
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 October 2015
"దీపావళి అమావాస్య ప్రాశస్త్యం- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు"
"దీపావళి అమావాస్య ప్రాశస్త్యం- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు"
దీపావళి అమావాస్యకు వేదాంతంలో ఒక పేరు వుంది. "ప్రేత అమవాస్య" అని పేరు. కారణం ఆరోజు పితృదేవతలందరూ వస్తారు ప్రదోషవేళకు. వచ్చి ఆకాశమార్గంలో నిలబడతారు. అందుకే ఆరోజు సాయంత్రం ముందు పూజ ఏమిటంటే 'దివిటీ' కొట్టడం. ఆడపిల్లలు కొట్టరు దివిటీ. ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు గోగుకర్రమీద జ్యోతులు వేసి దక్షిణదిక్కుగా చూపించాలి.
"నాన్నగారు ఈరోజు తిధిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. భగవదునుగ్రహాన్ని పొందుతాను. మీరు దయచేసి బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది, కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను" అని దివిటీ చూపిస్తాడు. జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే తిధి 'దీపావళి అమావాస్య'. ఆ తరువాత కాళ్ళుచేతులు కడుక్కుని వెళ్లి, ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని లేదు. అలక్ష్మిని తరిమికొట్టి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు.
దీపావళి అమావాస్యనాడు నువ్వులనూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నీటిలోకి గంగ ప్రవేశిస్తుంది. ఆ రోజు ఉదయం నువ్వులనూనె వంటికి రాసుకుని, తెల్లవారుఝామున స్నానం చేస్తారు, దేనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్ధం. ఇక గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది.
(బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనం "కార్తీకమాస వైభవం" పుస్తకం నుండి)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment