గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

భీమశంకరం దివ్యక్షేత్రం మహిమాన్వితమైనది. . మహారాష్టలోని పూణె జిల్లాలోఖేడ్తాలూకాలో ఉంది.


శంకరుడుకొలువుదీరినద్వాదశజ్యోతిర్లింగాలలో(6)ఆరవదిభీమశంకరం
 ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతిఅందాల నడుమఅలరారుతున్న
 ఈ పుణ్యక్షేత్రం.. మహారాష్టలోని పూణె జిల్లాలోఖేడ్తాలూకాలో ఉంది. 
‘భీమశంకరం’ సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది.
సాక్షాత్తు మహేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరిన భీమశంకరం దివ్యక్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడున్న భీమశంకరుడి ఆలయం అతి పురాతనమైనది. రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడ భీమశంకరం జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. పూర్వం రఘునాథ్ పీష్వా అనే శివభక్తుడు ఇక్కడొక నుయ్యిని తవ్వించాడు. అనంతరం పీష్వాల దీవాన్ నాడాఫడ్నవీస్ ఇక్కడొక ఆలయాన్ని నిర్మించాడు. అతి పురాతన ఈ దివ్యాలయం పాతాళంలో ఉంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు విరబూసుకున్న కొండల మధ్య, లోయ భాగంలో ఈ మందిరం ఉంటుంది. అందువల్ల ఈ మందిరానికి వచ్చిన భక్తులు అక్కడ విధిగా నిర్మించిన మెట్ల మార్గం ద్వారా కిందికి దిగి భీమశంకరుడి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

శివుడు ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉండటానికి ఇక్కడ రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను, బాధిస్తూ ఉండేవాడు. అతని ఆగడాలు భరించలేని మునులు, దేవతలు శివుడ్ని శరణువేడగా శివుడు త్రిపురాసురుడ్ని అంతమొందించాడు.
 శివుడికి, త్రిపురాసురుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలసిపోయిన శివుడు శరీరం నుంచి ఓ స్వేద బిందువు పైకి ఉబికి పాయలుగా మారి కొలనుగా మారింది. అక్కడనుంచి భీమానది పుట్టింది. యుద్ధంలో అలసిపోయిన పరమేశ్వరుడు ఈ సహ్యాద్రి పర్వత శ్రేణి ప్రాంతంలో సేద తీరాడట. వారి అభీష్టం మేరకు ఆ మహాదేవుడు ఇక్కడ భీమశంకరుడి నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.
‘భీమ’ నామధేయుడైన రాక్షసుడు తన తండ్రి మరణానికి శ్రీరాముడు, మునులు కారణమని భావించి శ్రీహరి సమేతంగా అందర్నీ మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహంతో అపార బలాన్ని పొందాడు. 
ఆ వరబలంతో అందరిని వధించాలని తలంచగా.. శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించాడు. దేవతలు, మునుల అభీష్టం మేరకు భీమశంకర నామధేయంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడట.


ఈ పుణ్యక్షేత్రం సందర్శనం సర్వపాపాలను హరిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర మహిమ అపారమైంది. ‘శివలీలామృతం’, ‘గురుచరిత్ర’, ‘స్తోత్ర రత్నాకరం’ వంటి ధార్మిక గ్రంథాలలో భీమశంకరం మహత్తు గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML