గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

ఎవరెవరు ఎలాంటి లింగాలని ఏ మాసంలో పూజిస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారు .

ఎవరెవరు ఎలాంటి లింగాలని ఏ మాసంలో పూజిస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారు .లింగపురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని పూజించాలని శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్ని అభిషేకించాలని వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్ని అర్చించాలి. 
స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రీలు మాత్రం భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాన్ని పూజించాలని అలాగే భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాన్ని కాని అర్చిస్తే మంచిదని లింగపురాణం చెబుతోంది. అయితే స్త్రీలు అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.ఏలింగాన్ని పూజచేస్తే ఏం ఫలితం పొందవచ్చును:

ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది.
రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦
,
వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది.
ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది.
మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.

కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది.

 అన్నిటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహ లింగం.

ఏ మాసంలో ఈ లింగాన్ని పూజించాలి :
 ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది.
వైశాఖంలో వజ్రలింగాన్ని
,
జ్యేష్ట౦లోమరకత లింగాన్ని
,
శ్రావణంలో నీలపు లింగాన్ని
,
భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని
,
ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని
,
కార్తికంలో ప్రవాళలింగాన్ని
,
మార్గశిరంలో వైడూర్య లింగాన్ని
,
పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని
,
మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని
,
ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి.

అయితే ప్రస్తుత కాలంలో అందరూ కూడా యాంత్రిక జీవనం అయిపోయింది కాబట్టి అందరకీ ఆ ఆ మాసాలులో లింగాల దగ్గరకు పోయి పూజ చేయటం వీలుపడకపోవచ్చు ఆర్దికంగా కొతమంది, సమయం దొరకక కొంతమంది,ఆరోగ్యం సహకరించలేకపోవడం వలన కొంతమంది, ముసలివారు  చెయ్యలేకపోవచ్చు వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను మీ దగ్గరలో ఉండే శివాలయాలలో కూడా పూజించవచ్చు

అతి పవిత్ర బాణలింగం:
అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.

స్థాపర, జంగమ లింగాలు :
జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరూపమైనప్పుడు, సృష్టి స్థితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు, చెట్లు ( మొదలైనవి)
 జంగమాలు(కదిలేవి -మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి)కూడా లింగరూపాలే అవుతాయి. 
వీటికి స్తావరలింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML