ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 21 September 2015

ప్రాంతం- చిత్తురు జిల్లాలోని కాణిపాకంప్రాంతం- చిత్తురు జిల్లాలోని కాణిపాకం
దైవం- వరసిద్దివినాయక స్వామి
ఆలయం నిర్మించిన సం- 11వ శతాబ్దం
మాట్లాడే భాషలు- తెలుగు,తమిళం,ఇంగ్లిష్


తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ది,బుద్దులను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీకాణిపాకం వినాయకుడు.కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది.స్వామివారు ఇక్కడబావిలో స్వయంభూగా వెలిసాడు.ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది.ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది.అదే నీటిని భక్తులకు తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు.మరో విశేషమేమిటంటే ఎపూడూ నీళ్ళతో ఉండే ఈ బావిచుట్టూపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది.ఈ ఆలయం యొక్క పూర్వాపరాలను తెలిపే స్ధలపురాణమ్ను ఒక్కసారి పరిశిలిస్తే...
స్ధలపురాణం -
పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ,చెవిటి,గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి ఉండేదట.అభూమిలో ఏతంతొక్కడానికి ఒక చిన్నబావిని తవ్వరట.అయితే కొంతకాలానికి ఆప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకాలోతుగా తవ్వాలని నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి తవ్వడం ప్రారంభించారట.తవ్వగా తవ్వగా కొంతసేపటికి గునపం రయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారిమీద చిందిందట.ఆ రక్తం మీద పడగానే మూగ,గుడ్డి,చెవిటి వారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములుగా తయారయ్యారట.ఈవార్త ఆప్రాంతం అంతా దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చుడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహనికి ఆలయం నిర్మించారట.ఇప్పటికి స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది.
కాణిపాకం చుట్టూ ఉన్న ఆలయాలు -
వరదరాజస్వామి ఆలయం
మణికంటెశ్వరస్వామివారి ఆలయం
ఆంజనేయస్వామి ఆలయం
దగ్గరలో ఉన్న ఆలయాలు -
అత్దగిరి ఆంజనేయస్వామి(22కిమీ) -తవనంపల్లి
సిరిపురం (55కిమీ) -నారాయణిపట్నం
బోయకోండ గంగమ్మ ఆలయం - బొయకొండ
వెంకటెశ్వరస్వామి(65కిమీ) - తిరుపతి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML