గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 12 November 2015

స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి

సూర్యోదయoలోగా స్నానాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు.. ఈ నెలంతా ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం కానున్నాయి.ఈరోజు నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానుండగా, అంతటా ఆధ్మాతిక శోభ అలుము కోనున్నది. కాలాన్ని బట్టి మనుషుల్లో వచ్చే కొన్ని రుగ్మతలను పారదోలేందుకు పలు ఆచారాలను పూర్వీకులు ప్రవేశపెట్టారని ప్రముఖ పండితులు సెలవిస్తున్నందున ఆధ్యాత్మికం వెనుక ఆరోగ్యానికి కార్తీక మాసం ప్రతీకలా నిలుస్తున్నది. దీపావళి తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసానికి చాలా ప్రత్యేకతలున్నాయి.
♦స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి
▬ స కార్తీక నమో మాసః.. నదేవం కేశవాత్పరమ్..| నబవేద సమం శాస్త్రం.. నతీర్థం గంగయాస్సమమ్..||
అని పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన నెల, కేశవునికి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదు అని దీనర్థం. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
💥దీపారాధన..
శివనామస్మరణ చేస్తూ వత్తులను తయారుచేసి ఈ మాసంలో ఐదు రోజుల్లో ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు తులసీ వివాహం, వైకుంఠ చతుర్దశినాడు ఉసిరి చెట్టుకింద దీపారాధన చేస్తారు. విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా చెప్పుకునే పౌర్ణమిన భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు.
💥ఉసిరిక వన భోజనం..
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్లున్న వనంలో సమారాధన చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
💥ఉపవాసం..
కార్తీకమాసంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తారు. ఊబకాయం నుంచి కాస్త ఊరట లభిస్తుందని చెబుతారు. శరీరంలో అన్ని అవయవాలూ చైతన్యవంతంగా పనిచేస్తాయంటారు. అన్నానికి బదులు పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
💥మాల ధారణలు
కార్తీకమాసంలో శివుడు, అయ్యప్ప, ఆంజనేయ, వేంకటేశ్వర, భవానీ మాల ధరిస్తుంటారు. నియమనిష్టలతో గడుపుతారు. మంచి ఆహార నియమాలు పాటిస్తూ అర్చనలు, భజనలు చేస్తారు.
💥తీర్థం ఎంతో శ్రేష్ఠం
భక్తులు ఉదయాన్నే ఆలయానికి వెళ్లి అర్చకులు ఇచ్చే తీర్థం సేవిస్తుంటారు. పచ్చకర్పూరం, స్పటిక, తులసి, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిని ఈ తీర్థం తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
💥రుగ్మతలు దూరం
కార్తీకమాసంలో మహిళలు రోజూ అలుకు జల్లి, స్నానం చేసి, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలుకు కోసం వాడే పేడ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తుంది. ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్య మున్న తులసిమొక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు పీల్చేగాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, గొంతు వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది. సూర్యోదయంలోగా స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగై, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
💥బద్దకం దూరం..
చలికాలంలో సాధారణంగా మనిషిలో బద్దకం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదై శరీరం మొద్దుబారుతుంటుంది. ఇలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు కార్తీకమాసంలో పాటించే అలవాట్లు దోహదపడుతాయి. మహిళలు తెల్లవారుజామునే లేచి, పసుపు రాసుకుని, చన్నీటి స్నానం చేసి, తులసిమొక్కకు పూజలు చేయడం ఓ రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్పాహారం, మధ్యాహ్నం మితభోజనం, రాత్రికి పండ్లు, పాలు తీసుకోవడం కూడా ఆరోగ్యదాయక నియమాలేనని పండితులు పేర్కొంటున్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML