గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 21 September 2015

భారతీయ అతి గొప్ప శాస్త్రవేత్తల్లో వరాహమిహిరులు ఒకరు. జ్యోతిష్యం, ఖగోళం, గణితం, వృక్ష, జల శాస్త్రాలు, భౌతిక శాస్త్ర్రం, ఇలా ఒకటి కాక అనేక శాస్త్రాల్ని చక్కగా వివరించారు.వరాహమిహిరులు........

దయ చేసి పూర్తిగా చదివి, నచ్చితే షేర్ చేయగలరు.

భారతీయ అతి గొప్ప శాస్త్రవేత్తల్లో వరాహమిహిరులు ఒకరు. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈయన ఎన్ని విషయాలలో పరిశోధనలు చేసి,ఎన్ని వైజ్ఞానిక అంశాలు చెప్పారో లెక్కే లేదు. అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చెబుతున్నాం. జ్యోతిష్యం, ఖగోళం, గణితం, వృక్ష, జల శాస్త్రాలు, భౌతిక శాస్త్ర్రం, ఇలా ఒకటి కాక అనేక శాస్త్రాల్ని చక్కగా వివరించారు.


1) వీరు రచించిన అనేక గ్రంథాల్లో బృహత్సంహిత చాలా గొప్పది.

2) ఇందులో గల 32వ "దకార్గళాధ్యాయం" లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించారు.

3) మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్తము ప్రవహించునట్లే, భూమిలో గల జల నాడులలో జల ప్రవాహములు గలవని, వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లూ పుట్టలూ ఉపయోగ పడతాయని నిరూపించారు.

4) ఇదే గ్రంథంలో 32వ అధ్యాయంలో భూకంపాలను ముందుగానే పసిగట్టవచ్చుననీ, భూకంపం రావడానికి కనీసం ఏడు రోజులు ముందు నుంచే ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయనీ, భూకంపాలకు గ్రహాల ప్రభావం, జలవనరుల ప్రభావం కూడా ఉంటుందనీ, పశు పక్ష్యాదులలో ఏవి ఎలా స్పందిస్తాయో కూడా స్పష్టంగా చెప్పారు.

5)భూకంపం జరిగే ముందు వద్ద అతి వేడిమి పుట్టి, ఆ వేడిమి ఆవిరిగా మారి, అది మేఘాకృతి దాలుస్తుందనీ, ఇది వింత వింత ఆకారాల్లో ఉంటుందనీ, ఆయా మేఘాకృతుల్ని బట్టి భూకంపాల్ని గుర్తించవచ్చని చక్కగా వివరించారు.

6) నీటి జాడలకు సంబంధించి ఆయన చెప్పిన అనేక విషయాలలో ఒకట్రెండు ఇక్కడ ప్రస్తావిద్దాం.

7) జలము లేని ప్రదేశంలో నేరేడు చెట్టున్నట్లైతే, దానికి మూడు హస్తముల ఉత్తరంలో, 240 అంగుళముల లోతులో జల రాశి ఉండును. ఇక్కడ త్రవ్విన 12 అంగుళాల లోతులో లోహపు వస్తువులూ, వాసన కలిగిన మట్టీ, దాని క్రింద కొంచెం తెల్లని మట్టీ, దాని కింద కప్ప ఉండును. దాని కింద దీర్ఘకాలమూ ఉండే జలముండును.

8) వర్షం నీటికి రంగూ రుచీ ఉండవనీ, అది స్వచ్ఛమైనదనీ, నేలమీద పడ్డ వాన నీరు నేల స్వభావాన్ననుసరించి రంగు రుచీ సంతరించుకుంటుందనీ వివరించారు.

అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరూ వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకు రాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయడం జరుగుతోంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు,ఆకులు పరిశీలించి, వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది. అయితే భూకంపాల్ని ముందుగా తెలుసుకునే పరిజ్ఞానం ఇంకా ఆధునికులు కనిపెట్టలేదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML