గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవ జ్యోతిర్లింగక్షేత్రం ‘కేదార్ నాథ్’.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవ జ్యోతిర్లింగక్షేత్రం ‘కేదార్ నాథ్’. ఉత్తర భారతదేశంలో నెలకొని ఉన్న గంగోత్రి .. యమునోత్రి .. కేదార్ నాథ్ ... బదరీ నాథ్ క్షేత్రాలను 'చార్ ధామ్'గా వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి వచ్చే యాత్రీకులు ఈ నాలుగింటిని దర్శించుకుని వెళుతుంటారు.

అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని .. దేవతులు, ఋషులు అదృశ్యరూపంలో అర్చిస్తూ ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 12,000 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయ శిఖరంపై కొలువుదీరి కనిపిస్తుంది.

ఇక్కడ గర్భాలయంలో శివలింగం 'త్రికోణం'ఆకారంలో కనిపిస్తూ వుంటుంది. పాండవులతో ముడిపడిన ఓ కథ ఇక్కడ ప్రచారంలో వుంది. ఈ కథ నిజమని భావించేలా ఈ పరిసర ప్రాంతాల్లో పాండవులకి సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తూ వుంటాయి. దాదాపు 22,000 అడుగుల ఎత్తుగల ఇక్కడి 'నీలకాంత శిఖరం'పై పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు.

కేదార్ నాథ్ పర్వత సానువులలో ఉద్భవించిన 'మందాకిని'నది ... 'బదరీ నాథ్’ లో ఉద్భవించిన 'అలకనంద' నదిలో కలుస్తుంది. ఇక్కడి 'గౌరీ కుండ్' మహా విశిష్టమైనదిగా చెబుతుంటారు. కేదార్ నాథ్ కి 'గౌరీ కుండ్'నుంచి బయలుదేరాలి.
భీముడు నిర్మించినట్టుగా చెబుతోన్న ఈ దేవాలయంలో ... ఆ తరువాత కాలంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు యంత్ర స్థాపన చేశారు. కష్టతరమైన ప్రయాణ మార్గం కావడంతో.. పూర్తి ఆరోగ్యవంతులు మాత్రమే ఈ ప్రాంత దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.

కేదారేశ్వరుడిని భక్తులు దర్శించి ... స్వయంగా అభిషేకించి ... శివలింగం పై భాగాన నెయ్యితో పూస్తూ ఆయనను స్పర్శించి పులకించిపోతారు. ఈ యాత్రలో తాము పడిన కష్టాలను మరిచిపోతారు. ఇక్కడి స్వామిని దర్శించినా ... స్పృశించినా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML