ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 29 October 2015

అద్దం’లోనే దర్శనమిచ్చే త్రియంబకేశ్వర లింగ

అద్దం’లోనే దర్శనమిచ్చే త్రియంబకేశ్వర లింగ

శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాశిక్కు 35 కిలో మీటర్ల దూరంలోని ‘త్రయంబక్’ అనే ఓ కుగ్రామంలో అలరారుతోంది. ఇక్కడ శివలింగం భూమికి 8 అడుగులు క్రిందకు ఉంటుంది. స్వామిని భక్తులు దర్శించేందుకు వీలుగా శివలింగానికి ఎదురుగా అద్దాన్ని అమర్చారు.
 భక్తులు ఆ అద్దంలోనే స్వామివారిని దర్శించుకుంటారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినంతనే సకల పాపాలను హరించిపోతాయని స్తోత్ర గ్రంధాలు చెబుతున్నాయి.

ఒకసారి తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడింది. ప్రజలు క్షామపీడుతులయ్యారు. అప్పుడు అహల్యా గౌతములు ..వరుణుని ఉద్దేశించి తీవ్ర తపస్సు చేసారు. ఆ దేవుడు ప్రత్యక్షమై ఒక చిన్న గుంటలో అక్షయజలం ఆవిర్భవిస్తుందని వర మిచ్చాడు. ఆ జలమే తరువాత గౌతమీ నదిగా రూపొందింది. ప్రజలకు క్షామభాధ తీరింది. అహల్య గౌతముల కీర్తి నలుదిశలా వ్యాప్తించింది. ఇది చూసి కొందరు మునులు ఒక మాయా గోవును సృష్టించి గౌతముని పంట పొలాలలోకి వదిలారు. గౌతముడు గడ్డిపరకతో గోవుని అదిలించాడు. అది మరణించింది. గోహత్యాపాపం గౌతమునికి కల్గిందనీ, అతని ముఖం చూస్తే పాపమనీ మునులు గౌతముని నిందించారు.

గౌతముడు ప్రాయశ్చిత్తం చెప్పండని ఆ మునులను వేడుకొన్నాడు. వారు చెప్పినట్లు బ్రహ్మగిరి ప్రదక్షిణం చేసాడు. కోటిలింగాలను ఆరాధించాడు. అందుకు సంతసించిన శివుడు ప్రత్యక్షమై గోహత్యాపాపాన్ని తొలగించాడు. గౌతముని ప్రార్ధనమేరకు గంగా శంకరులు నెలకొన్న క్షేత్రమే నాసిక్. అలా ఉదయించిన గంగయే గోదావరి. ఆ లింగమే త్రయంబకేశ్వరుడు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML