గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

భగవతుడిని భక్తి మార్గం లో ఆరాదించటానికి తొమ్మిది రకాలైన విధానాలు ఉన్నాయి

భగవతుడిని భక్తి మార్గం లో ఆరాదించటానికి తొమ్మిది రకాలైన విధానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ లేక కొన్ని పాటించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. ఏ విధంగా చేసినా మన పూజలు భగవంతునికి అందటం ముఖ్యం.
1)శ్రవణం – దేవుని గురించి వినుట
2)కీర్తనం – అన్నమయ్య వలె , త్యాగయ్య వలె దేవుని కీర్తిస్తూ పాడుట

3)దైవ స్మరణ – నారదుని వలె నిరంతరం భగవన్నామం స్మరించుట
4)పాద సేవ – గరుడుని వలె స్వామి సేవ చేయటం
5)అర్చన – ఆవాహనము , ఆసనం, అర్ఘ్యం, పాద్యము , స్నానము, వస్త్రము, అలంకారం, పూజ, ధూపం, దీపం, నైవేద్యము, నీరాజనం వంటి పద హారు చర్యలతో అర్చించటం.
6)వందనం- త్రికరణ (మనసు, వాక్కు , శరీరం) శుద్ది గా నమస్కరించటం .
7)దాస్యం – హనుమంతుని వలె దాస్యం చేయటం
8)సఖ్యం – గోపికల వలె అర్జునిని వలె దేవుని తమ సఖుని గా భావించి తనపై భారం వేయటం.
9)ఆత్మ నివేదనం – ఆత్మ (తనను తాను) భగవంతుని కి అర్పించి స్వామి సంకల్పం పై కర్మలు చేయటం!

ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.
“అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!
ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML