
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Thursday, 29 October 2015
హిందువుల ఆలయాలులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న కలియుగ వైకుంఠమ్ గా పిలువబడే తిరుమల కొండను బ్రిటిష్ వారు మొట్టమొదట కొన్ని నియమ నిబందనలు రూపొందించారు.
హిందువుల ఆలయాలులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న కలియుగ వైకుంఠమ్ గా పిలువబడే తిరుమల కొండను బ్రిటిష్ వారు మొట్టమొదట కొన్ని నియమ నిబందనలు రూపొందించారు.
మన భారతదేశంను 200 ఏళ్లకుపైగా పరిపాలించిన బ్రిటిష్ దొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులే మొట్టమొదట శ్రీవారి కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసినది బ్రిటిష్ వారే .
వారి కాలంలోనే ఆలయ పాలనా పునాదులు పటిష్టంగా ఏర్పాటు చేసారు దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు దగ్గర ఉన్న పురాతన ఆలయ రికార్డులే ఆధారం.
1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన “బ్రిటిష్ ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్” నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు.
క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు.1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు.
అప్పుడు టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు వారు రూపొందించారు ఇందులో ఆశ్చర్యం ఏమంటే ఇప్పటికూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రిటిష్ వారు అమలుచేసిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
అవి :
1.దిట్టం:-- శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ తిరుమల ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు.
2.కైంకర్యపట్టీ:-- తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీ దారులు, జియ్యర్ సిబ్బంది విధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చేశారు. దీనిప్రకారం సిబ్బంది నియామకం,హోదా, విధులు, జీతభత్యాలు ,ఇలా పూర్తి వివరాలు ఇందులో పొందపరిచారు.
3.బ్రూస్ కోడ్:-- బ్రిటీష్ ప్రావిన్షియల్ జడ్జి పి.బ్రూస్ “ఈస్టిండియా కోడ్ ఆఫ్ డెరైక్టర్” (east India code of director) ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచీగా ఉంది.
4.సవాల్- ఇ-జవాబు:-- శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలువేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్- ఇ-జవాబు పట్టీగా పిలుస్తారు.
5.పైమేయిషి ఖాతా:-- ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు.
1819లో రూపొందించిన ఈ పద్ధతిని “పైమేయిషి అకౌంట్” అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది.
జీవో ఎంఎస్ నెంబరు 4429 తేది:23.09.1940, జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చ.కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి పాలనాదక్షతకు నిదర్శనం...
Reactions: |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment