గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 21 September 2015

ఇది నిజమేనా ?? ఉక్కుమనిషి పటేల్ లేకుంటే - తెలంగాణ మరో పాకిస్తాన్ అయ్యేది : హిందూ వాహిని: 21/09/2015, KMIT,

ఉక్కుమనిషి పటేల్ లేకుంటే - తెలంగాణ మరో పాకిస్తాన్ అయ్యేది : హిందూ వాహిని: 21/09/2015, KMIT, నారాయణ గూడా, భాగ్యనగర్ : నిరంకుశ చివరి నిజాం పీడా తెలంగాణ ప్రాంతాన్ని వీడిన రోజును పురస్కరించుకుని , హిందూ వాహిని భాగ్యనగర్ శాఖా అధ్వర్యంలో తేది : 20/09/2015 నాడు భాగ్యనగర్ నారాయణ గూడా లోని కేశవ్ మెమోరియల్ కళాశాల పటేల్ హాల్ ఆడిటోరియం లో " నిజాం పరిపాలన విముక్తి దినోత్సవం " జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ చరిత్రకారులు శ్రీ ముదికొండ శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ " భారత దేశానికి ఆంగ్లేయ పాలన నుండి స్వాసంత్ర్యం పొందిన రోజుకు దేశ చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందొ అంతే ప్రాధాన్యత నిరంకుశ నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన రోజుకూ ఉంది, ఆగస్టు 15 లా సెప్టెంబర్ 17 ను ఎందుకు మనం ఘనంగా జరుపుకోలేకపోతున్నాం, ఇది ఆలోచించాల్సిన అంశం నిజాం పాలనా విముక్తి దినాన్ని జరపాలంటే అంతకు ముందు నిజాం నిరంకుశ పరిపాలన విషయం చెప్పాల్సి వస్తుంది, నిజాం పరిపాలన లో ఈ ప్రాంతం లోని హిందువులు అనుభవించిన ప్రత్యక్ష నరకాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది, హిందువుల మన బిందువులైన మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించిన క్రూరత్వాన్ని, కనీసం సామూహికంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోలేని నిర్భంద్దాన్ని, పూజారుల నోట్లో బలవంతంగా ఆవు మాంసాన్నికుక్కిన వికృత విధర్మీయ మనస్తత్వాన్ని గురించి చెప్పాల్సి ఉంటుంది, వీటితో పాటు ఇంత విపత్కర పరిస్తితులలోను తమ అస్తిత్వం కోసం పోరాడిన, కొమరం భీం, చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప రెడ్డి, భహిరంగ ఉరిని సైతం పొందిన ఆచార్య నరేంద్ర ఆర్య లాంటి ' హైందవ వీరుల పరాక్రమ గాధలను ' గురించి చెప్పాల్సి వస్తుంది, వీటితో తమ నోటు - వోటు బ్యాంకు చిల్లు పడుతుందనే ఈ ప్రభుత్వాలు ఈ మహోజ్వల చరిత్రను మన ముందుకు రాకుండా కుట్ర పూరితంగా వ్యవహరించడం జరిగింది " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రాజవర్ధన్ గారు రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ విశ్వ ప్రసాద్ గారు విభాగ్ అధ్యక్షులు, శ్రీ త్రివిక్రమ్ జి హిందూ వాహిని రెండు తెలుగు రాష్ట్రాల సంఘటన కార్యదర్శి, శ్రీ వెంకట్ నివాస్ గారు హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి, పెద్ద సంఖ్యలో హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML