హయగ్రీవ రూపం సకల విద్యలకు ఆధారభూతమైనది
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
శ్రీ మహావిష్ణువు ధరించిన హయగ్రీవ రూపం సకల విద్యలకు ఆధారభూతమైనది అని శృతులు కీర్తిస్తున్నాయి. సకలశక్తి స్వరూపిణి అయిన లలితాదేవి ఉపాసనా రహస్యాన్ని సహస్రనామ, త్రిశతి, అష్టోత్తర, ఖడ్గమాల రూపాలుగా హయగ్రీవుడు అగస్త్యునికు ఉపదేశించినట్లు బ్రహ్మాండపురాణం చెబుతోంది.
హయగ్రీవ స్వామి రూపంలో గురు తత్వం సాక్షాత్కరిస్తుంది. హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. అతడు లక్ష్మీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు. అతడి పై కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం ఉంటాయి. కింది కుడిచేయి చిన్ముద్ర. వీటిలో తెల్లని పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికీ, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్ సృష్టికి కారణభూతమైన నాదానికీ, చక్రం అజ్ఞాన సంహారానికీ చిహ్నాలు. హయగ్రీవ ఉపాసనతో సకల సిద్ధులు కలుగుతాయని చెబుతారు.
హయగ్రీవ నామాన్ని జపిస్తుంటాడో వారికి జహ్నుకన్య అయిన గంగానదీ ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుంది లభిస్తుందని రుషి వచనం. అందువల్లే కొన్ని సంప్రదాయాల వారికి, ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం ఏర్పడింది.
ఏ దేవతకైనా అతని నామమే శరీరమని, అందులోని అక్షరాలే అతడి అవయవాలని మంత్రశాస్త్రం చెబుతోంది. హయగ్రీవనామం దివ్యశక్తి సంభరితమైనది. ఆ నామాన్ని స్మరించినవాడు శివస్వరూపుడవుతాడు. పలికినవాడు విష్ణుస్వరూపుడవుతాడని విశ్వసిస్తారు. విన్నవాడు తన స్వరూపుడు అవుతాడని స్యయంగా బ్రహ్మదేవుడే తెలియజేశాడు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Wednesday, 7 October 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment