గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 November 2015

కాకతీయ గణపతిదేవ చక్రవర్తి ముఖ్యసేనానియైన చౌండ సేనాని తాను నిర్మించిన చౌండ సముద్రం (వరంగల్ జిల్లాలోని కొండపర్తి చెరువు) వద్ధ వేయించిన శాసనం‌లో చేసిన విజ్ఞప్తి.కాకతీయ గణపతిదేవ చక్రవర్తి ముఖ్యసేనానియైన చౌండ సేనాని తాను నిర్మించిన చౌండ సముద్రం (వరంగల్ జిల్లాలోని కొండపర్తి చెరువు) వద్ధ వేయించిన శాసనం‌లో చేసిన విజ్ఞప్తి.

“ఈ ధర్మసేతువు నృపులందరికీ ఒకేరకమైనది కాబట్టి మీతో సదా రక్షించబడాలనీ, భవిష్యత్ కాలాలలో వచ్చే రాజులందరినీ ప్రార్ధిస్తున్నాను. నావంశంవారుగానీ, ఇతరులుగానీ ఇకముందు ప్రభువులైనపుడు ఈ విధానాన్ని దోషరహిత మనస్కులై రక్షింతురుగాక, అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ధర్మం శత్రువుచేసినా సరే కష్టపడి రక్షించాలి. శత్రువు శత్రువేకానీ ధర్మం ఎవరికీ శత్రువు కాదు”


సమాజసంపదలైన ప్రకృతి వనరుల రక్షణపై మధ్యయుగాల్లో భారతీయుల దార్శనికత. ఈ నేపధ్యం‌లో ఐక్యరాజ్య సమితి నిర్వహించే నేటి అంతర్జాతీయ దినోత్సవం గురించి తెలుసుకుందాం.

6 నవంబర్- యుధ్ధం మరియు సాయుధపోరాటలలో ప్రకృతివిధ్వంస నివారణకై అంతర్జాతీయ దినోత్సవం(6 Nov International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict)

చరిత్రలో అనాదినుండి జరుగుతున్న యుధ్ధాలలో చనిపోయిన, గాయపడిన సైనికులు మరియు పౌరుల సంఖ్యనూ, నాశనమైన నగరాలనూ మరియు జీవనోపాధి కోల్పోయినవారిని మాత్రమే లెక్కిస్తున్నారు. ధ్వంసమౌతున్న పర్యావరణంగురించీ, తాగునీటివనరులను విషపూరితం చేయడం గురించీ, అడవులనరికివేత/ కాల్చివేత గురించీ, వన్యప్రాణుల నిర్మూలన, తగలబెట్టబడిన పంటలగురించీ పెద్ధగా పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇటువంటి విధ్వంసాలవల్ల మానవ జీవనానికీ పర్య్హావరణ మనుగడకూ గల ప్రతికులమైన అవినాభావ సంబంధాన్ని తగురీతిలో పట్టించుకోవడం‌లేదు. ప్రకృతివనరుల ధ్వస ప్రభావం ఆ ఒక్క దేశంపైననే కాకుండా మొత్తం ప్రపంచంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.

కొన్నిసార్లు బలవంతులు బలహీనదేశాలపై దాడిచేసి వారిని మరింత బలహీనంగా మార్చడంకొరకు వాణిజ్యపరమైన సహజవనరులను అదుపులోకి తెచ్చుకొని, మరికొన్నింటిని ధ్వసం చేసేవారు.

యుద్ధం మరియు సాయుధ పోరాటాలు జరిగిన సందర్భాలలో గాయపడ్డప్పటికీ నిశ్శబ్దం వహించేవి ప్రకృతి మరియు పర్యావరణం‌లు మాత్రమే. ఆసందర్భంగా ప్రకృతి వహించే నిశ్శబ్దం శ్మశాన నిశ్శబ్దమే. భూమి కలుషితం కావడం, సహజ వనరుల దోపిడీ మరియు ప్రకృతి నిర్వహణ వ్యవస్థలు కూలిపోవడంవల్ల అడవులు నాశనమై, పర్యావరణ సంబంధిత పరిణామాలు తరచూ విస్తృతమైన మరియు వినాశకరమైన ప్రమాదాలను సూచిస్తున్నాయి. .

సాయుధ పోరాటాలు ఎప్పటికప్పుడు మరింత క్లిష్టంగా మారుతున్నాయి, మూల కారణాలను శోధించమంటూ పరిష్కారాలు కోరుతున్నాయి. మనం మరింత స్థితిస్థాపక మరియు సంపన్న సమాజాలు నిర్మించడానికి పేదరికం, వాతావరణ పీడనాలు, జాతుల వెనుకబాటుతనం, సహజ వనరుల పారదర్శక మరియు స్థిరమైన సమాన నిర్వహణను అంతర్గతంగానూ మరియు శాంతి ఒప్పందాలతో పాటు పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ అంతర్జాతీయ దినోత్సవం (6 నవంబర్) రోజున , యుద్ధం బాపతు ప్రభావాలు నుండి పర్యావరణాన్ని రక్షించటానికి, మరియు సహజ వనరులపై భవిష్యత్తులో వైరుధ్యాలను నిరోధించేందుకు ఎల్లవేళలా ప్రపంచదేశాలు నిబద్ధతను చాటుకోవాలి. అంతర్జాతీయ సమాజం ఈ సంవత్సరం నుండి ప్రపంచదేశాల స్థిరమైన అభివృద్ధి అజెండా సూత్రీకరణకు, ఈ సవాళ్ళకు సత్వర పరిష్కారాలు కనుక్కోవడం అంతర్జాతీయ సమాజపు తక్షణ అవసరం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML