గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

పరమశివుడు అర్ధశరీరం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు!

శైలపుత్రి: మొదటి శక్తిస్వరూపం పేరు ‘శైలపుత్రి’. పర్వతరాజైన హిమవంతునికి మేనకకు జన్మించిన కుమార్తె ఈదేవి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి ఉంటుంది. పార్వతి, హైమవతి అనే పేర్లున్నాయి.
బ్రహ్మచారిణి: నవశక్తులలో రెండవ స్వరూపం పేరు ‘బ్రహ్మచారిణి’. అనగా తపమాచరించునది అని అర్థం. ఈ దేవి కుడిచేతిలో జపమాల- ఎడంచేతిలో కమండలం ధరించి ఉంటుంది. ఈ దేవి స్వరూపం జ్యోతిర్మయం. శుభంకరం. నారదుని ఉపదేశానుసారం ఘోరమైన తపస్సు చేసి విజయం సాధించింది. ఈమెకు ‘ఉమా’ ‘అపర్ణ’ అనే పేర్లున్నాయి.
చంద్రఘంట: మూడవ శక్తి స్వరూపం పేరు ‘చంద్రఘంట’. ఈమె తలమీద ధరించిన చంద్రవంక ఘంటాకృతిలో ఉండడంవల్ల ఈమెను చంద్రఘంట అంటారు. ఈ దేవి పదిచేతులలో వివిధ శస్తమ్రులు అస్తమ్రులు ధరించి సింహవాహనం మీద కూర్చుని సర్వదా సమరసన్నాహయై యుద్ధ ముద్రలో వుంటుంది.
కూష్మాండ: నాల్గవ శక్తిస్వరూపం ‘కూష్మాండ’. ఈ దేవి బ్రహ్మాండమును అందలి సమస్త జీవరాసులను సృష్టి చేయడంవల్ల ఈమెకు కూష్మాండ అనే పేరు వచ్చింది. ఈమె అష్ట్భుజాదేవి. కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృతకలశం, గద, చక్రం, జపమాల చేతులలో ధరించి సింహంమీద కూర్చుని ఉంటుంది.
స్కందమాత: ఐదవ శక్తి స్వరూపం ‘స్కందమాత’. కుమారస్వామి తల్లి. ఈదేవి ఒడిలో బాలస్కందుడు కూర్చుని ఉంటాడు. ఈ దేవి చతుర్భుజ. పద్మం ధరించి కమలాసనయై ఉంటుంది. ఈమె వాహనం సింహం.
కాత్యాయని: ఆరవ శక్తి స్వరూపం కాత్యాయని. మహిషాసురుని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమతమ తేజస్సుతో ఒక స్ర్తిమూర్తిని సృష్టించారు. ఆమెకు దేవతలందరూ తమ శక్తితోపాటు ఆయుధాలను ఇచ్చారు. ఆమెయే కాత్యాయని.
కాళరాత్రి: ఏడవ శక్తిస్వరూపం ‘కాళరాత్రి’. తలమీద జుట్టు చెల్లాచెదురై ఉంటుంది. ఈమె త్రినేత్రాలనుండీ విద్యుత్కాంతులు ప్రసరిస్తుంటాయి. నాసికా రంధ్రాల నుండీ అగ్నిజ్వాలలు వెడలగ్రక్క బడుతుంటాయి. ఈ దేవి చతుర్భుజాలలో కుడిప్రక్క చేతులు వరముద్ర, అభయముద్ర, ఎడమ చేతుల్లో ఇనుప ముండ్లగద, ఖడ్గము ధరించి ఉంటుంది. ఈమెను ‘శుభంకరి’ అని అంటారు.
మహాగౌరి: ఎనిమిదవ శక్తి స్వరూపం మహాగౌరి. ఈ దేవి శరీరం గౌరవర్ణం. ఈమె అష్టవర్ష ప్రాయం గలది. చతుర్భుజ. కుడి చేతులలో అభయముద్ర, త్రిశూలం, ఎడమ చేతులలో ఢమరకం, వరముద్ర కలిగి వుంటుంది. ఈ దేవి వాహనం వృషభం.
సిద్ధిదాత్రి: తొమ్మిదవ శక్తి స్వరూపం సిద్ధిదాత్రి. ఈ దేవి చతుర్భుజ. కుడిచేతిలో చక్రం, గద, ఎడమ చేతుల్లో శంఖం, కమలం ధరించి సింహంమీద కూర్చుని ఉంటుంది. ఈ దేవికి పరమశివుడు అర్ధశరీరం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు!
ఇట్లు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML