు. ధర్మసింధువంటిఅన్ని గ్రంధములలోను బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడింది. నేడు దీపావళి అనగానే మనకు గుర్తువచ్చే బాణాసంచ కాల్పులుకు ఆధారమైన నరకాసురవధ ఎంతో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ కథ ప్రస్తావన వ్రతగ్రంధములలో కనపడదు.నరకభయనివారణార్థము అభ్యంగనస్నాము, దీపములతో అలంకరించటం,లక్ష్మీపూజ తదితర విషయములు తెల్పబడ్డాయి. ఈ వ్రత గ్రంధాలలోని "నరక"శబ్దానికి నరకము అనుటానికి మారుగా "నరకాసురుడు" అని అన్వయించి తర్వాతివారు పురాణకథతో జోడించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం.ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమగు రహస్యం ఇమిడి ఉన్నదని కొందరి అభిప్రాయం.
వల్లూరి పవన్ కుమార్

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML