గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 August 2015

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవత దేవాలయ ప్రాశస్త్యంబల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవత దేవాలయ ప్రాశస్త్యం

హైదరాబాద్‌ నగరం బల్కంపేటలో వెలిసియున్న శ్రీ ఎల్లమ్మ దేవత ఒక బావిలో భూమి ఉపరితలమునకు సుమారు 10 అడుగుల దిగువన శయన రూపంలో నైసర్గిక ఆకారంలో తూర్పు మూలముగా చూస్తూ స్వయంభువుగా వెలసి, శతకోటి ప్రభల తేజస్సుతో సత్యాదీక్ష ప్రదాయినియై, భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతోంది.

అమ్మవారి స్వయంభువు మూల విగ్రహము శిరస్సు వెనుక భాగమున గల బావి నుండి ఉద్బవించే జలఊటతో ప్రవహించి ఉండుట ఇచ్చట ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ బావి ఊట జలధార నుంచి వచ్చే నీటిని అనాదిగా భక్తులు అమ్మవారి తీర్థముగా స్వీకరించుటయే గాక కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చినప్పుడు ఈ నీటిని తీసుకొని వెళ్లి స్నానమాచరించుట సాంప్రదాయంగా వస్తోంది. కలరా, మశూచి, గజ్జి, తామర మొదలగు వ్యాధులు నివారించుటకు ఈ నీటితో స్నానమాచరించుట ఒక ఔషధంగా ఉపయోగపడుతున్నట్లు భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.


చారిత్రాత్మక ఆధారాల ప్రకారం సుమారు 700 సంవత్సరములకు పూర్తమే ఈ దేవాలయం ఉన్నట్ల అప్పట్లో బావిలో ఉన్న స్వయంభువు అయిన అమ్మవారు నీటి మధ్యంలో శిలారూపంలో ఉండుట వలన దూరం నుంచి అమ్మవారిని దర్శించుకునేవారని తెలుస్తోంది. హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న నైజాంవారి కాలంలో పునర్నిర్మించబడినదని, స్థానికులు చెప్పినదాని ప్రకారం శ్రీ రాజా శివరాజ్‌ బహద్దూర్‌ పరిపాలనా కాలంలో 1919 సంవత్సరంలో దేవాలయం పునర్నిర్మాణం గావించబడి ఈ ప్రాంతం ‘బెహలూఖాన్‌గూడ’గా పిలువబడుతూ అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరుపుతూ వుండేవారని, తదుపరి ఈ ప్రాంతం ‘బల్కంపేట’గా ప్రాచుర్యం పొందినదని తెలుస్తోంది.

శ్రీ అమ్మవారు మంత్ర శాస్త్రంలో ప్రాధాన్యమైన దశమ మహావిద్యలతో రేణుకాంబ అనే అంశతో ఆవిర్భవించారు. ఈ రేణుకాంబనే ‘ఛిన్నమస్తా’ అని కూడా పిలుస్తారు. 1919 సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో అమ్మవారితో దక్షిణభాగంలో శ్రీపోచమ్మ అమ్మవారిని క్షేత్రపాలకురాలి(శీతాలాదేవి)గా ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు తమ తమ కోరికల మేరకు బోనాలు సమర్పించి తమ కోరికలు తీరిన పిదప కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అమ్మవారిని దర్శించి భోజనాది కార్యక్రమాలు నిర్వహించుకొనుట ఒక ఆచారంగా వస్తోంది.

ఎల్లమ్మ అనగా ‘ఎల్లరకు అమ్మ’ అని ఎల్లరకు కోరిన కోరకలు తీర్చే అమ్మగా ఉండుట వలన ప్రతి ఒక్కరు ఈ అమ్మవారిని ఎల్లమ్మ అమ్మవారుగా వాడుక భాషలో పిలుచుట ఆచారంగా ఉండి, ఆ నామధేయంతోనే అమ్మవారికి శాక్తేయ సాంప్రదాయం ప్రకారం ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు అర్చనలు జరుగుతున్నాయి. ఈ దేవస్థానం నందు ప్రతి, ఆది మంగళ గురు మరియు శుక్రవారాలలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తమ సాంప్రదాయం, ఆచారం ప్రకారం బోనాలు సమర్పిస్తుంటారు. శ్రీ అమ్మవారు పది అడుగుల దిగువన శయన రూపంలో నైసర్గిక ఆకారంలో తూర్పు మూలంగా చేసి స్వయంభువుగా వెలిసియున్నందున పైభాగంలోని మహామండపము నుండి ప్రతినిత్యం అఖండ జ్యోతి వెలుగుతూ భక్తులకు ఙ్ఞానమార్గమును ప్రసాదించుచున్నది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML