గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానంలో జ్యోతిష్కులు ఎంతో మంది ఉండేవారు. వారిలో సుప్రసిద్ధుడు ???

విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానంలో జ్యోతిష్కులు ఎంతో మంది ఉండేవారు. వారిలో సుప్రసిద్ధుడు, మహా మేధావి అత్యంత సునిశితంగా పరిశీలించే శక్తి సంపన్నశాలిగా ఉంటూ, చక్రవర్తి చేతనే కాకుండా సాధారణ ప్రజల యొక్క మెచ్చుకోలు కూడా పొందిన వ్యక్తి మిహిర సిద్ధాంతి. మహారాజుకు ఓ కుమారుడు ఉన్నాడు. ఈ యువరాజు జాతక చక్రాన్ని మిహిరుడు వేసి ఫలితవిశ్లేషణ చేశాడు. అలాగే మిగిలిన జ్యోతిష పండితులు కూడా వారి వారి అభిప్రాయాలను చక్రవర్తుల వారికి తెలియచేశారు. యువరాజుకు 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయస్సు లోపల ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో రాకుమారుడు మరణించవచ్చునని కూడా కొంతమంది పండితులు భావించారు. ఈ రాకుమారుని మరణ కారణాలపై జ్యోతిష్యులలో ఏకాభిప్రాయం కొరవడింది. వివిధ రకములైన కారణాలచే మరణం ఉండవచ్చునని చెబుతున్నారే కానీ స్పష్టంగా విషయాన్ని తేటతెల్లం చేయలేకపోయారు. కానీ సూర్య అనుగ్రహం, వాక్శుద్ధి కల్గిన మేధావి మిహిరుడు మాత్రం... రాకుమారుని మరణం ఓ ముళ్ళు కలిగిన పంది (వరాహము) ద్వారా ఉంటుందని, ఆ మరణము తన 18వ సంవత్సరములో నిర్దిష్టమైన రోజును, సమయాన్ని స్పష్టం చేశారు. సాయంత్రం గోధూళి సమయంలో రాకుమారుని మరణం ఉంటుందని మిహిరుని విశ్లేషణ.
పైగా ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవటానికి చేసే నివారణ ఉపాయలన్నీ ఫలితాలను ఇవ్వవని ఆ విషాదకర ప్రమాదాన్ని తప్పించజాలమని.... "అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్" అంటే ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ, వివిధములైన శాంతి క్రియలు చేసిననూ ఫలితం ఉండదని మిహిరుడు విక్రమాదిత్య చక్రవర్తికి మిహిరుడు తెలియచేశారు.
సంవత్సరాలు గడిచాయి. రాకుమారుడు ఆరోగ్య రీత్యా పదిలంగానే ఉంటున్నాడు. మిహిరుడు తెల్పిన నిర్దేశిత సమయానికి.... కొన్ని నెలల ముందు నుంచి అంతఃపుర పరిసర ప్రాంతాలన్నీ సంపూర్ణ భద్రతతో ఉన్నది. ఇంతకు ముందు చెప్పిన జాతక ఫలాన్ని మరో పర్యాయం పరిశీలించమని మిహిరునికి చెప్పటమే కాక.... ఆ జాతక ఫలం నిజమైతే తాను మిహిరునకు "వరాహ" అనే బిరుదు ప్రదానం చేస్తానని ఇది శాస్త్రానికి తగిన గౌరవాన్ని ఆపాదించగలదని చక్రవర్తి తెలియచేశాడు.
మిహిరుడు చెప్పిన ప్రతిపాదిత రోజు రానే వచ్చింది. ఆనాటి ఉదయం నుంచి రాజు గారు కొలువు తీరారు. అంతఃపురం చుట్టూ జన సందోహం ఎదురు చూస్తున్నది. అప్రమత్తులైన యోధానుయోధుల పహరాలో రాకుమారుడి సౌధం ఉన్నది. ముళ్ళపంది చొరబడే అవకాశమే లేనే లేదు. ముఖ్య మార్గాలన్నీ రక్షక భటుల ఆధీనంలో ఉండిపోయాయి. జంతువులు కాని, ఇతరులు కాని ప్రవేశించే అవకాశం లేకుండా, 7వ అంతస్థులో రాకుమారుడు తన సహచరులతో ఆటలాడుతున్నాడు. తప్పులు జరగటానికి అవకాశం లేదని, జాతక ఫలితం నిస్సందేహమైనదని గత జన్మలోని దుష్కర్మ ప్రారబ్ధం.... ఈ జన్మలో శిక్షను విధిస్తున్నాయని, కనుక కొన్ని సందర్భాలలో ప్రారబ్ధాన్ని ఏదో రూపంగా తప్పించటానికి సాధ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ కూడా..... జరగబోయే సంఘటనకు కూడా అనుభవించేలా సిద్ధంగా ఉండాలని... ఈ జాతక చక్రంలో అంతర్లీన దోషాలున్నందునే ఇది తటస్థించనున్నదని... తాను సూర్యోపాసన ద్వారా జాతక ఫలితాన్ని నిర్ణయించినట్ట్లుగా మిహిరుడు తెలియచేశాడు.
అనుక్షణం రాకుమారుని విషయాలను ఎప్పటికప్పుడు క్రిందనున్న చక్రవర్తుల వారికి తెలియచేసే విధంగా సేవకులను ఏర్పాటు చేశారు. ఇంతలో హఠాత్తుగా ఓ సేవకుడు పరుగున వచ్చి.... బాధతో బహుశా కాపలాదారుడు, సహచర మిత్రులు గమనించి గమనించి ఉండకపోవచ్చునేమో గాని, రాకుమారుడు రక్తం మడుగులో పడి చనిపోయాడని, మిహిరుడు చెప్పిన సమయానికే మరణం సంభవించిందని రాజుగారికి తెలియచేశారు. వెంటనే మహారాజు ఇతరులతో కలిసి 7వ అంతస్తుకు చేరుకున్నారు. రాకుమారుని మిత్రులు మాత్రం తాము ఆడే క్రీడలో మునిగి తేలుతూ రాజుగారి రాకను గమనించలేదు. మహారాజు వారిని విచారించగా కొద్ది సేపటి క్రితమే వరండాలోనికి వెళ్ళాడని తెలిపారు. అందరూ హడావిడిగా వరండాలోకి వెళ్లారు. భయంకర దృశ్యం... నెత్తుటి మడుగులో పడివున్న రాకుమారుడి దేహంపై ఇనుముతో చేసిన ముళ్ళపంది బొమ్మ పడి ఉంది. రాకుమారుని కర్మానుసారంగా గ్రహ స్థితులను బట్టి భగవత్ సంకల్ప మాత్రమై ఇలా జరిగింది. ఆ రాజ్యంలో స్థూపాలపై రాజ చిహ్నంగా వాడబడే కృత్రిమంగా చేసిన ఇనుప ముళ్ళ పంది బొమ్మను ఫిరంగిని ఎత్తైన ప్రదేశంలో బిగించారు. ఈ కృత్రిమ ముళ్ళ పందే మరణానికి కారణమవుతుందేమో అన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ఈ బొమ్మ రెండు కర్రలను నిలబెట్టి దానిపై ఉంచారు. చల్లగాలికై వరండాలోకి వచ్చిన రాకుమారుడు బహుశా ధ్వజపు కర్రను చేతితో కదిలించి ఉండవచ్చును. దానిపై ఉన్న పెద్ద అడవి పంది బొమ్మ క్రిందకి పడి పోవటము, అది రాకుమారుని ఉదార భాగంపై పడటం, రక్తస్రావం ఏర్పడటము వెంటనే రాకుమారుడు చనిపోవటము జరిగి ఉండవచ్చును. మిహిరుని యొక్క జాతక ఫల విశ్లేషణ నిజం కావటంచే విక్రమార్క చక్రవర్తి ఆయన ఇచ్చిన మాట మేరకు మిహిరునికి వరాహ బిరుదు ప్రదానం చేశారు. ఆ మిహిరుడే ప్రఖ్యాత ఖగోళ జ్యోతిష శాస్త్రజ్ఞుడు మరియు విశిష్ట గ్రంధాలైన పంచసిద్ధాంతిక, బృహత్ సంహిత మొదలగు అసంఖ్యాక గ్రంధకర్త అయిన వరాహమిహిరుడే.
కనుక ఋషులచే పరిష్కార మార్గాలుగా కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్న జన్మ జ్యోతిష్యం అత్యంత నమ్మదగిన శాస్త్రం. ప్రారబ్ధం ప్రకారం ప్రతీది జరిగి తీరవలసినదే. అందుచేత జన్మ జాతకాలలో దృష్టముగాఉన్న (కనిపించే) గ్రహస్థితులు కాకుండా అదృష్టంగా (కనపడకుండా అంతర్లీనంగా ఉండే) గ్రహస్థితుల వలన ఫలితాలు జాతకులకు ఒక్కోసారి హఠాత్తుగా విజయావకాశాలు ఇస్తుంటాయి లేదా సమస్యాత్మకంగా ఉంటుంటాయి!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML