
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 11 August 2015
మాంగళ్య గౌరీదేవి ....
మాంగళ్య గౌరీదేవి ....
.
బీహార్ - గయ ప్రాంతంలో 'మాంగళ్య దేవి' శక్తి పీఠం ఆవిర్భవించింది. ఈ ప్రదేశానికి 'గయ' అనే పేరు రావడానికి కారణమైన కథగా గయాసురుడి వృతాంతమే వినిపిస్తుంది. ఇక్కడి అమ్మవారు మాంగళ్య గౌరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. బ్రహ్మదేవుడి కుమారుడైన మరీచి తన భార్య అయిన ధర్మవ్రతను శపించగా, ఆమె మాంగళ్య గౌరీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థల పురాణం చెబుతోంది.
ఫల్గుణీ నదీ తీరంలో గల విష్ణుపాద క్షేత్రానికి పక్కనే ఈ మాంగళ్య గౌరీ దేవి ఆలయం ఉంది. ఇక ఇక్కడికి దగ్గరలోనే సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగించి బుద్ధుడిగా మార్చిన 'బోధి వృక్షం' కూడా కనిపిస్తుంది.
సాధారణంగా గయకి వచ్చే వారంతా పితృదేవతలకు ఆబ్దికాలు నిర్వహించే పనిపైనే దృష్టి పెడుతుండటం వలన, అమ్మవారి ఆలయం దగ్గర అంతగా రద్దీ కనిపించదు. గర్భాలయంలో తులసికోట పై ఆవునెయ్యితో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ కారణంగానే అమ్మవారిని శ్రీ మహావిష్ణువు సోదరిగా భావించి భక్తులు కొలుస్తూ ఉంటారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment