ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 29 October 2015

సకల పాప హరణం.. కాశీ పుణ్యక్షేత్ర దర్శనం

సకల పాప హరణం.. కాశీ పుణ్యక్షేత్ర దర్శనం
ద్వాదశ జ్యోతిర్లింగాలులోని  7వది కాశీనగరంలో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. కులమతాలకు అతీతంగా ఎంతోమంది వారణాసిని సందర్శించి గంగానదిలో స్నానం చేసినట్లైతే మోక్షాన్ని పొందుతారని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి.
 జీవితంలో ఒకసారి అయినా కాశీని సందర్శించడమే జీవిత పరమార్ధంగా హిందువులు భావిస్తారు.
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింది.
పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి.
విశ్వనాథ దేవాలయం మంటపం మరియు గర్భగుడితో అలరారుతోంది. గర్భగుడిలో పూజలందుకునే శివస్వరూపం 60 సెం.మీల పొడవు.. మరియు 90 సెం.మీ చుట్టుకొలతతో వెండి తాపడాన్ని కలిగి ఉంటుంది. శివలింగం నల్లరాతితో నిర్మితమైంది.
ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయంగా ఈ ఆలయానికి పేరుంది. ఈ ఆలయ ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి ఇండోర్ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించారు.
దేవాలయ ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తైన కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్ మహారాజు రంజిత్ సింగ్ 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పబడింది.
విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం ఉంది. కాశీలో
ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.
కాశీపట్టన పుణ్యక్షేత్రంలో సాయంత్ర సమయంలో గంగానది దగ్గర గంగమ్మ తల్లికి ఇచ్చే శేష హారతి (గంగా హారతి )


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML