
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 October 2015
శ్రీ జరాపహరేశ్వర స్వామి ఆలయము
శ్రీ జరాపహరేశ్వర స్వామి ఆలయము
ఏలూరు దక్షిణపు వీధి, పోనంగి రోడ్డులో గల ఈ ఆలయాన్ని పెద్ద దేవుని గుడిగా కూడా పిలుస్తారు. చారిత్రక తేజస్సు, పురాణ యశస్సు గల ఈ ఆలయమును వేంగి రాజులు నిర్మింపజేశారు. 1928 మే 2వ తేదీన ఈ ఆలయమునకు జీర్ణోద్ధారణ చేసి, కూరగాయల వర్తక సంఘం వారు ఈ ఆలయాన్ని పునర్మించారు. వీరి ఆధ్వర్యంలో ఈ ఆలయములో అనేక కార్యక్రమాలు జరుపబడుచున్నాయి.
స్థల పురాణం : ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి, జరాసంధుడికి వైరం ఉండేది. జరాసంధుడు కృష్ణుని జయించలేక తన కోటను, రాజ్యాన్ని వదిలి దక్షిణ దేశానికి వచ్చి అప్పటి హేలాపురిలోని (ఇప్పుడు ఏలూరు) ఒక శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి అభయమిచ్చాడు. కృష్ణుని చేతిలో చావు లేకుండా వరం పొందాడు. జరాసంధుడి కోరిక మేరకు పహారా కాస్తూ లింగరూపంలో అక్కడ శ్రీ జరాపహరేశ్వర స్వామిగా వెలిసాడు.
ఎంతో అరుదైన మరియు విలక్షణలు ఉన్న ఈ ఆలయములో స్వామి వారికి ఎడమవైపున పార్వతి దేవి విగ్రహం ఉన్నది. ఈ ఆలయములో ఉన్న మరో ఆలయము మహిషాసుర మర్దిని ఆలయము. అమ్మవారిని ఆది శంకరాచార్యులు ప్రతిష్టించారని ప్రతీతి. కోదండ రామాలయం, వీరాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఎంతో అరుదైన చింతామణి గణపతి మొదలగు పలు ఉపాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలనుండి ఈ ఆలయములో పూజలు మొదలవుతాయి.
ఒకప్పుడు ఒక ఆంబోతు రంకెలు వేస్తూ, తీవ్ర ఆవేశంతో ఊరిలో భీభత్సం సృష్టించింది. అప్పుడు ఒక మునీశ్వరుడు ఆంబోతు క్రోధాన్ని అణచి, మంత్రించిన కడియాన్ని దాని కాలికి తొడిగారు. ఆ ఆంబోతు శిలా రూపమై జరపహరేశ్వర స్వామిని సేవిన్చుకుంటుందని, ఎప్పుడైనా మళ్లి మంత్రాలూ చదివి కడియాన్ని తొలగించితే అది మళ్లీ పునర్జీవితమవుతుందని స్థానికుల విశ్వాసం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment