గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 13 November 2015

వామన జయంతి

వామన జయంతి
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి.శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారం.వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలొ వామన పురాణం ఒకటి.
పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః |
పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||
ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.
ఆ కథ ఏమిటంటే...? పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.
ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.
అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.
బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెబుతున్నాయి.
Read More

అనంత వ్రత కల్పముఅనంత వ్రత కల్పము

శ్రీ అనంత పద్మనాభ వ్రతమునకు కావలసిన ముఖ్య వస్తువులు: విష్ణుమూర్తి యొక్క బొమ్మ లేదా చిత్ర పటము , పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గిపెట్టె , అగరువత్తులు , వస్త్ర , యజ్నోపవీతములు , పువ్వులు, పళ్ళు , కొబ్బరికాయ , ఈ వ్రతమునకు తోరములు ముఖ్యము. ఇవి ఎర్రని సిల్కు దారముతో చేసినవి గాని లేదా తెల్లని దారముతో చేసినవైతే కుంకుమ నీటిలో తడిపి ఉంచుకొనవలెను . వీటికి పదునాలుగు ముడులు ఉండవలెను.ప్రసాదమునకు గోధుమ పిండిని ఐదు పళ్ళు (అనగా ఐదు శేర్లు) తీసుకొని బెల్లముతో అతిరసములు (అప్పములు ) తయారు చేసుకొనవలెను. ఇందులో ఇరువది ఎనిమిది అతిరసములు దేవునికి నైవేద్యము పెట్టి తోరము కట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు వాయన దానమిచ్చి , తక్కిన వానిని తాను భుజింపవలయును. పూజా ద్రవ్యము లన్నియు పదునాలుగు చొప్పున ఉండవలయును.బ్రాహ్మణ పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.
ఆచమనం
1 . " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి .
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి .
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 . ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను. ఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతే షామవిరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణా యామమ్య : ఓం భూ : - ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః -ఓం సత్యం -ఓం తత్ సవితురేణ్యం.భర్గో దేవస్య ధీమహి దీయోయోన : ప్రచోదయాత్ .
ఓం ఆపో జ్యోతిర సోమ్రుతం బ్రహ్మ భూర్భు వస్సువ రోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము : యమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్దే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనము ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ) ,సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్ర మానేన ............ సంవత్సరే ,............ ఆయనే, ఋతు : ...........మాసే ,......... పక్షే ............ తిధౌ ,......... వాసరే శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ........గోత్రశ్య
....... నామధేయః , శ్రీమత్యః , గోత్రస్య ,నామ దేయస్య అనియు , స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి,
శ్రీ మత్యాః , గోత్ర వత్యాః నామదేవ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము , నామము చెప్పి ) నామ దేయశ్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య,క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిద్ద్యర్ధం , శ్రీ అనంత పద్మనాభ దేవతా ముద్దిశ్య అనంత పద్మనాభ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్బి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి, లేక కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను .రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను . కుంకుమ అక్షతలు వగైరా బొటన ,మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను . యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ,ఇలా అనుకోవాలి . ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువ వలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః
ఋ గ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
శ్లో || గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ||

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ అనంత పద్మనాభ దేవతాః (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పు కొనవలెను ) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి.

మూనర్జము :
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాంగతోపివా
యస్స్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||

అని పిదప కాసిని అక్షతలు , పసుపు ,గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను . ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాది పతయే నమః
ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహోర్తోస్తూ తదాస్తు . తరువాత ఇలా చదువుతూ స్వామికి నమస్కరించ వలెను.

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||
సుముఖశ్చైక దంతశ్చక పిలో గజ కర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్న రాజో వినాయకః
ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామాని యః పటేచ్చ్రుణుయాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్యన జాయతే ||
అనంత పద్మనాభుని వ్రతమునకు ముందుగా యమునా పూజను చేయవలెను .

యమునా పూజా
ధ్యానం : శ్లో || క్షీరో దార్ణవ సంభూతే ఇంద్ర నీల సమప్రభే ,
ధ్యానం కరోమి యమునే విష్ణు రూపి నమోస్తుతే .
యమునా దేవీం ధ్యాయామి అని యమునా దేవిని ధ్యానించవలెను .

ఆవాహనం : శ్లో || యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయినీ ,
ఆవాహయామి భక్త్యాత్వాం సాన్నిధ్యం కురు సువ్రతే .
యమునా దేవ్యై నమః ఆవాహయామి అని ఆ దేవతను మన ఇంటి లోనికి పిలుచుచున్నట్లుగా (ఆహ్వానించు చున్నట్లుగా ) భావించి అక్షతలు తీసుకొని వేయవలెను .

ఆసనం : శ్లో || నమస్కరోమి యమునే సర్వ పాప ప్రణాశిని ,
రత్న సింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం .
యమునా దేవ్యై నమః ఆసనం సమర్పయామి అని కూర్చొనుటకు సింహాసనము ఇచ్చినట్లుగా భావించి దేవిపై అక్షతలు వేయవలెను .
పాద్యం : శ్లో || సింహాసన సమారూడే దేవ శక్తి సమన్వితే ,
పాద్యం గృహణ దేవేశి సర్వ లక్షణ సంయుతే .
యమునా దేవ్యై నమః పాద్యం సమర్పయామి అని దేవికి కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణెతో తీసుకొని చల్లవలెను .

అర్ఘ్యం : శ్లో || నంది పాదే నమస్తుభ్యం సర్వ పాప నివారిణి
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిద ముత్తమం ||
యమునా దేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుగు కొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణె తో వేరొక పాత్ర లోనికి వేయవలెను .

ఆచమనీయం : శ్లో || హర వైడూర్య సంయుక్తే సర్వ లోక హితే శివే ,
గృహణాచమనం దేవి శంకరార్ధ శరీరణి ||
యమునా దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి అని పంచ పాత్రలోని శుద్ధ జలమును ఉద్దరిణెతో అర్ఘ్య పాత్ర లోనికి వదల వలెను .

స్నానం : శ్లో || దేవ సలిలే నమస్తుభ్యం సర్వ లోక హితే ప్రియే ,
సర్వ పాప ప్రశమని తుంగ భద్రే నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః స్నానం సమర్పయామి అని స్నానమునకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్ర లోని నీటిని పువ్వుతో లేదా ఉద్దరిణెతో వేరొక గిన్నె లోనికి వదలవలెను .

వస్త్ర యుగ్మం : శ్లో || గురు పాదే నమస్తుభ్యం సర్వ లక్షణ సంయుతే ,
సువ్రతం కురుమే దేవి తుంగ భద్రే నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అని వస్త్రమునకు సమర్పిస్తున్నట్లుగా భావించి పత్తితో బిళ్ళ వలె చేసి , దానికి కుంకుమ పెట్టిన వస్త్ర యుగ్మమును దేవికి సమర్పించ వలెను.

మధుపర్కం : శ్లో || కృష్ణ వేణి నమస్తుభ్యం కృష్ణవేణీ సులక్షణే,
మధుపర్కం గృహాణే దం మయాదత్తం శుభప్రదే ||
యమునా దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ, ఈ మధుపర్కం ను ప్రతిమకు అద్దవలెను .(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచు కొన్న దానిని మధుపర్కం అంటారు ).

ఆభరణాని : శ్లో || నంది పాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరణి,
సర్వలోక హితే తుభ్యం భీమ రధ్యై నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి అని తమ శక్తి కొలది ఆభరణములను దేవి వద్ద ఉంచి నమస్కరించ వలెను .

ఉత్తరీయం ; శ్లో || సహ్య పాద సముద్భూతే సర్వ కామ ఫల ప్రదే ,
సర్వ లక్షణ సంయుక్తే భవ నాశినితే నమః ||
యమునా దేవ్యై నమః ఉత్తరీయం సమర్పయామి అనుచూ కండువా వంటి తెల్లని వస్త్రమును సమర్పించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణి తో అర్ఘ్య పాత్ర లోనికి వదలవలెను .

గంధం : శ్లో || కృష్ణ పాద సముద్భూతే గంగేత్రి పధ గామిని ,
జటాజూట సమద్భూతే సర్వ కామ ఫల ప్రదే ||
యమునా దేవ్యై నమః గంధం సమర్పయామి అనుచు గంధమును ఈ దేవతపై రెండు , మూడు చుక్కలు చల్లవలెను

అక్షతలు : శ్లో || గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని ,
స్వీకురుష్వ జగద్వంద్వే అక్షతా నమలాన్ శుభాన్ ||

యమునా దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి అనుచు అక్షతలను (కొద్ది బియ్యమును తీసుకొని తడిపి పసుపు వేసి కలుపవలెను ) దేవిపై చల్ల వలెను .

పుష్ప పూజ : శ్లో || మందారై : పారిజాతైశ్చ పాటలాశోక చంపకై :,
పూజయామి తవ ప్రీత్యై వందే భక్త వత్సలే .

యమునా దేవ్యై నమః పుష్పై : పూజయామి అనుచు కొన్ని పూవులను తీసుకొని అక్షతలు , పూవులు కలిపి దేవిపై వేయవలెను. ఈ షోడశోపచార పూర్తి అయిన పిమ్మట 13 నామములు గల అధాంగ పూజను చేయవలెను . ప్రతి నామమునకు పువ్వులు కాని , పసుపు కాని కుంకుమ కాని వేయవచ్చును.

అధాంగ పూజ
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి ; ఓం సుజంఘాయై నమః జంఘే పూజయామి ; ఓం చపలాయై నమః జానునీ పూజయామి ; ఓం పుణ్యాయై నమః ఊరూ పూజయామి ; ఓం కమలాయై నమః కటిం పూజయామి ; ఓం గోదావర్యై నమః స్తనౌ పూజయామి ; ఓం భావ నాశిన్యై నమః కంటం పూజయామి ;ఓం తుంగభద్రాయై నమః ముఖం పూజయామి ; ఓం సుందర్యై నమః లలాటం పూజయామి ; ఓం దేవ్యై నమః నేత్రే పూజయామి ; ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి ; ఓం సునాసికాయై నమః నాసికం పూజయామి ; ఓం భాగీరధ్యై నమః శిరః పూజయామి .

యమునా దేవ్యై నమః సర్వాంణ్యం గాని పూజయామి .

ధూపం : శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు సంయుతం ,
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతి గృహ్యతాం .||
యమునా దేవ్యై నమః ధూపం సమర్పయామి అని ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తి వెలిగించి తిప్పుతూ దూపమును దేవికి చూపవలెను .

దీపం : శ్లో || ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్య తిమిరాపహమ్,
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరి నమోస్తుతే .
యమునాదేవ్యై నమః దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువ వలెను.

నైవేద్యం : శ్లో || భక్త్యైశ్చ భోజ్యైశ్చ రసై షడ్భిస్సమన్వితం
నైవేద్యం గృహ్యాతం దేవి యమునాయై నమోనమః

యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి అని పళ్ళు , కొబ్బరికాయ మొదలగునవి దేవి వద్ద నుంచి ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో పదార్దాములపై పువ్వులతో నీళ్ళు చల్లుతూ ' ఓం ప్రాణాయ స్వాహ , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ' అంటూ ఆరు మార్లు చేతితో ( చేతిలోని ఉద్దరిణి తో ) స్వామికి నివేదనం చూపించాలి . పిదప ఓం యమునా దేవ్యై నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచపాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .
తరువాత ' పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. నిత్య పూజా విదానమందు ఈ విధంగా చేసే నైవేద్యం అనంత పద్మనాభ వ్రతమునకు 14 రకముల పిండి వంటలు చేసి అందు రకమునకు 14 చొప్పున ఒక పళ్ళెములో వుంచి నివేదన చేయాలి పునః శుద్దాచామనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం ........

హస్త ప్రక్షాళనం : శ్లో || పానీయం పావనం శ్రేష్టం గంగా సరసోద్భవం
హస్త ప్రక్షాళ నార్ధం వై గృహాణ సుర పూజితే .
యమునా దేవ్యై నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి అని భోజనము అయిన పిదప చేతులు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణితో అర్ఘ్య పాత్ర లోనికి హస్తౌ ప్రక్షాళయామి అంటూ వదలవలెను .

తాంబూలం : శ్లో || కరూప్ర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యతాం దేవీ యమునాయై నమోస్తుతే ||
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి అని మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి . తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , ' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .

నీరాజనం : పిమ్మట కర్పూరం వెలిగించి ...............
శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా ,
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి మూడుసార్లు త్రిప్పుచూ , చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి .
తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని ,

మంత్ర పుష్పం :
ఓం శ్రీ యమునాదేవ్యై నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు దేవి వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి .

ప్రదక్షిణం : శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన. ||
శ్లో || ప్రమాద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక,
ప్రదక్షణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే . ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి . చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగ వారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ .........

ప్రార్ధనం : శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ||
యమునా పూజా విధానం సంపూర్ణం

యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి అని మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి . తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , ' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .

నీరాజనం : పిమ్మట కర్పూరం వెలిగించి ...............
శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా ,
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||

ఓం శ్రీ యమునా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి మూడుసార్లు త్రిప్పుచూ , చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి .
తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని ,

మంత్ర పుష్పం :
ఓం శ్రీ యమునాదేవ్యై నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు దేవి వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి .

ప్రదక్షిణం : శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన. ||
శ్లో || ప్రమాద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక,
ప్రదక్షణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే . ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి . చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగ వారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ .........

ప్రార్ధనం : శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

యమునా పూజా విధానం సంపూర్ణం

అధ శ్రీ మదనంత పద్మనాభ పూజా కల్పః
ధ్యానం ;
శ్లో || కృత్వా దర్బ మయం దేవం పరిధాన సమన్వితం
ఫణై స్సప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షిణాగ్ర కరే పద్మం శంఖం తస్యా ప్యధః కరే
అవ్యయం సర్వ లోకేశం పీతాంబర ధరం హరిం
దుగ్దాబ్ది శాయనం ద్యాత్వా దైవ మావాహయే త్సుదీ ||
ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః - ధ్యానం సమర్పయామి అని స్వామిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను .
ఆవాహనం : శ్లో || అగచ్చానంత దేవేశ తేజో రాశే జగత్పతే
ఇమాం మాయా కృతం పూజాం గృహాణ సుర సత్తమ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి అని ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం .అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను .
ఆసనం ; శ్లో || అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆసనం సమర్పయామి . నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి . దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీత వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
తోరస్తాపనం : శ్లో || తస్యాగ్ర తోదృడం సూత్రం కుంకు మాక్తం సుదోరకం
చతుర్దశ గ్రంధి సంయుక్తం ఉప కల్ప్య ప్రజాజయేత్ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోరా స్థాపనం కరిష్యామి అని 14 ముడులతో సిద్దం చేసి ఉంచుకున్న ఎర్రని దారముతో చేసిన తోరమును ( ఎర్రని దారము కానిచో తెల్లని దారముతో తయారు చేసి కుంకుమ నీళ్ళలో ముంచినది ) స్వామిపై వేయవలెను.

వస్త్ర యుగ్మం : శ్లో || శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే ,
పీతాంబర ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని వస్త్రయుగ్మం అంటారు ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
ఉపనీతోత్తరీయాన్ : శ్లో || నారాయణ నమస్తేస్తు త్రాహిమాం భవ సాగరాత్ ,
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఉపనీతోత్తరీయాన్ సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను . ఇదియును ప్రత్తితో చేయ వచ్చును. ప్రత్తిని తీసుకొని పసుపు చేత్తో బ్రొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి కుంకుమ అద్దవలెను. దీనిని స్వామిపై ఉంచవలెను.
గంధం : శ్లో || శ్రీ గంధం చంతనో న్మిశ్రం కుంకుమాది భిరంవితం,
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః గంధాన్ సమర్పయామి గంధమును రెండు మూడు చుక్కలు స్వామిపై చల్లవలెను .
అక్షతాన్ : శ్లో || శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయాదత్తాన్ శుభావహాన్ ,
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీకురు ప్రభో .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి అని కొద్ది అక్షతలను తీసుకొని ( పసుపు కలిపిన బియ్యమును ) స్వామిపై చల్లవలెను.
పుష్ప పూజ : శ్లో || కరవీరై ర్జాతి కుసుమైశ్చం పకైర్వకు లై శ్శుభై :
శత పత్రైశ్చ కల్హారైరర్చయే పురుషోత్తమ.
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పుష్పాణి పూజయామి కొద్ది పుష్పములను తీసుకొని స్వామీ పాదములపై ఉంచి నమస్కరించ వలెను .
పిమ్మట క్రింది అధాంగ పూజను ఒక్కొక్క నామమునకు పువ్వులు లేదా పసుపు లేదా కుంకుమను స్వామిపై వేస్తూ పూజించవలెను.
అధాంగ పూజ
ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి ; ఓం శేషాయ నమః గుల్ఫౌ పూజయామి ; ఓం కాలాత్మనే నమః జంఘే పూజయామి ; ఓం విశ్వ రూపాయ నమః జానునీ పూజయామి; ఓం జగన్నాదాయ నమః గుహ్యం పూజయామి; ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి ; ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి; ఓం శ్రీ వత్స వక్షసే నమః వక్ష స్థలం పూజయామి ; ఓం చక్ర హస్తాయ నమః హస్తాన్ పూజయామి ; ఓం ఆజాను బాహవే నమః బాహున్ పూజయామి ; ఓం శ్రీ కంటాయ నమః కంటం పూజయామి ; ఓం చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి ; ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి ;
ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి ; ఓం నారాయణాయ నమః నేత్రౌ పూజయామి ; ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి ;ఓం అనంత పద్మనాభాయ నమః శిరః పూజయామి ; ఓం విష్ణవే నమః సర్వాణ్యం పూజయామి .
పిమ్మట క్రింది 108 నామములకు ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు గాని , పసుపు గాని , కుంకుమ గాని వేయుచు ఈ నామములతో పూజించ వలెను.

అర్ఘ్యం : శ్లో || అనంత గుణ రత్నాయ విశ్వ రూప ధరాయచ
అర్ఘ్యం దదామితే దేవ నాగాది పతయే నమః
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి అని దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళిస్తు న్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
పాద్యం : శ్లో || సర్వాత్మన్ సర్వ లకేశ సర్వ వ్యాపిన్ సనాతనా ,
పాద్యం గృహణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పాద్యం సమర్పయామి అనుచు దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్ర లోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.
ఆచమనీయం ; శ్లో || దామోదర నమస్తేస్తు నర కార్ణ వ తారక ,
గృహణచ మనం దేవ మయా దత్తం హికేశవ .||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి అని దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణె తో ఒక మారు నీరు వదలవలెను .
సూచన : అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను . అరివేణం లో వదలరాదు.
మధుపర్కం : శ్లో || అనంతానంత దేవేశ అనంత ఫల దాయక ,
దధి మధ్వాజ్య నమ్మిశ్రం మధుపర్కం దదామితే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను .(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు.)
పంచామృత స్నానం : శ్లో || అనంత గుణ గంభీర విశ్వా రూప ధరానమ ,
పంచామృ తైశ్చ విదివత్స్నా పయామి దయానిధే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవు పాలు , ఆవు పెరుగు ,తేనె , పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.
శుద్దోదక స్నానం : శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ ,
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు,
స్నానం ప్రకల్పయే త్తీర్ధం సర్వ పాప ప్రముక్తయే .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి అని పంచపాత్ర లోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

అదాష్టోత్తర శతనామ పూజా
ఓం కృష్ణాయ నమః ఓం తమల శ్యామలా కృతియే నమః ఓం దుర్యోదన కులాంతకాయ నమః ఓం కమల నాదాయ నమః ఓం గోపా గోపీశ్వరాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం యోగినే నమః ఓం విశ్వ రూప ప్రదర్శకాయ నమః ఓం సనాతనాయ నమః ఓం కోటి సూర్య సమ ప్రభాయ నమః 40 ఓం సత్యవాచే నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం ఇలాపతయే నమః ఓం సత్య సంకల్పాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం సత్య భామా రతాయ నమః ఓం లీలా మానుష విగ్రహాయ నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం జయినే నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః 80 ఓం యశోదా వత్సలాయ నమః ఓం వనమాలినే నమః ఓం విష్ణవే నమః ఓం హరి : యే నమః 10 ఓం పీతవసనే నమః ఓం భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః ఓం చతుర్భుజాత్త సక్రాసి గదా నమః ఓం పారిజాతా పహారికాయ నమః ఓం జగద్గురువే నమః ఓం శంఖాంబుజా యుదాయుజా నమః ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః ఓం జగన్నాధాయ నమః ఓం దేవకీ నందనాయ నమః ఓం గోపాలాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం సర్వ పాలకాయ నమః 50 ఓం వృషభాసుర విద్వంసినే నమః ఓం నంద గోప ప్రియాత్మజాయ నమః ఓం అజాయ నమః ఓం బాణాసుర కరాంత కృతే నమః ఓం యమునా వేద సంహారిణే నమః ఓం నిరంజనాయ నమః ఓం యుధిష్టర ప్రతిష్టాత్రే నమః ఓం బలభద్ర ప్రియానుజాయ నమః ఓం కామజనకాయ నమః ఓం బర్హి బర్హావతంసకాయ నమః ఓం పూతనా జీవిత హరాయ నమః ఓం కంజ లోచనాయ నమః ఓం పార్ధసారదియే నమః 90 ఓం శకటాసుర భంజనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం నంద వ్రజజనా నందినే నమః 20 ఓం మధురా నాదాయ నమః ఓం గీతామృత మహోదదియే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం కాళీయ ఫణి మాణిక్యరం నమః ఓం నవనీత విలిప్తాంగాయ నమః ఓం బలినే నమః ఓం జిత శ్రీ పదాంబుజాయ నమః ఓం అనఘాయ నమః ఓం బృందావనాంత సంచారిణే నమః 60 ఓం దామోదరాయ నమః ఓం నవనీత హరాయ నమః ఓం తులసీధామ భూషణాయ నమః ఓం యజ్ఞ భోక్త్రే నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం శమంతక మణే ర్హర్త్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం షోడశ స్త్రీ సహస్రేశాయ నమః ఓం నర నారాయణాత్మకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం కుబ్జ కృష్ణాంబర ధరాయ నమః ఓం పర బ్రహ్మణే నమః ఓం మధురాకృతయే నమః ఓం మాయినే నమః ఓం పన్నాగాశన వాహనాయ నమః 100 ఓం శుకవాగ మృ తాబ్దీందవే నమః 30 ఓం పరమ పురుషాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీ నమః ఓం గోవిందాయ నమః ఓం ముష్టి కాసుర చాణూర నమః ఓం వస్త్రా పహారకాయ నమః ఓం యోగినాం పతయే నమః ఓం మల్ల యుద్ద విశారదాయ నమః ఓం పుణ్య శ్లోకాయ నమః ఓం వత్సవాటి చరాయ నమః ఓం సంసార వైరిణే నమః ఓం తీర్ధ కృతే నమః ఓం అనంతాయ నమః ఓం కంసారయే నమః ఓం వేదవేద్యాయ నమః ఓం ధేనుకాసుర భంజనాయ నమః ఓం మురారయే నమః 70 ఓం దయానిధయే నమః ఓం తృణీ కృత తృణవర్తాయ నమః ఓం నరకాంతకాయ నమః ఓం సర్వ తీర్దాత్మకాయ నమః ఓం యమళార్జున భంజనాయ నమః ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః ఓం సర్వ గ్రహ రూపిణే నమః ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః ఓం శిశుపాల శిరచ్చేత్రే నమః ఓం ఓం పరాత్పరాయ నమః 108
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .
Read More

శనిత్రయోదశిశనిత్రయోదశి
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

శని మహత్యం
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం
శనీశ్వరుడి జప మంత్రాలు
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం
Read More

మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము.మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’ నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది.


శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.

మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.

‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.

వల్లూరి పవన్ కుమార్
Read More

భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్ది అని వ్యవహరిస్తారు.

ఉండ్రాళ్ల తద్ది
భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్ది అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్లతద్ది స్త్రీల పండుగ. స్త్రీలలోనూ కన్నెల, పడుచుల పండుగ. మగ పిల్లలు చిన్నవారు కూడా ఇందులో పాల్గొంటారు. తలంటు స్నానం అయిన తర్వాత చేతివేళ్లకు కాలివేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారు జామున గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసును, గట్టి పెరుగుతో భోజనం చేసి తాంబూలం వేసుకుని, ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం వాటితో కాలక్షేపం చేస్తారు. గోరింట ఈ పర్వ కలాపంలో ప్రవేశం పొందింది. ఆషాఢమాసంలో ఏదో ఒక రోజున, ఉండ్రాళ్ల తద్దికి, అట్టతద్దికి గోరింటాకు పెట్టుకోవడం మనలో ఒక ఆచారంగా ఉంటూ ఉంది. గోరింట ఆకును బాగా నూరి ఆడపిల్లలు, స్త్రీలు చేతి గోళ్లకు, పారాణిగా పాదాలకు పెట్టుకుంటారు. గోరింటాకు సంస్కృతంలో నఖరంజని అని పేరు. రంగును కలిగించేది అని అర్థం. ఈ గోరింటాకు గురించి స్త్రీలకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. స్త్రీలు అరికాళ్లలో గోరింటాకు నూరిన ముద్దతో చుక్కపెట్టుకుంటారు. అది బాగా పట్టినట్లయితే ఆ స్త్రీకి తరగని అయిదవతనం. గోరింటాకు బాగా పండితే ఆ పడుచును భర్త బాగా ప్రేమిస్తాడు. 'ప్రేమ కలవారి కంటు గోరింట' అనే నానుడి.
గోరింట మంచి మూలిక. దాని ఆకులు, పట్ట, పూవులు, గింజలు ఓషధీగుణం కలవి. గోరింటలో ఒకవిధమైన చిరువిషం కలదు. హన్నొటాన్నిక్ ఆసిడ్ కలదు. పూవులతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు. గింజలో చమురు ఉంది.
ఉండ్రాళ్ల తద్ది
ఉండ్రాళ్లు తైల పక్వము కాక కేవలం ఆవిరి మీద ఉడికే పిండివంట. భాద్రపద మాసంలో వచ్చే మూడు పండుగలకు ప్రత్యేకం ఉండ్రాళ్లే నివేదన వస్తువులుగా ఉండడం మనం గమనించాలి. శివుణ్ణి పతిగా కోరి పార్వతి సాగించిన తపస్సుకు మోదితుడై శివుడు ప్రత్యక్షమైన రోజు అని ధర్మసింధువు. తెలుగు వారికి ఇది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది. పదహారు బిళ్ల కుడుములు వండి పూజ చేసి నైవేద్యం పెట్టడం అప్పటి ఆచారం. ఇప్పటికీ అనుకరణలో వ్రత నిష్ఠ విధానాలు చెప్పే షోడశోమా వ్రతం తెలుగులో ఈ పేరు కూర్చుకున్నది. రాజస్తాన్, మహారాష్ట్ర, మాళవ, ఉత్కళ దేశాల్లో ఆ రోజు నైవేద్యం ఆవిరి కుడుములే.
ఉండ్రాళ్లు ఆవిరి కుడుములు సేవించడం ఆరోగ్య దృష్ట్యా వరణీయమన్నమాట. ఉండ్రాళ్లను సంస్కృతంలో మోదకాలు అంటారు. వరి బియ్యపు పిండిని ముందు నీళ్లలో ఉడికిస్తారు. ఈ ఉడికే పిండిలో కొద్దిగా బొబ్బర్లు కాని, శనగ పప్పుకాని వేయం కూడా కద్దు. ఉడికిన ఈ పిండిని ముద్దలుగా చేసి నీటి ఆవిరి మీద గుడ్డ కట్టి కాని ఎండు గడ్డిగాని చుట్టి కాని ఇడ్లీల మాదిరిగా వండుతారు.
మేహశాంతిని చేయడంలో ఈ పిండి వంట పెట్టింది పేరు. బలకరమైనదే అయినా దీని వద్ద గురుత్వం చేసే గుణం కూడా ఉంది. కాబట్టి విస్తరించి వాడకూడదు. వరి పిండితో మినపపిండి కూడా మిళాపు చేసి ఇడ్లీలు, పొట్టింకులు మొదలైనవి చేస్తారు. అవి ఉండ్రాళ్ల భిన్న స్వరూపాలు అనుకోవచ్చు. ఉండ్రాళ్లను పాలలో నానవేస్తే పాల ఉండ్రాళ్లు, అవుతాయి. పాల ఉండ్రాళ్లు వీర్యపుష్టిని ఇస్తాయి. భోగినాడు తలంటు, గోరింటాకు పెట్టుకొనుట, మరునాడు తెల్లవారు జామున ఆడుకోవడం, పగలు పుష్పాచయము, పత్రాపచయము కోసం తోటల వెంట తిరుగుట ఊయల ఊగుట విహార విధులను ఈ పండుగ రోజున చేసే కార్యక్రమాలు. ఉండ్రాళ్ల తద్దినాడు ఉండ్రాళ్లు పగలు పూజ అయ్యాక తినేవి. ఈ రోజు తెల్లవారు జామున తినే పదార్థాలు కొన్ని అనుచానంగా వస్తూ ఉన్నది.
వెల్లుల్లి వేసిన గోంగూర పచ్చడి, నీరుల్లి పాయల పులుసు, నువ్వుల పొడి, పెరుగు అన్నంతో భోజనం చేయాలి. ఆ మీద అవి అరిగేటట్లు ఆడుకోవాలి. ఇక ఈ పండుగ సందర్భంలో తినే గోంగూర, నువ్వులు, ఉల్లిపాయ ఓషధీగుణాలు కూడా తెలుసుకోతగ్గవే. ఇక ఊయల ఊగడం మనోల్లాసకరమైన క్రీడలలో ఊయల ఊగడం ఒకటి. ప్రతివారి పసితనం అయిదారు మాసాల వరకు విశేషకాలం ఊయలలోనే గడుస్తుంది. అది వాతహరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాగా పెద్దవారు
కూడా అప్పుడప్పుడు ఊయల ఊగడం మంచింది. ఊయల ఊగడం ఉల్లాసంగా ఉత్సాహంగా వుంటుంది.
ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు. ఉండ్రాళ్లు వండుతారు. దేవికి అవి నైవేద్యం పెడతారు. భోజనంతో పాటు వానిని తింటారు. పిండివంటల్ని పట్టి ఏర్పడ్డ పండుగలలో ఇది ఒకటి. భాద్రపదశుద్ధ చవితి వినాయక చవితినాటి పిండివంట కూడా ఉండ్రాళ్లు. వినాయక చవితి వెళ్లిన పదిహేను రోజులకే ఉండ్రాళ్ల తద్ది. ఉండ్రాళ్లు ఆవిరి కుడుముల సేవనం ఈ కాలపు ఆరోగ్యానికి మంచిది. అజీర్ణం చేయకుండా బలాన్ని కలిగిస్తాయి. మేహ, పైత్య సంబంధరోగాలను ఉండ్రాళ్లు పొట్టెంకలు, జిల్లేడు కాయలు శమింపజేసాయి. ఉండ్రాళ్ల తదియ వ్రత చర్యలో ఐదుగురు ముత్తయిదులకు తలంటిపోసి గోరింటాకు ఇవ్వటం ముఖ్యంగా చెప్పబడింది. ఇది పొద్దుపోయే సమయాన చేస్తారు.
కథ :
పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి” అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.
ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ‘‘ఉండ్రాళ్లతద్ది” అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. ‘‘నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటుచే” మని అడిగింది.
ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది.
చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న ఉండ్రాళ్లను చేసి, నైవేద్యం పెట్టింది. అయిదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంత.. ఐదేళ్లు నిర్వఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది.
వల్లూరి పవన్ కుమార్
Read More

మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం).. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి.మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం)

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే |

యాచిత్వాపి నరః కుర్యాత్ పితౄణాం తన్మహాలయం ||

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి.అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు. గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, ఆ పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. ఆ విధంగా సమీపంలో ఉన్న ఏ ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, ఆ నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.ఈ విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే... కర్ణా... ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఏ ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు ఓ అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.

ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో.... ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, ఆ రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, ఆ యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు. ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు... సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, ఆ వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ |

అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్ ||

ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః |

కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై ||

భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే |

అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం ||

క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః |

దరిద్రోరోదనం కుర్యాత్ ఏవంకాననభూమిషు ||

తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః |

హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః ||

పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు.--- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..
Read More

పితృ తర్పణము --విధానముపితృ తర్పణము --విధానము

శ్రీః

శ్రీమతే వేద పురుషాయ నమః

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును

తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను )

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..

తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |

ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,

--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )

తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |

అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,

-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు ...దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి

తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...

ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.

దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనము ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)

అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే...

( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...

( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)

మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.

ప్రథమ కూర్చే ..

|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,

-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |

౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం

--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )

--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం

------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి

అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి

|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |

ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః

తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే...ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి , శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి ... బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )

( బ్రహ్మ యజ్ఞం విధి ప్రత్యేకముగా వ్రాయుచున్నాను )

ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ
Read More

ఆశ్వీయుజ మాసంలో స్త్రీలు చేసే వ్రతాలు…ఆశ్వీయుజ మాసంలో స్త్రీలు చేసే వ్రతాలు…

కోజాగరీ వ్రతం.
ఈ వ్రతంను ఆశ్వీయుజ పూర్ణిమనాడు ఆచరించవలెను. ఈ వ్రతం శ్రీమన్నారాయణుడికి, అతని దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. రాత్రి శ్రీమహాలక్ష్మిని పూజించి, బియ్యం, పాలు,పంచదార, కుంకుమపువ్వు వేసి చక్రపొంగలి చేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ దినం రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుందిట. ఎవరైతే మేలుకుని ఉంటారో వారికి సకల సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

గొంతెమ్మ పండుగ
దీనిని కూడా అశ్వీయుజ పూర్ణిమనాడే జరుపుకొనవలెను. ఈ దినం కుంతీ మహేశ్వరీదేవిని పూజించి అరిసెలు, అప్పములు, అన్నము మొదలైన నైవేద్యములు సమర్పించవలెను. ఈ విధంగా పూజించడంవల్ల మహిళల కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

చంద్రోదయ గౌరీవ్రతం
ఈ వ్రతమును ఆశ్వీయుజ బహుళ పక్ష తదియనాడు ఆచరించవలెను దీనికే ’చంద్రోదయోమావ్రతం’ అని, అట్లతద్ది వ్రతం అని కూడా పేర్లు ఉన్నాయి. అట్లతద్దినాడు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నానం చేసి, గౌరీదేవిని, గణపతిని పూజించవలెను పగలంతా అంటే రాత్రి చంద్రుడు ఉదయించేవరకు ఉపవాసం ఉండి అనంతరం అట్లు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించవలెను. ఆ అట్లతో భోజనం చేయవలెను.

ఆశ్వీయుజ మాసంలో పండుగలు..
ఆశ్వీయుజ శుక్లపక్ష దశమి : విజయదశమి
పాడ్యమి మొదలుకుని దశమివరకు ఉన్న పదిరోజులకు ’దసరా’ అని పేరు. ’దశహర్’ అనే పదం నుండి ’దసరా’ అనేది ఏర్పడింది. అంటే పది పాపములను హరించునది అని అర్ధం. మొదటి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు. విజయదశమికే ’అపరాజిత దశమి’ అని కూడా పేరు. అనగా అపజయం లేని రోజు. ఈ దినం ఆయుధపూజ చేసి దేవిని పూజించడంతోపాటు సాయంత్రం శమీవృక్షం వద్దకు వెళ్ళి దర్శించి పూజించవలెను.

ఆశ్వీయుజ శుక్లపక్ష దశమి : విజయదశమి
పాడ్యమి మొదలుకుని దశమివరకు ఉన్న పదిరోజులకు ’దసరా’ అని పేరు. ’దశహర్’ అనే పదం నుండి ’దసరా’ అనేది ఏర్పడింది. అంటే పది పాపములను హరించునది అని అర్ధం. మొదటి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు. విజయదశమికే ’అపరాజిత దశమి’ అని కూడా పేరు. అనగా అపజయం లేని రోజు. ఈ దినం ఆయుధపూజ చేసి దేవిని పూజించడంతోపాటు సాయంత్రం శమీవృక్షం వద్దకు వెళ్ళి దర్శించి పూజించవలెను.

శుక్లదశమి : శ్రీమధ్వాచార్య జయంతి
త్రిమతాచార్యులలో ఒకరు, ద్వైతమత స్థాపకుడు అయిన శ్రీమధ్వాచార్యులవారు ఈ దినం జన్మించినట్లు చారిత్రక కథనం.

శుక్ల ఏకాదశి : పాశాంకుశ ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాస వ్రతమును అనుసరించడంవల్ల పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి అని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

కృష్ణపక్ష ఏకాదశి : ఇందిరా ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించడంవల్ల ఇహలోకంలోని వారికి సౌఖ్యం లభించడమే కాకుండా యమలోకంలో బాధలు అనుభవిస్తూ ఉన్న పితృదేవతలకు విముక్తి లబించి వైకుంఠానికి వెళ్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

కృష్ణపక్ష ద్వాదశి : గోవత్స ద్వాదశి
గోవును శ్రీమహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించడం మన ఆచారం.ఈ దినం సాయంత్రం గోవును దూడతో సహా అలంకరించి పూజించవలెను. గోసంబంధమైన అంటే పాలు, పెరుగు, నెయ్యి వంటివాటిని భుజించరాదు. మినుములతో వండిన వంటకము భుజించడం మంచిది.

కృష్ణపక్ష త్రయోదాశి : శ్రీ ధన్వంతరి జయంతి
ఈ రోజు ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇలా పూజించడంవల్ల సకల వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష చతుర్దశి : నరక చతుర్దశి
దీనికే ’ప్రేత చతుర్దశి’ అని పేరు. ఈ రోజు తెల్లవారుఝూమునే నిద్రలేచి నువ్వులనూనెతో తలంటుకుని స్నానం చేయవలెను. స్నానానంతరం నువ్వులతో యముడికి తర్పణం వదలవలెను. సాయంత్రం దీపములను వెలిగించవలెను.

కృష్ణపక్ష అమావాస్య : దీపావళి
ఈ దినం సూర్యోదయపూర్వమే స్నానమాచరించవలెను. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి లక్ష్మీదేవిని పూజించవలెను. సాయంత్రం నువ్వులనూనెతో ఇంటి ద్వారం, ధాన్యం కొట్టు, బావి, రావిచెట్టు, వంట ఇంటిలో దీపాలను వెలిగించవలెను. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడని, మహాలయ పక్షాల్లో భూమిమీదకు పితృదేవతలు తిరిగి వెళ్ళేందుకే మగవారు దక్షిణ దిక్కుగా నిలబడి దివిటీలు వెలిగించవలెను. అనంతరం ఇంటిలోనికి వచ్చి తీపి పదార్థాన్ని భుజించి బాణాసంచా వెలిగించవలెను.

ఈ విధంగా ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకున్న మాసం ’ఆశ్వీయుజ మాసం’ . ఈ మాసంలో చేసే పూజలు, విధుల ఆచరణవల్ల అనంతమైన ఫలితాలు కలుగుతాయి.
Read More

PANCHA KANYA THE POWER FULL FIVE WOMEN’S OF IN INDIAN EPIC’S ---Continued fromPANCHA KANYA THE POWER FULL FIVE WOMEN’S OF IN INDIAN EPIC’S
---Continued from

1. SITA
Janaka, the King of Mithila, as is well known, found Sita while his fields were being ploughed. She is the wonderful daughter of the earth, stable, forgiving, patient and pure. The story of her kidnapping by Ravana and her suffering at the hands of the people of Ayodhya is read every day in millions of homes. It continues to inspire devotion and compassion among all women. Briefly, Sita, the Princess of Mithila, was married to Ram, the Prince of Ayodhya. Soon after, she chose to follow her young husband into the forest, when he was banished for fourteen years by his stepmother. Ravana kidnapped her during this forest sojourn. A bloody war followed across the sea and she returned to Ayodhya with Rama for his coronation.

Alas, because of the suspicions of his subjects about her purity, Ram banished the pregnant Sita once again to the forests on the banks of the Ganga. Here, she lived in the Ashram of Sage Valmiki, the author of the Ramayana, where she bore her twin sons Luv and Kush.

When she was finally re-united with Ram, she chose rather to return to her mother, the earth, than go back with her husband as his empress. In this last defiant gesture, she showed her inner strength and rejected the continued injustice she had suffered all her life. Yet, Indian men are quick to say that she asked for all the suffering she was subjected to because she did not stay within the Lakshman Rekha drawn for her protection by Lakshmana, her devoted brother-in-law.

She, they say, was punished by fate for overstepping the authority of the men who were her familial lords. Today’s women are similarly expected to observe the unseen but clearly delineated Line of Control drawn for them by the men in her life. Her career, her social activities and her behaviour must be governed by strong male-designated social and familial rules. If she disobeys these rules, trauma and abandonment become her certain fate.

2 Draupadi was the copper-toned beauty born of fire. Fiery, gorgeous and strong-willed, Draupadi was born out of her father’s prayer for revenge against his enemies. She personified this quality throughout her life.

Her burning passion for revenge against the Kauravas, who disrobed her in a full assembly in the presence of her five husbands, caused the epic war between the Kauravas and the Pandavas in Kurukshetra. Draupadi’s oath that she would tie her long tresses only with bloodstained hands is symbolic of her personality. Her anguish at being disrobed and humiliated in the Kaurava court led to her curse that a country where women are reduced to such ignominy, would never prosper.

Even today, many Indians believe that women’s anguish and their cries against monumental injustice have left India with centuries of suffering, slavery and bloody conflicts. Draupadi’s anguish and anger are a commonly used theme in many dance ballets, music renditions and poetic compositions in all Indian languages. Famous research scholars like Dr. Ananda Coomaraswamy and Dr. Irawati Karve, who believe that gentleness and vengeful anger are just two sides of Indian womanhood, have juxtaposed her character with that of Sita.

Here too, orthodox Indians and researchers believe that Draupadi asked for the humiliation piled upon her because she not only rejected Duryodhana as a suitor but ridiculed him by calling him “the blind son of a blind father”. Most Indian women would agree that like this passionate heroine of the Mahabharat, millions of women are publicly humiliated and even raped as a punishment for challenging the male will or for ‘talking back’ at a man. Many men are known to use violence against wives merely because they ‘back-answer’ them!

3 Mandodari, the wife of Ravana, is associated with the element of water, turbulent on the surface yet deep and silent in her spiritual quest. The beautiful Mandodari tolerated the misdeeds of Ravana till his death. Ravana, it is said, abused numerous women and kidnapped Vedavati, daughter of a sage, whom he wooed with vigour till she, in disgust killed herself, saying that she would be reborn as Sita, who would be the cause of his annihilation. Mandodari was a woman of character, virtue and relentless faith and tried her best to make Ravana mend his ways, though she was unsuccessful in the end. Mandodari’s fate is shared by millions of women today. A staunchly male-oriented society overlooks the affairs and illicit liaisons of a husband and expects the wife to love and honour him despite his misdemeanors.
Read More

‘శరన్నవరాత్రులు’‘శరన్నవరాత్రులు’
శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

నవదుర్గలు :
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

2. బ్రహ్మచారిణి ( గాయత్రి ) : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

3. చంద్రఘంట ( అన్నపూర్ణ ) : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

4. కూష్మాండ ( కామాక్షి ): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

5. స్కందమాత ( లలిత ): అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

6. కాత్యాయని (లక్ష్మి): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.
శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

7. కాళరాత్రి ( సరస్వతి ): దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

8. మహాగౌరి ( దుర్గ ) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
Read More

బతుకమ్మ పండుగ ప్రారంభం (పెత్రమవస్య)బతుకమ్మ పండుగ ప్రారంభం (పెత్రమవస్య)
బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య రోజు ‘పెత్రమవస్య’ గా లేక ‘ఎంగిలిపూవు బతుకమ్మ’గా పిలుచుకుంటూ ఆనాటి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకలు కొనసాగిస్తం. ‘మహర్నవమి’ గా నవమిరోజు ‘సద్దుల పండుగ’ పేరుతో తిరిగి పెద్ద ఎత్తున ‘బతుకమ్మ’ పేర్చుకొని వైభవంగా పండుగను జరుపుకుంటం. తీరుతీరు పూలతో, తీరైన వంటలతో తల్లిని కొలుస్తూ పాడే పాటలు, తమ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో కూడిన పాటలు ఇలా బతుకమ్మ పండుగకు పాడుకునే పాటలు ఎన్నో.
అంతేకాదు, పండుగ ప్రారంభం నుండి తొమ్మిదవ రోజు వరకే గాకుండా, బతుకమ్మను సాగనంపే వరకు ఎన్నో సన్నివేశాలు. ఆ సన్నివేశాలకు తగిన పాటలు, ఆటలు నిజంగా చూసే కన్నులకు, వినే చెవులకూ ఆనందమే.

పెత్రమావాస్య రోజు జరుపుకునే పండుగను ‘ఎంగిలిపూవు బతుకమ్మ’ గా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పిలుస్తం. ఈ పండుగకు ఒకరోజు ముందు నుండే పూలను సేకరించి నీళ్ళలో వేస్తం. అయితే, ఎంగిలిపూవు బతుకమ్మ లేక పెత్రమావాస్య రోజు తమ పెద్దలకు నైవేద్యాలు సమర్పిస్తం. పెత్రమావాస్య రోజు పెద్దవిగా బతుకమ్మలను పేర్చి, సంబరం చేసుకుంటూ ఆనాటి నుండి ఆ తొమ్మిది రోజులు, దుర్గా నవరావూతుల్లో ప్రతిరోజు బతుకమ్మలను పేరుస్తం. ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడటంతోపాటు ఆట అనంతరం స్త్రీలు రకరకాల వాయినాలను ఇచ్చుకుంటుంటరు.
మొదటి రోజు వక్కలు, తులసి ఆకులు, సత్తుపిండి మొదలైనవి. రెండవ రోజు పప్పు, బెల్లం ప్రసాదంగా, మూడవ రోజు బెల్లం వేసి ఉడికించిన శనిగపప్పు, నాలుగో రోజు నానిన బియ్యం (బెల్లం కలిపిన పాలలో నానబెట్టిన బియ్యం), ఐదవ రోజు అట్లు పోసి ప్రసాదంగా పంచుకుంటాం. ఆరవ రోజు బతుకమ్మ పేర్చము, ఆడము. ఆ రోజు బతుకమ్మ అలిగిందనే విశ్వాసం ఒకటుంది.

ఏడవ రోజు పప్పు బెల్లం, ఎనిమిదవ రోజు నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా తయారు చేసి పంచుకుంటం. గతంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలను పేర్చడం, వాయినాలు ఇచ్చుకోవడం జరిగేది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలు పేరుస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో పెత్రమావాస్య రోజు, సద్దుల బతుకమ్మ నాడు రెండు రోజులు మాత్రమే ఘనంగా జరుపుకోవడం, మధ్య రోజుల్లో బతుకమ్మ ఆడటం చూస్తున్నం.
తొమ్మిదవ రోజు నాటి బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటం. పండుగ ఉత్సాహం ఈ రోజు అధికంగా కనిపిస్తుంది. దసరా పండుగకు ముందురోజు బతుకమ్మ పండుగ. ఈ రెండు రోజులు సంతోషంగా గడపడం కోసం పల్లెను చేరే వాళ్ళతో, ఊర్లన్నీ సంబరంగా ఉంటయి. అంతేకాదు, ఎక్కువ పూలతో ఈనాటి బతుకమ్మలను చాలా పెద్దవిగా చేసి, ఐదు రకాల సద్దులు కలిపి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటం.

బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరునుబట్టి ప్రజలు తనను ఆరాధించడానికే శక్తి ఆ రూపాన్ని కోరిందా అనిపిస్తుంది. శ్రీ చక్రోపాసనం సర్వోత్కృష్టమైన శక్త్యారాధన విధానాల్లో ఒకటి. బతుకమ్మను పేర్చేటప్పుడు కమలం షట్చక్షికం/అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం మొదపూడతారు. శ్రీ చక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటది. శ్రీ చక్రంలోని కుండలినీ యోగ విశేషశక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలుపడం జరుగుతది. ఇక్కడి స్త్రీలు గౌరమ్మను, లక్ష్మి, సరస్వతిగా భావించి పూజిస్తరు. పాటలను పాడుతుంటరు. ఎన్నో పాటలు ఉన్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నపాట ‘శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ...’
‘శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతి సతివయ్యి
బ్రహ్మ కిల్లాలివై
పార్వతిదేవివై
పరమేశురాణివై
భార్యవైతివి హరునకు గౌరమ్మా...
అలా బతుకమ్మ ఆటలో పాడుకునే మరో గౌరిపాట...
శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో
చేయబూనితివమ్మా ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
కైలాసవాసి ఉయ్యాలో
శంకరీ పార్వతి ఉయ్యాలో
శంభూని రాణి ఉయ్యాలో
తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో
ధ్యానింతునమ్మ ఉయ్యాలో....
-అంటూ రకరకాల పూలతో, పసుపు కుంకుమలతో, నైవేద్యాలతో పూజిస్తామని తెలుపుతూ, జయము శుభము కల్గించమని వేడుకుంటరు.
బతుకమ్మ పండుగ రోజు సాయంకాలం, గ్రామంలోని గుడి ముందరగాని, ఎప్పుడు అందరూ కలిసి జరుపుకునే ఏదేని మైదానానికి చేరుకొని బతుకమ్మ ఆటను ఆడుతరు. బతుకమ్మను పెట్టి ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండిచెట్టు గాని పెట్టి, గౌరమ్మను నిల్పి పూజ చేసి ఆట మొదపూడతరు. స్త్రీలు వలయాకారంగా నిలబడి కుడివైపుకు జరుగుతూ, చప్పట్లు చరుస్తూ, వంగి లేస్తూ, ఒక స్త్రీ పాట చెబుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ పాడుతుంటరు.

ఇలా సాగే బతుకమ్మ ఆట పాటను గమనిస్తే ఈ పండుగ ప్రయోజనమేమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాలవారు కలిసి ఆడటంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతయి. భారతదేశ ఔన్యత్యాన్ని, తెలంగాణ ప్రశస్థిని తెలిపే ఈ సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతోంది. స్త్రీల సమైక్యత, వారిలోని కళాత్మకత ఈ సందర్భంగా చక్కగా వెల్లడవుతుంది.
కుటుంబం, అనుబంధం, చారివూతక నేపథ్యం, పౌరాణికతలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా ఆ సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతం.
బతుకమ్మ ఆట తరువాత స్త్రీలు కోలాటాలు వేస్తరు. ఈ కోలాటాలను కొన్ని చోట్ల కర్రలతో, మరికొన్ని చోట్ల ఇత్తడి, వెండి కోలలతో, మరికొన్ని ప్రాంతాలలో చేతులతో వేస్తూ ఆనందిస్తరు. ఈ కోలాటం పాటలు రసరమ్యంగా, ఆనందంగా, వినోదాత్మకంగా ఉంటయి.
‘చేమంతి వనములో భామలు, చెలియకుంటలోన భామలు, చెలియకుంటలోన భామలు వోలలాడినారు...’
అంటూ గొల్లభామలు - కృష్ణుని పాటలు,
‘రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయల వాడోయమ్మ’ అనే శివ మహత్యం తెలిపే పాటలు,
‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన....’ అంటూ సాగే పాటపూన్నో పాడుకుంటరు.

అదే విధంగా గౌరిపూజ చేసి, గౌరమ్మ కళ్యాణం (పసుపు ముద్ద గౌరమ్మ) చేసి, గౌరిని అంటే బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడుకుంటరు. ఈ పండుగ వేళ చేసే ప్రతీ పని ఆట, పాట అన్నీ మానవ జీవితంలోని సన్నివేశాలను ముఖ్యంగా స్త్రీలు కోరుకునే పేరంటం, సౌభాగ్యాలను చిత్రిస్తయి.
వినవంతూ నింట్లో పుట్టి హిమవంతూ నింట్లో పెరిగి...’ అంటూ సాగే పాటలు స్త్రీల ఉద్దేశ్యాలను తేటతెల్లం చేస్త్తయి.
Read More

మహాలయ అమావాస్య (పెత్రమావాస్య)

మహాలయ అమావాస్య (పెత్రమావాస్య)
మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’ నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది.
శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.
మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.
‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.
Read More

బ్రహ్మచారిణి – నవదుర్గలుబ్రహ్మచారిణి – నవదుర్గలు
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.


హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.
Read More

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ – నవదుర్గలుదుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ – నవదుర్గలు
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.


పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.

సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.

తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.

సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.

‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.
Read More

దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’( అన్నపూర్ణ )దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’( అన్నపూర్ణ )
శ్లో|| పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా । ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.


నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
లేత రంగు, నైవేద్యం : కొబ్బరి అన్నము
Read More

దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’( లలిత )దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’( లలిత )
శ్లో|| సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా । శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.


ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’ గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.

నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.

స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.

కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.
కనకంబరం రంగు, నైవేద్యం : పెరుగు అన్నం
Read More

Powered By Blogger | Template Created By Lord HTML