గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 October 2015

అష్టాదశ పురాణాలు, మరియు పురాణాల గురించి, ఏ పురాణం లో ఏమి ఉంది

బ్రహ్మవైవర్త పురాణం:

వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం.
 సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.

వామన పురాణం:
బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది.

శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి.
ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.

వరాహ పురాణం:
శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది.
ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి. ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం.
పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.

బ్రహ్మాండ పురాణం:
బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
 బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది.

పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు.
 ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.

వరాహ పురాణం:
శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది.
ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి. ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం.
పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.

వాయు పురాణం (లేదా) శివ పురాణము:
 వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం.
 ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి.
 మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.

విష్ణు పురాణం:
 పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం.
విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.


నారద పురాణం:
 నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం.
ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.

అగ్ని పురాణం:
భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం.
 వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.

స్కంద పురాణం:

కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి. ఇది స్కందుడు చెప్పిన పురాణం.
 ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.

గరుడ పురాణం:
విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000  శ్లోకాలున్నాయి.
ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం.
గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు..

లింగ పురాణం:
నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.
అష్టాదశ పురాణాలు వివరణతో :

మత్స్య పురాణం
మార్కండేయ పురాణం
భాగవతపురాణం
భవిష్య పురాణం
బ్రహ్మ పురాణం
బ్రహ్మాండ పురాణం
 బ్రహ్మవైవర్త పురాణం
వరాహ పురాణం
వామన పురాణం
వాయు పురాణం (లేదా) శివ పురాణము,
 అగ్ని పురాణం
 విష్ణు పురాణం
నారద పురాణం
స్కంద పురాణం
గరుడ పురాణం
లింగ పురాణం,
కూర్మ పురాణం
పద్మ పురాణం,

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML