ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 6 October 2015

పితృ దేవతలు, ఆప్తులకు మోక్ష ప్రాప్తి మహాలయ పక్షం!



పితృ దేవతలు, ఆప్తులకు మోక్ష ప్రాప్తి మహాలయ పక్షం!

పుట్టినవాడు గిట్టక తప్పడు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన వారికి శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు చేయాలి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అంటారు. భాద్రపదమాసంలో క్రిష్ణపక్షానికి మహాలయ పక్షం అని పేరు.

మహాలయం అంటే గొప్ప వినాశనం కానీ మరణం అని అర్థం. మహాలయం పక్షంలో రోజులలో పూర్వికులు మరణించిన తితిని బట్టి ఆయా తిథులలో ఈ పక్షం రోజులలో పిండప్రదానం, తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు కాబట్టే దీనికి పిత్రుపక్షం అని పేరు అంటారు. ఈ మహాలయ పక్షంలో రోజూ లేదా మరణించినవారి ఆయా తిథులలో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే పితృలు సంవతరం వరకు సంతృప్తి పొందుతారని స్కాంద పురాణం చెబుతున్నది. పితృదోషాలకు కారణం పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల తరువాతి తరం వారు కష్టాల పాలవడం జరుగుతుంది. పితృదోషాలవల్ల అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తికాకపోవడం, పనులలో ఆటంకాలు, వైఫల్యాలు ఎదురవడం, స్త్రీలకు యవ్వనంలోనే వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబసభ్యుల మానసికస్థితి బాగుండకపోవడం, సంతానం లేకపోవడం వంటివి సంభవిస్తాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటినుండి ఉపశమనం పొందడానికి ప్రతి వ్యక్తీ పితృఋణం తీర్చుకోవాలి. మహాలయ పక్షంలో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలా ఆకలిదప్పులు తీరుస్తాయని, సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం వంశ ఉన్నతికి కారణమవుతుంది. పితృఋణం తీర్చుకోవడానికి పితృదేవతలు మరణించిన తిథులలో వారికి సంవత్సరీకాలు, పిండప్రదానాలు, తర్పణలు నిర్వర్తించాలి. అలా చేయలేనప్పుడు గయాది తీర్థాలలో పిందప్రదానలు చేయాలి లేకపోతె పుష్కరాల పర్వాలలో నిర్వర్తించాలి అదీ చేయలేనప్పుడు భాద్రపదమాసంలో వచ్చే కృష్ణపక్షంలో పితృదేవతలకు పిండప్రదానాలు తప్పక చేయాలి. ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు కన్యా, తులా రాశులలో సంచారం చేసి వృశ్చిక రాశిలో ప్రవేశం జరిగేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. భాద్రపద బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొన్ని రోజులు సింహరాశిలోను, కొన్ని రోజులు కన్యా రాశిలోను ఉంటుంటాడు. అందుకే కన్యారాశి, తులరశులలో సూర్య సంచారం జరిగే కాలమంతా పితృదేవతలు తమ ప్రేతపురిలో భోజనపానీయాలు లేకుండా ఉంటారు. ఇటువంటి సమయంలో వారు అందరూ భూలోకానికి వచ్చి వారి వారి ఇళ్ళ చుట్టూ ఆహారం కోసం తిరుగుతూ ఉంటారని మహాభారతంలో వివరించడం జరిగింది. తండ్రి జీవించి, తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో వచ్చే నవమి రోజున తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. అలాగే తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఈ పక్షంలో తప్పకుండా పితృకర్మలు చేయాలని ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. పితృఋణం తీర్చుకోవడానికి మహాలయ పక్షం అంతా చేయలేనివారు కనీసం ఒక్క మహాలయం అయినా చేసితీరాలి. ఆ ఒక్కరోజు కూడా చేయలేనివారు హిరణ్యశ్రాద్ధం చేయాలి. పితృదేవతలకు శ్రాద్ధం చేసే సమయంలో తర్పణాన్ని కూడా ఆ ప్రక్రియలో భాగం చేయాలి. శ్రాద్ధ ప్రక్రియను చేయడానికి పురోహితులు దొరకని పరిస్థితులలో ముగ్గురు పితృదేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని పార్వణశ్రాద్ధం లేదా చటకశ్రాద్ధం అని అంటారు. బ్రాహ్మణులు లేకుండా పితృదేవతలను ఆవాహన చేయడం కొన్ని సంప్రదాయాలలో ఉంది. తగిన కారణంతో ఈ శ్రాద్ధకర్మ చేయలేని సమయంలో కుప్తంగా చేసే శ్రాద్ధవిధిని దర్శశ్రాద్ధం, ఆమశ్రాద్ధం లేదా హిరణ్యశ్రాద్ధం అని పిలుస్తారు. అన్ని శ్రాద్ధకర్మలలో పితృదేవతలకు ప్రీత్యర్థం చేసే తిలాంజలిణే తర్పణం అని అంటారు. ఇటువంటి తిలాతర్పణాన్ని ఇంట్లో చేయకూడదు. ఇంట్లోని తులసికోట దగ్గర కానీ, ఇంటి ఆవరణలో కానీ తర్పణాలు వదలాలి. తండ్రి జీవించి ఉన్నవారు తర్పణాలు వదలకూడదు. తర్పణాలు ఇచ్చే సమయంలో మొదటి బంధుత్వం (మాతు: పితు: మాతులః) తరువాత వారి వారి పేరు, గోత్రం చివరగా పితృదేవతారూపం (వసు, రుద్ర, ఆదిత్య) చెప్పి తర్పణాలు వదిలిపెట్టాలి. మాతృ, పితామహి, ప్రపితామహి ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలు అందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదిలిపెట్టాలి. మిగిలినవారికి వారి వారి సూత్రానుసారంగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి. తర్పణాలు ఇచ్చే సమయంలో కుడిచేతి ఉంగరపు వ్రేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం పెట్టుకోవాలి. ప్రాచీనావీతిగా ఉంది యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా కుడిభుజంపై వేసుకుని, ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని, కుడిచేతిలో నువ్వులు ఉంచుకుని, చూపుడు వ్రేలు, బొటన వ్రేలు మధ్య నుండి నీరు, తిలలు వదిలిపెట్టాలి. ఒకరోజే రెండు కారణాల వల్ల రెండుసార్లు తర్పణాలు ఇవ్వకూడదు, ఒక్కసారే ఇవ్వాలి. అమావాస్య, సంక్రమణం ఒకేరోజు వస్తే అమావాస్య తర్పణం మాత్రమే ఇవ్వాలి. అలాగే దక్షిణాయన/ఉత్తరాయణ పున్యకాలాలు అమావాస్య రోజున వస్తే, ఆయన పుణ్యకాలంలో మాత్రమే తర్పణాలు వదిచిపెట్టాలి. పితరులకు తర్పణం విడిచిపెట్టే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం.

శ్రాద్ధకర్మలు

తిథి ఉపయోగాలు

పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశు సంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి
అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML