గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 November 2015

అనంత వ్రత కల్పముఅనంత వ్రత కల్పము

శ్రీ అనంత పద్మనాభ వ్రతమునకు కావలసిన ముఖ్య వస్తువులు: విష్ణుమూర్తి యొక్క బొమ్మ లేదా చిత్ర పటము , పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గిపెట్టె , అగరువత్తులు , వస్త్ర , యజ్నోపవీతములు , పువ్వులు, పళ్ళు , కొబ్బరికాయ , ఈ వ్రతమునకు తోరములు ముఖ్యము. ఇవి ఎర్రని సిల్కు దారముతో చేసినవి గాని లేదా తెల్లని దారముతో చేసినవైతే కుంకుమ నీటిలో తడిపి ఉంచుకొనవలెను . వీటికి పదునాలుగు ముడులు ఉండవలెను.ప్రసాదమునకు గోధుమ పిండిని ఐదు పళ్ళు (అనగా ఐదు శేర్లు) తీసుకొని బెల్లముతో అతిరసములు (అప్పములు ) తయారు చేసుకొనవలెను. ఇందులో ఇరువది ఎనిమిది అతిరసములు దేవునికి నైవేద్యము పెట్టి తోరము కట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు వాయన దానమిచ్చి , తక్కిన వానిని తాను భుజింపవలయును. పూజా ద్రవ్యము లన్నియు పదునాలుగు చొప్పున ఉండవలయును.బ్రాహ్మణ పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.
ఆచమనం
1 . " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి .
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి .
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 . ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను. ఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతే షామవిరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణా యామమ్య : ఓం భూ : - ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః -ఓం సత్యం -ఓం తత్ సవితురేణ్యం.భర్గో దేవస్య ధీమహి దీయోయోన : ప్రచోదయాత్ .
ఓం ఆపో జ్యోతిర సోమ్రుతం బ్రహ్మ భూర్భు వస్సువ రోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము : యమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్దే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనము ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ) ,సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్ర మానేన ............ సంవత్సరే ,............ ఆయనే, ఋతు : ...........మాసే ,......... పక్షే ............ తిధౌ ,......... వాసరే శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ........గోత్రశ్య
....... నామధేయః , శ్రీమత్యః , గోత్రస్య ,నామ దేయస్య అనియు , స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి,
శ్రీ మత్యాః , గోత్ర వత్యాః నామదేవ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము , నామము చెప్పి ) నామ దేయశ్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య,క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిద్ద్యర్ధం , శ్రీ అనంత పద్మనాభ దేవతా ముద్దిశ్య అనంత పద్మనాభ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్బి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి, లేక కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను .రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను . కుంకుమ అక్షతలు వగైరా బొటన ,మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను . యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ,ఇలా అనుకోవాలి . ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువ వలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః
ఋ గ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
శ్లో || గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ||

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ అనంత పద్మనాభ దేవతాః (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పు కొనవలెను ) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి.

మూనర్జము :
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాంగతోపివా
యస్స్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||

అని పిదప కాసిని అక్షతలు , పసుపు ,గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను . ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాది పతయే నమః
ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహోర్తోస్తూ తదాస్తు . తరువాత ఇలా చదువుతూ స్వామికి నమస్కరించ వలెను.

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||
సుముఖశ్చైక దంతశ్చక పిలో గజ కర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్న రాజో వినాయకః
ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామాని యః పటేచ్చ్రుణుయాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్యన జాయతే ||
అనంత పద్మనాభుని వ్రతమునకు ముందుగా యమునా పూజను చేయవలెను .

యమునా పూజా
ధ్యానం : శ్లో || క్షీరో దార్ణవ సంభూతే ఇంద్ర నీల సమప్రభే ,
ధ్యానం కరోమి యమునే విష్ణు రూపి నమోస్తుతే .
యమునా దేవీం ధ్యాయామి అని యమునా దేవిని ధ్యానించవలెను .

ఆవాహనం : శ్లో || యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయినీ ,
ఆవాహయామి భక్త్యాత్వాం సాన్నిధ్యం కురు సువ్రతే .
యమునా దేవ్యై నమః ఆవాహయామి అని ఆ దేవతను మన ఇంటి లోనికి పిలుచుచున్నట్లుగా (ఆహ్వానించు చున్నట్లుగా ) భావించి అక్షతలు తీసుకొని వేయవలెను .

ఆసనం : శ్లో || నమస్కరోమి యమునే సర్వ పాప ప్రణాశిని ,
రత్న సింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం .
యమునా దేవ్యై నమః ఆసనం సమర్పయామి అని కూర్చొనుటకు సింహాసనము ఇచ్చినట్లుగా భావించి దేవిపై అక్షతలు వేయవలెను .
పాద్యం : శ్లో || సింహాసన సమారూడే దేవ శక్తి సమన్వితే ,
పాద్యం గృహణ దేవేశి సర్వ లక్షణ సంయుతే .
యమునా దేవ్యై నమః పాద్యం సమర్పయామి అని దేవికి కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణెతో తీసుకొని చల్లవలెను .

అర్ఘ్యం : శ్లో || నంది పాదే నమస్తుభ్యం సర్వ పాప నివారిణి
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిద ముత్తమం ||
యమునా దేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుగు కొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణె తో వేరొక పాత్ర లోనికి వేయవలెను .

ఆచమనీయం : శ్లో || హర వైడూర్య సంయుక్తే సర్వ లోక హితే శివే ,
గృహణాచమనం దేవి శంకరార్ధ శరీరణి ||
యమునా దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి అని పంచ పాత్రలోని శుద్ధ జలమును ఉద్దరిణెతో అర్ఘ్య పాత్ర లోనికి వదల వలెను .

స్నానం : శ్లో || దేవ సలిలే నమస్తుభ్యం సర్వ లోక హితే ప్రియే ,
సర్వ పాప ప్రశమని తుంగ భద్రే నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః స్నానం సమర్పయామి అని స్నానమునకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్ర లోని నీటిని పువ్వుతో లేదా ఉద్దరిణెతో వేరొక గిన్నె లోనికి వదలవలెను .

వస్త్ర యుగ్మం : శ్లో || గురు పాదే నమస్తుభ్యం సర్వ లక్షణ సంయుతే ,
సువ్రతం కురుమే దేవి తుంగ భద్రే నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అని వస్త్రమునకు సమర్పిస్తున్నట్లుగా భావించి పత్తితో బిళ్ళ వలె చేసి , దానికి కుంకుమ పెట్టిన వస్త్ర యుగ్మమును దేవికి సమర్పించ వలెను.

మధుపర్కం : శ్లో || కృష్ణ వేణి నమస్తుభ్యం కృష్ణవేణీ సులక్షణే,
మధుపర్కం గృహాణే దం మయాదత్తం శుభప్రదే ||
యమునా దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ, ఈ మధుపర్కం ను ప్రతిమకు అద్దవలెను .(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచు కొన్న దానిని మధుపర్కం అంటారు ).

ఆభరణాని : శ్లో || నంది పాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరణి,
సర్వలోక హితే తుభ్యం భీమ రధ్యై నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి అని తమ శక్తి కొలది ఆభరణములను దేవి వద్ద ఉంచి నమస్కరించ వలెను .

ఉత్తరీయం ; శ్లో || సహ్య పాద సముద్భూతే సర్వ కామ ఫల ప్రదే ,
సర్వ లక్షణ సంయుక్తే భవ నాశినితే నమః ||
యమునా దేవ్యై నమః ఉత్తరీయం సమర్పయామి అనుచూ కండువా వంటి తెల్లని వస్త్రమును సమర్పించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణి తో అర్ఘ్య పాత్ర లోనికి వదలవలెను .

గంధం : శ్లో || కృష్ణ పాద సముద్భూతే గంగేత్రి పధ గామిని ,
జటాజూట సమద్భూతే సర్వ కామ ఫల ప్రదే ||
యమునా దేవ్యై నమః గంధం సమర్పయామి అనుచు గంధమును ఈ దేవతపై రెండు , మూడు చుక్కలు చల్లవలెను

అక్షతలు : శ్లో || గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని ,
స్వీకురుష్వ జగద్వంద్వే అక్షతా నమలాన్ శుభాన్ ||

యమునా దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి అనుచు అక్షతలను (కొద్ది బియ్యమును తీసుకొని తడిపి పసుపు వేసి కలుపవలెను ) దేవిపై చల్ల వలెను .

పుష్ప పూజ : శ్లో || మందారై : పారిజాతైశ్చ పాటలాశోక చంపకై :,
పూజయామి తవ ప్రీత్యై వందే భక్త వత్సలే .

యమునా దేవ్యై నమః పుష్పై : పూజయామి అనుచు కొన్ని పూవులను తీసుకొని అక్షతలు , పూవులు కలిపి దేవిపై వేయవలెను. ఈ షోడశోపచార పూర్తి అయిన పిమ్మట 13 నామములు గల అధాంగ పూజను చేయవలెను . ప్రతి నామమునకు పువ్వులు కాని , పసుపు కాని కుంకుమ కాని వేయవచ్చును.

అధాంగ పూజ
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి ; ఓం సుజంఘాయై నమః జంఘే పూజయామి ; ఓం చపలాయై నమః జానునీ పూజయామి ; ఓం పుణ్యాయై నమః ఊరూ పూజయామి ; ఓం కమలాయై నమః కటిం పూజయామి ; ఓం గోదావర్యై నమః స్తనౌ పూజయామి ; ఓం భావ నాశిన్యై నమః కంటం పూజయామి ;ఓం తుంగభద్రాయై నమః ముఖం పూజయామి ; ఓం సుందర్యై నమః లలాటం పూజయామి ; ఓం దేవ్యై నమః నేత్రే పూజయామి ; ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి ; ఓం సునాసికాయై నమః నాసికం పూజయామి ; ఓం భాగీరధ్యై నమః శిరః పూజయామి .

యమునా దేవ్యై నమః సర్వాంణ్యం గాని పూజయామి .

ధూపం : శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు సంయుతం ,
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతి గృహ్యతాం .||
యమునా దేవ్యై నమః ధూపం సమర్పయామి అని ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తి వెలిగించి తిప్పుతూ దూపమును దేవికి చూపవలెను .

దీపం : శ్లో || ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్య తిమిరాపహమ్,
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరి నమోస్తుతే .
యమునాదేవ్యై నమః దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువ వలెను.

నైవేద్యం : శ్లో || భక్త్యైశ్చ భోజ్యైశ్చ రసై షడ్భిస్సమన్వితం
నైవేద్యం గృహ్యాతం దేవి యమునాయై నమోనమః

యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి అని పళ్ళు , కొబ్బరికాయ మొదలగునవి దేవి వద్ద నుంచి ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో పదార్దాములపై పువ్వులతో నీళ్ళు చల్లుతూ ' ఓం ప్రాణాయ స్వాహ , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ' అంటూ ఆరు మార్లు చేతితో ( చేతిలోని ఉద్దరిణి తో ) స్వామికి నివేదనం చూపించాలి . పిదప ఓం యమునా దేవ్యై నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచపాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .
తరువాత ' పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. నిత్య పూజా విదానమందు ఈ విధంగా చేసే నైవేద్యం అనంత పద్మనాభ వ్రతమునకు 14 రకముల పిండి వంటలు చేసి అందు రకమునకు 14 చొప్పున ఒక పళ్ళెములో వుంచి నివేదన చేయాలి పునః శుద్దాచామనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం ........

హస్త ప్రక్షాళనం : శ్లో || పానీయం పావనం శ్రేష్టం గంగా సరసోద్భవం
హస్త ప్రక్షాళ నార్ధం వై గృహాణ సుర పూజితే .
యమునా దేవ్యై నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి అని భోజనము అయిన పిదప చేతులు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణితో అర్ఘ్య పాత్ర లోనికి హస్తౌ ప్రక్షాళయామి అంటూ వదలవలెను .

తాంబూలం : శ్లో || కరూప్ర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యతాం దేవీ యమునాయై నమోస్తుతే ||
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి అని మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి . తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , ' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .

నీరాజనం : పిమ్మట కర్పూరం వెలిగించి ...............
శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా ,
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి మూడుసార్లు త్రిప్పుచూ , చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి .
తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని ,

మంత్ర పుష్పం :
ఓం శ్రీ యమునాదేవ్యై నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు దేవి వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి .

ప్రదక్షిణం : శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన. ||
శ్లో || ప్రమాద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక,
ప్రదక్షణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే . ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి . చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగ వారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ .........

ప్రార్ధనం : శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ||
యమునా పూజా విధానం సంపూర్ణం

యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి అని మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి . తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , ' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .

నీరాజనం : పిమ్మట కర్పూరం వెలిగించి ...............
శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా ,
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||

ఓం శ్రీ యమునా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి మూడుసార్లు త్రిప్పుచూ , చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి .
తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని ,

మంత్ర పుష్పం :
ఓం శ్రీ యమునాదేవ్యై నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు దేవి వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి .

ప్రదక్షిణం : శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన. ||
శ్లో || ప్రమాద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక,
ప్రదక్షణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే . ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి . చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగ వారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ .........

ప్రార్ధనం : శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

యమునా పూజా విధానం సంపూర్ణం

అధ శ్రీ మదనంత పద్మనాభ పూజా కల్పః
ధ్యానం ;
శ్లో || కృత్వా దర్బ మయం దేవం పరిధాన సమన్వితం
ఫణై స్సప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షిణాగ్ర కరే పద్మం శంఖం తస్యా ప్యధః కరే
అవ్యయం సర్వ లోకేశం పీతాంబర ధరం హరిం
దుగ్దాబ్ది శాయనం ద్యాత్వా దైవ మావాహయే త్సుదీ ||
ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః - ధ్యానం సమర్పయామి అని స్వామిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను .
ఆవాహనం : శ్లో || అగచ్చానంత దేవేశ తేజో రాశే జగత్పతే
ఇమాం మాయా కృతం పూజాం గృహాణ సుర సత్తమ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి అని ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం .అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను .
ఆసనం ; శ్లో || అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆసనం సమర్పయామి . నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి . దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీత వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
తోరస్తాపనం : శ్లో || తస్యాగ్ర తోదృడం సూత్రం కుంకు మాక్తం సుదోరకం
చతుర్దశ గ్రంధి సంయుక్తం ఉప కల్ప్య ప్రజాజయేత్ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోరా స్థాపనం కరిష్యామి అని 14 ముడులతో సిద్దం చేసి ఉంచుకున్న ఎర్రని దారముతో చేసిన తోరమును ( ఎర్రని దారము కానిచో తెల్లని దారముతో తయారు చేసి కుంకుమ నీళ్ళలో ముంచినది ) స్వామిపై వేయవలెను.

వస్త్ర యుగ్మం : శ్లో || శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే ,
పీతాంబర ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని వస్త్రయుగ్మం అంటారు ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
ఉపనీతోత్తరీయాన్ : శ్లో || నారాయణ నమస్తేస్తు త్రాహిమాం భవ సాగరాత్ ,
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఉపనీతోత్తరీయాన్ సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను . ఇదియును ప్రత్తితో చేయ వచ్చును. ప్రత్తిని తీసుకొని పసుపు చేత్తో బ్రొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి కుంకుమ అద్దవలెను. దీనిని స్వామిపై ఉంచవలెను.
గంధం : శ్లో || శ్రీ గంధం చంతనో న్మిశ్రం కుంకుమాది భిరంవితం,
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః గంధాన్ సమర్పయామి గంధమును రెండు మూడు చుక్కలు స్వామిపై చల్లవలెను .
అక్షతాన్ : శ్లో || శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయాదత్తాన్ శుభావహాన్ ,
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీకురు ప్రభో .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి అని కొద్ది అక్షతలను తీసుకొని ( పసుపు కలిపిన బియ్యమును ) స్వామిపై చల్లవలెను.
పుష్ప పూజ : శ్లో || కరవీరై ర్జాతి కుసుమైశ్చం పకైర్వకు లై శ్శుభై :
శత పత్రైశ్చ కల్హారైరర్చయే పురుషోత్తమ.
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పుష్పాణి పూజయామి కొద్ది పుష్పములను తీసుకొని స్వామీ పాదములపై ఉంచి నమస్కరించ వలెను .
పిమ్మట క్రింది అధాంగ పూజను ఒక్కొక్క నామమునకు పువ్వులు లేదా పసుపు లేదా కుంకుమను స్వామిపై వేస్తూ పూజించవలెను.
అధాంగ పూజ
ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి ; ఓం శేషాయ నమః గుల్ఫౌ పూజయామి ; ఓం కాలాత్మనే నమః జంఘే పూజయామి ; ఓం విశ్వ రూపాయ నమః జానునీ పూజయామి; ఓం జగన్నాదాయ నమః గుహ్యం పూజయామి; ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి ; ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి; ఓం శ్రీ వత్స వక్షసే నమః వక్ష స్థలం పూజయామి ; ఓం చక్ర హస్తాయ నమః హస్తాన్ పూజయామి ; ఓం ఆజాను బాహవే నమః బాహున్ పూజయామి ; ఓం శ్రీ కంటాయ నమః కంటం పూజయామి ; ఓం చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి ; ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి ;
ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి ; ఓం నారాయణాయ నమః నేత్రౌ పూజయామి ; ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి ;ఓం అనంత పద్మనాభాయ నమః శిరః పూజయామి ; ఓం విష్ణవే నమః సర్వాణ్యం పూజయామి .
పిమ్మట క్రింది 108 నామములకు ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు గాని , పసుపు గాని , కుంకుమ గాని వేయుచు ఈ నామములతో పూజించ వలెను.

అర్ఘ్యం : శ్లో || అనంత గుణ రత్నాయ విశ్వ రూప ధరాయచ
అర్ఘ్యం దదామితే దేవ నాగాది పతయే నమః
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి అని దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళిస్తు న్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
పాద్యం : శ్లో || సర్వాత్మన్ సర్వ లకేశ సర్వ వ్యాపిన్ సనాతనా ,
పాద్యం గృహణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పాద్యం సమర్పయామి అనుచు దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్ర లోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.
ఆచమనీయం ; శ్లో || దామోదర నమస్తేస్తు నర కార్ణ వ తారక ,
గృహణచ మనం దేవ మయా దత్తం హికేశవ .||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి అని దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణె తో ఒక మారు నీరు వదలవలెను .
సూచన : అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను . అరివేణం లో వదలరాదు.
మధుపర్కం : శ్లో || అనంతానంత దేవేశ అనంత ఫల దాయక ,
దధి మధ్వాజ్య నమ్మిశ్రం మధుపర్కం దదామితే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను .(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు.)
పంచామృత స్నానం : శ్లో || అనంత గుణ గంభీర విశ్వా రూప ధరానమ ,
పంచామృ తైశ్చ విదివత్స్నా పయామి దయానిధే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవు పాలు , ఆవు పెరుగు ,తేనె , పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.
శుద్దోదక స్నానం : శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ ,
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు,
స్నానం ప్రకల్పయే త్తీర్ధం సర్వ పాప ప్రముక్తయే .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి అని పంచపాత్ర లోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

అదాష్టోత్తర శతనామ పూజా
ఓం కృష్ణాయ నమః ఓం తమల శ్యామలా కృతియే నమః ఓం దుర్యోదన కులాంతకాయ నమః ఓం కమల నాదాయ నమః ఓం గోపా గోపీశ్వరాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం యోగినే నమః ఓం విశ్వ రూప ప్రదర్శకాయ నమః ఓం సనాతనాయ నమః ఓం కోటి సూర్య సమ ప్రభాయ నమః 40 ఓం సత్యవాచే నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం ఇలాపతయే నమః ఓం సత్య సంకల్పాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం సత్య భామా రతాయ నమః ఓం లీలా మానుష విగ్రహాయ నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం జయినే నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః 80 ఓం యశోదా వత్సలాయ నమః ఓం వనమాలినే నమః ఓం విష్ణవే నమః ఓం హరి : యే నమః 10 ఓం పీతవసనే నమః ఓం భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః ఓం చతుర్భుజాత్త సక్రాసి గదా నమః ఓం పారిజాతా పహారికాయ నమః ఓం జగద్గురువే నమః ఓం శంఖాంబుజా యుదాయుజా నమః ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః ఓం జగన్నాధాయ నమః ఓం దేవకీ నందనాయ నమః ఓం గోపాలాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం సర్వ పాలకాయ నమః 50 ఓం వృషభాసుర విద్వంసినే నమః ఓం నంద గోప ప్రియాత్మజాయ నమః ఓం అజాయ నమః ఓం బాణాసుర కరాంత కృతే నమః ఓం యమునా వేద సంహారిణే నమః ఓం నిరంజనాయ నమః ఓం యుధిష్టర ప్రతిష్టాత్రే నమః ఓం బలభద్ర ప్రియానుజాయ నమః ఓం కామజనకాయ నమః ఓం బర్హి బర్హావతంసకాయ నమః ఓం పూతనా జీవిత హరాయ నమః ఓం కంజ లోచనాయ నమః ఓం పార్ధసారదియే నమః 90 ఓం శకటాసుర భంజనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం నంద వ్రజజనా నందినే నమః 20 ఓం మధురా నాదాయ నమః ఓం గీతామృత మహోదదియే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం కాళీయ ఫణి మాణిక్యరం నమః ఓం నవనీత విలిప్తాంగాయ నమః ఓం బలినే నమః ఓం జిత శ్రీ పదాంబుజాయ నమః ఓం అనఘాయ నమః ఓం బృందావనాంత సంచారిణే నమః 60 ఓం దామోదరాయ నమః ఓం నవనీత హరాయ నమః ఓం తులసీధామ భూషణాయ నమః ఓం యజ్ఞ భోక్త్రే నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం శమంతక మణే ర్హర్త్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం షోడశ స్త్రీ సహస్రేశాయ నమః ఓం నర నారాయణాత్మకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం కుబ్జ కృష్ణాంబర ధరాయ నమః ఓం పర బ్రహ్మణే నమః ఓం మధురాకృతయే నమః ఓం మాయినే నమః ఓం పన్నాగాశన వాహనాయ నమః 100 ఓం శుకవాగ మృ తాబ్దీందవే నమః 30 ఓం పరమ పురుషాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీ నమః ఓం గోవిందాయ నమః ఓం ముష్టి కాసుర చాణూర నమః ఓం వస్త్రా పహారకాయ నమః ఓం యోగినాం పతయే నమః ఓం మల్ల యుద్ద విశారదాయ నమః ఓం పుణ్య శ్లోకాయ నమః ఓం వత్సవాటి చరాయ నమః ఓం సంసార వైరిణే నమః ఓం తీర్ధ కృతే నమః ఓం అనంతాయ నమః ఓం కంసారయే నమః ఓం వేదవేద్యాయ నమః ఓం ధేనుకాసుర భంజనాయ నమః ఓం మురారయే నమః 70 ఓం దయానిధయే నమః ఓం తృణీ కృత తృణవర్తాయ నమః ఓం నరకాంతకాయ నమః ఓం సర్వ తీర్దాత్మకాయ నమః ఓం యమళార్జున భంజనాయ నమః ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః ఓం సర్వ గ్రహ రూపిణే నమః ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః ఓం శిశుపాల శిరచ్చేత్రే నమః ఓం ఓం పరాత్పరాయ నమః 108
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML