గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు "దేవీనవరాత్రులు" అంటారు

ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు "దేవీనవరాత్రులు" అంటారు .అశ్వని నక్షత్రం పూర్ణిమనాడు వస్తే ఆశ్వయుజ మాసమవుతుంది. దేవీ ఉపాసకులు కుండలినీ శక్తితో సాధన చేసినవారు తొమ్మిది రొజులూ అమ్మవారిని తొమ్మిది విధాలుగా భావించి అర్చిస్తారు.10వ రోజున ‘దశ’ అవస్థలో విజయాన్ని పొందుతున్నారు.కాబట్టి నవరాత్రి వ్రతానికి విజయదశమి ముగింపుగా చెప్పారు .బాలా త్రిపుర సుందరి మహాలక్ష్మి,గాయత్రి,అన్నపూర్ణ,సరస్వతి,శ్రీ లలితా త్రిపురసుందరి,దుర్గ,మహిశాసురమర్దిని రాజరాజేశ్వరి,అనే పేర్లతో విభిన్నమైన అలంకారంతో పుజిస్తారు.కొంతమంది కుమారి పూజ వివిధ వయస్సులలో ఉన్న చిన్న పిల్లలు 10 సం||లు లోపు ఉన్న వారిని కుమారి త్రిమూర్తి కళ్యాణి,రోహిణి కాళిక,చండిక శాంభవి ,దుర్గ సుభద్ర వగైరా పేర్లతో పుజిస్తారు .
భాద్రపదంలో నిర్విఘ్న కార్యసిద్దికి వినాయకుని పూజించి ఆశ్వయుజ మాసంలో ఆదిశక్తి-జగజ్జనని అయినఅమ్మవారిని వివిధ రూపాలలో అర్చించి విజయాన్ని పొందించేది కాబట్టి విజయదశమి.అర్జునుడు ఈ రోజునే ఉత్తర గోగ్రహనంలో విజయం పొందాడని –విజయదశమి నాడు శ్రీ రాముడు రావణుని సంహరించడాని అంటారు.

బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు : 13-10-2015 
వారం : మంగళవారం
తిధి : ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి 
 అలంకారం : శ్రీ స్వర్ణ కవచాలంకృత   దుర్గా దేవి 

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.

రెండవ రోజు: 14-10-2015
 వారం: బుధవారం
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మిగిలు  
 అలంకారం : శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 
ఇష్టమైన రంగు : నీలి రంగు 

శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము.

మనస్సు,బుద్ధి,చిత్తం.అహంకారం,త్రిపురసుందరిదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి .అభయహస్త ముద్రతో ఉన్న ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి.
"ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః"  అనే మంత్రాన్ని 
108 మార్లు జపించాలి.

నైవేద్యం : ఉప్పు పొంగల్ 

మూడవ రోజు:15-10 -2015 
 వారం :గురువారం
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ విదియ 
 అలంకారం : శ్రీ గాయత్రీ దేవి 
ఇష్టమైన రంగు: పసుపు రంగు 


శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.
సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు.

నైవేద్యం :రవ్వకేసరి ,పులిహోర అమ్మవారికి సమర్పించాలి .


నాల్గవ రోజు: 16-10-2015 
 వారం :శుక్రవారం 
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ తదియ  
 అలంకారం : శ్రీ మహాలక్ష్మీ దేవి
ఇష్టమైన రంగు : తెలుగు రంగు   


కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే శ్రీ మహాలక్ష్మిఅమ్మవారు .

నైవేద్యం: అమ్మవారికి రవ్వ కేసరి ,తీపి బూంది  నివేదించాలి


ఐదవ రోజు:17 -10 -2015 
 వారం :శనివారం
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ చవితి  
 అలంకారం: శ్రీ అన్నపూర్ణ దేవి  
ఇష్టమైన రంగు : లేత రంగు 


దసరా ఉత్సవాలలో 5 వరోజు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు తో చేసిన అన్నంను శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము.
అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము. 

నైవేద్యం: ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం ఎంతో ప్రీతి కరమైనది 

ఆరవ రోజు: 18-10-2015 
 వారం : ఆదివారం  
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ పంచమి 
 అలంకారం: శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
ఇష్టమైన రంగు : ఆకాశం రంగు 


దసరా నవరాత్రులలో 6 వ రోజు అమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.
త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు . ఈ అమ్మవారిని లలితా అష్టోత్తరంతో పూజించి “ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రేనమః అనే మంత్రాన్ని జపించాలి అలా చేసినచో స్రీలకు మాంగల్య దోషాలు తొలగి పోతాయి.

నైవేద్యం: అల్లం గారెలు చింతపండు పులిహోర ,పెసర బూరెలు,మరియు పంచమి కాబట్టి అరటిపండ్లు అమ్మవారికి సమర్పించాలి .శ్రీ లలిత త్రిపురసుందరి అమ్మవారికి పంచమి వచ్చినచో అరటిపండ్లు అత్యంత ముఖ్యమైన నైవేద్యం.


ఏడవ రోజు: 19-10-2015
 వారం : సోమవారం 
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ షష్టి
 అలంకారం :శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలా నక్షత్రం)
ఇష్టమైన రంగు: కనకాంబరం రంగు 


శరన్నవరాత్రులో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది .చదువుల తల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే అతి పవిత్రమైన రోజు .
బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతి దేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి.

శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి,వీణ,దండ,కమండలం,అక్షరమాల ధరించి,అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది .

వ్యాసుడు,వాల్మికి,కాళిదాసు,మొదలైన లోకోతర చరిత్రులకు ఈమె వాగ్వైభావాన్ని వరంగా ఇచ్చింది.ఈమెను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం జరుగుతుంది.త్రిశక్తి స్వరుపాల్లో ఈమె మూడో శక్తి స్వరూపం .సంగీత,సాహిత్యాలకు అధిష్టాన దేవత.సకల జీవుల జిహ్వాన్గ్రంఫై ఈమె నివాసం ఉంటుంది. 

నైవేద్యం: శ్రీ సరస్వతి దేవి అలంకారం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటేసరస్వతి దేవికి పచ్చిశనగపప్పు,బెల్లంతో చేసిన బొబ్బట్లు మరియు పచ్చిశనగపప్పు,మినపప్పు,బెల్లంతో చేసిన పూర్ణాలు ,పెరుగన్నం మరియు అటుకులుతో చేసినది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి . 


ఎనిమిదవ రోజు: 20-10-2015
వారం :మంగళవారం
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ సప్తమి 
 అలంకారం: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) 
ఇష్టమైన రంగు : మెరూన్ (ముదురు ఎరుపు )

"యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది.

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
దుర్గాష్టమి పర్వదినాన "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును పఠించాలి

నైవేద్యం:   కదంబం (vegetable rice)మినపగారెలు, నిమ్మకాయలుతో చేసిన పులిహోర గాని ,నిమ్మరసం .

తొమ్మిదవ రోజు: 21-10-2015 
 వారం : బుధవారం 
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ అష్టమి  
 అలంకారం:  శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
ఇష్టమైన రంగు : ఎర్రటి ఎరుపు రంగు దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి.
ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. 

ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.

నైవేద్యం : ఈ రోజు చక్రపొంగల్ /బెల్లం పొంగలి  అమ్మవారికి ప్రీతికరం .

పదవ రోజు: 22-10-2015
 వారం : గురువారం
 తిధి: ఆశ్వీయుజ శుద్ధ నవమి /దశమి  
 అలంకారం:శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి ) 
ఇష్టమైన రంగు : ఆకుపచ్చ 

 శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి.సకల భువన బ్రహ్మండాలకు ఈమె ఆరాధ్య దేవత.మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది.ఈమెను ‘అపరాజితా దేవి’గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి.పరమేశ్వరుడి అంకం ఈమెకు ఆసనం.ఇచ్ఛా, జ్ఞాన,క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వారాలుగా అనుగ్రహిస్తుంది .ఈమె యొగమూర్తి .మాయ మోహిత మనవ మనో చైతన్యాన్ని రాజరాజేశ్వరీదేవి ఉద్దీపితమ్ చేస్తుంది .అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రం కు ఈమె అధిష్టాన దేవత

నైవేద్యం : ఈ రోజు అమ్మవారికి పరమాన్నం ,గారెలు 


గమనిక : తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు గమనించగలరు


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML