గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 October 2015

రామచ్ఛాయ భాషరామచ్ఛాయ భాష

ఇది ఒక సాంకేతిక భాష. ఇతరులు ఎవరికీ తెలియని భాష. వైష్ణవ గృహాలలో భోజనాల ముందు మాట్లాడుకునేవారట. ఎక్కడ నుంచి ఆవిర్భవించిందో, ఎలా అంతరించిపోతోందో ఎవరికీ అంతుపట్టని విషయం.

సాధారణంగా కొన్ని పారిభాషిక పదాలతో కూడిన సాంకేతిక విద్య కొన్ని ప్రాంతలలో, కొన్ని వృత్తులలో ఎదుటివారికి తెలియకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. సాంకేతిక భాషల్ని, యుద్ధాలలో శత్రువులకు తెలియని విధంగా ఒక కోడ్ తో మెసేజెస్ పంపుతారు. అది అవతల తెలిసినవారు సాంకేతిక విజ్ఞానంతో డీకోడ్ చేసుకుని అర్ధం చేసుకుంటారు. పూర్వం బాలశిక్షలో వ్యాపారస్థులు ఎంత డబ్బు అనే విషయానికి ఒక కోడ్ ఉండటం చదివాను. విన్నాను. ఇప్పుడు మనం తెలుసుకొనబోయేది "రామచ్ఛాయ భాష" దీనిలో "రామ" శబ్దం ఉన్నది గనుక దీనికి కొంత పవిత్రత ఏదో మనకు తెలియనిది ఉండి ఉంటుందని భావించి శ్రమ తీసుకుంటున్నాను. ఆశ్చర్యమేమిటంటే మన పూర్వీకులు అచ్చులు, హల్లులు, గుణింతాలు అన్నీ కలిపిన భాష ఒకే ఒక శ్లోకంలో ఇమిడ్చారు. ఆ శ్లోకం ఇది. దీనిని బాగా కంఠస్థం చేసి అక్షరాలు గుర్తించుకొనవలసిన అవసరం ఉంది.


" రామచ్ఛాయ అజానాగా టళందప దశహనా

షడబాల సకావక్షో ఇచ్చైతి రామభద్రకం "

ఈ పై శ్లోకం లోని అక్షరాలు బాగా గుర్తుండాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. పూర్వం వైష్ణవ సంప్రదాయ గృహాలలో భోజనాల ముందు వాడేవారని చెప్పాను గదా ! మా తాత ముత్తాతలు కూడా వైష్ణవ సంప్రదాయం కలవారు. సమాశ్రయణం పొందినవారు. మా తాతగారి ద్వారా నాకు ఈ భాష విషయం తెలిసింది.

ఉదాహరణకు "పప్పు" అనేది కావాలి. పై శ్లోకంలో "ప" అనే అక్షరం ఎక్కడ అని మెదడులో చకచకా శ్లోకం అటు ఇటు మొదలాలి. "టళందప దశహన" గుర్తుకు రావాలి. "ప" మనకు అవసరం. కాని సాంకేతికంగా "ప" అక్షరానికి ముందు "ద" అని తెలుసుకోవాలి. కాబట్టి "ప" కు బదులు "ద" వచ్చింది. "ప్పు" అనే అక్షరానికి అదే రకం ఒత్తు "ద్దు" వస్తుంది. మొత్తం కలిపితే "ద్దు" కదా ! ఇప్పుడు అంతా కలిపి చూస్తే "పప్పు" అనే పదం రామచ్చాయ భాషలో "దద్దు" అవుతుంది. ఈవిధంగా అనేక పదాలు అనేక దినాలు సాధన చేస్తే రామచ్చాయ భాషలో మాట్లాడటం అలవాటు అవుతుంది. మరి వినేవారు ఉంటేనే కదా భాష అవసరం. వినేవారికి ఈ సాంకేతికం అలవాడాలి.

విషయానికి వస్తే ఈ రామచ్చాయ భాష ఎందుకు ఉద్భవించింది?ఎలాగు ప్రచారం పొందింది? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఆ శ్లోకానికి ఏమైనా అర్ధం ఉన్నదా ? అనే ప్రశ్నలకు వివరాలు గానీ, సమాధానం గాని నా వద్ద ఏమీ లేవు. వయో వృద్ధులైన పండితులకు మాత్రమే తెలియవచ్చును. ఎవరైనాజెప్పితే ఈ క్లిష్ట విషయానికి సంపూర్ణత చేకూరుతుంది.

( ఈ వ్యాసం మచిలీపట్నం నుండి వెలువడే "అస్త్రం" అనే పత్రికలో గురుతుల్యులు మా మేనమామ శ్రీ రాపర్ల జనార్ధన రావు గారు 20 వ జూన్ 2006 న వ్రాశారు. )

నా పేరు అనిదమ్ర -- ఇఖ రామచ్చాయ భాషలో మీ పేరు చెప్పండి.

2 comments:

కీసర వంశము KEESARAVAMSAM said...
This comment has been removed by the author.
కీసర వంశము KEESARAVAMSAM said...

ఈ వ్యాసం అనుమతి లేకుండా ప్రచురించినందుకు ధన్యవాదములు. --జాజిశర్మ

Powered By Blogger | Template Created By Lord HTML