గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 October 2015

విజయదశమి పండుగ తర్వాత వచ్చే పండుగ అట్లతదియవిజయదశమి పండుగ తర్వాత వచ్చే పండుగ అట్లతదియ

ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఈ పండుగ ఆచరిస్తారు. ఈ పండుగ రోజు ముందురోజున స్త్రీలు తమ పాదాలకు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. తదియ నాడు అట్లు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు.

పూజా మందిరంలో ఓ పీటను వేసి, ఆ పీటకు పసుపు కుంకుమలు పెట్టి, ఆ పీటపై బియ్యం పోసి చదును చేయాలి. పసుపుతో గౌరమ్మను చేసి కుంకుమతో అలంకరించి తమలపాకుపై ఉంచి అలంకరించిన పీటపై గౌరమ్మను ఉంచాలి. చంద్రోదయం చూసి అప్పడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి.


గౌరీదేవే ఉమాదేవి. అందుకే పసుపు ముద్దతో గౌరీ దేవిని చేస్తారు. చంద్రోదయం చూసి ఉమాదేవిని పూజిస్తారు. కనుకనే "చంద్రోదయ ఉమావత్రం" అంటారు. అమ్మవారికి పది అట్లను నైవేద్యంగా పెట్టి ఒక ముత్తైదువకు పటి అట్లు వాయనం ఇచ్చి పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు.

పెళ్ళయిన స్త్రీలు చేస్తే కుటుంబం ధనధాన్యాలతో సంతాన వృద్ధి జరుగుతుంది. పెళ్ళికాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు. నవగ్రహాలలోని కుజుడు అనగా అంగారకునికి అట్లంటే ఇష్టం. అట్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడం వల్ల కుజదోషం పోయి సంసారంలో ఎలాంటి అడ్డంకులు రావు. స్త్రీలలో కుజుడు రజోదయమునకు కారకుడు కాబట్టి ఋతు సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుతాడు. అందువల్ల గర్భధారణ సమస్యలవంటివి ఉత్పన్నం కావు.

ఈ అట్ల తయారీలో మినుములు, బియ్యాన్ని ఉపయోగిస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి ఇష్టమైన ధాన్యాలు. ఈ ధాన్యాలలో తయారుచేయబడిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగిపోతాయి. గర్భస్రావాల వంటివి నివారించబడి సుఖప్రసవం జరుగుతుంది. అట్లతద్ది పండుగలోని రహస్యం ఇదే.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML