"పుండరీకవరదా ! గోవిందా గోవింద !
పుండరీకుడు గొప్ప భక్తుడే కాక, వేద, శాస్త్ర పారంగతుడూ, తపస్సంపన్నుడూ, స్వాధ్యాయపరుడూ, జితేంద్రియుడూ మరియు క్షమాగుణసంపన్నుడుగా కూడా పేరు పొందాడు. త్రికాల సంధ్యారాధకుడే గాక, ఉదయం, సాయంత్రం అగ్నిహోత్ర ఆరాధన కూడా చేసేవాడు. అంతేకాక, తల్లిదండ్రులను ఎంతో భక్తిశ్రద్ధలతో సేవించేవాడు.
ఇక విష్టు సంకీర్తనమైతే ఎల్లప్పుడు కీర్తించేవాడు. ఈయన ధర్మానికి మూలం భగవంతుడనే చెప్పేవాడు. "రామో విగ్రహవాన్ ధర్మః" అని శ్రీరామచంద్రుణ్ణి, "ఏషధర్మస్సనాతనః" అని శ్రీకృష్ణపరమాత్మను మన పెద్దలు అన్నది ఇందుకే కదా !! ఇంతటి మహాభక్తుడు గనుకనే, నామసంకీర్తనల్లో "పుండరీకవరదా ! గోవిందా గోవింద ! " అని అనడం మనం వింటూఉంటాము.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment