గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 August 2015

దిల్లున్న దేవుడు వెంకన్న బాబు మాత్రమే = అద్బుతాలకు నిలయం శ్రీ వేంకటేశ్వరుడు

తిరుమలలో అద్భుతం!! గుడిలో ప్రవేశించగానే మూగ పిల్లవాడికి మాటలు!
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్ కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా?
వివరాల్లోకి వెళితే....లండన్ కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్ కు లండన్ లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు.
కాగా చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది..!!
ఈ అద్భుతాన్ని మీ స్నేహితులకు షేర్ చెయ్యండి ...
నమో వెంకటేశ!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML