ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 1 August 2015

ఈరోజు గురుపూర్ణిమ. వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము. ఈరోజు గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు

ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
తాత్పర్యము: గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
ఈరోజు గురుపూర్ణిమ. వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము. ఈరోజు గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు. గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు. ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు.
శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః
వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.అంతే కాదు,విష్ణావతారంగా భావించే వ్యాసుడ్ని పూజించి విష్ణుపురాణం దాన మివ్వడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. సోమకాసురుడు వేదాలను ఎత్తుకెళ్ళి సముద్రంలో దాచేసాడుట.అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం లో ఆ వేదాలను తిసుకు వచ్చాడు.అలా వచ్చిన వేదాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పోయి గజిబిజి గా ఉన్నాయట.అప్పుడు వ్యాస మహర్షి వాటిని విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని, గురు పరంపరనూ పూజించాలి.వేదాలను నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||
వ్యాస మహర్షి జన్మ తిధి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ ను గురు పూర్ణిమగా జరుపుకుంటాం.లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిధిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. భారత భాగవతాలు,అష్టాదశ పురాణాలు,ఉప పురాణాలు అందించిన మహానుభావులు వ్యాస భగవానుడు.
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||
విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు మంచి చెప్పే ప్రతీవారు గురువులే. ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి. ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.
పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML