గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 1 August 2015

కల్యాణ రాముని అవతార కథ


కల్యాణ రాముని అవతార కథ

కల్యాణ రాముని అవతార కథ
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గాఅభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారముతరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడేజరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీ రామ నవమి పండుగను స్వామిజన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. భగవంతుడు ధరించిన మానవఅవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యముతెల్పుతున్నది. ( ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 నజన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. )
భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండికడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణములద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.
పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటికావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోనిరామావతారము గురించి మనకు తెలియుచున్నది.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమనిరామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలాప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి,ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగాకొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.
జన్మ వృత్తాంతం
త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సుచేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులనువేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువురామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.
భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆయఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమునుదశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురుభార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు,గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులేశ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.
చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటకలగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగుఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగాజీవించెను.
రామ నవమి
శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకముకూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.
విది విధానం
ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణమహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసిప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమివరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందురామకధా కాలక్షేపము జరుపుదురు.
శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారముకూడ కలదు. శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడుపార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.
దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖ ములలో , కష్టనష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాకపితృవాక్య పరిపాలనము, సత్యసంధత,భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట - ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలనుఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.
అందుకనే "శ్రీ సీతారాముల గుడి లేని గ్రామముండదు... శ్రీ రామ అని మొట్ట మొదట వ్రాయక, యే వ్రాతయూవ్రాయబడదు" అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీ రామ నవమి మానవాళికి పర్వదినమైనది.రాముని పుట్టుక : -
తత శ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ
నక్షత్రే దితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు॥


మహా నియమవంతుడు, శివపూజా ధురంధరుడూ అయిన రావణుణ్ణి సంహరించేందుకు శ్రీహరంతటివానికి ఓ గట్టిముహూర్తాన్ని నిర్ణయించుకోవలసి వచ్చింది. అందరూ తపస్సు చేస్తున్న వేళ అకస్మాత్తుగా ప్రత్యక్షమై వరాలిచ్చే శ్రీహరికిఇంతగా ముహూర్తాన్ని నిర్ణయించుకుని జన్మించవలసిన అవసరం రావడానికి కారణం, రావణునికి ఉన్న తపోబలమే.


12వ నెలలో (మనుష్యజాతి 10వ నెలలో కదా పుడుతుంది), చైత్రమాసంలో (చైత్రే మధుర భాషే స్యాత్- శత్రువుక్కూడారుచించేలా మాట్లాడగల శక్తి ఈ మాసంలో పుట్టినవారికి ఉంటుంది. అందుకే అప్పటి వరకు తిట్టిన వాలి కూడా రాముడుమాట్లాడడం ప్రారంభించినంతనే మౌనంగా ఉండి విన్నాడు. తప్పయిందని వేడుకున్నాడు), నవమి తిథిలో (నిర్భయస్సర్వ భూతేఖ్యో నవమ్యా ముపజాయతే- శత్రువుక్కూడా భయపడకుండా మాట్లాడేతనం నవమినాడు జన్మించిన వారికిఉంటుంది), పునర్వసు నక్షత్రంలో (ఇది ధనుస్సు ఆకారంలో 5 నక్షత్రాల కూడికతో ఉంటుంది కాబట్టి తనది ధర్మమా?కాదా? అనే అంశాన్ని తనకి తాను తన బాణ ప్రయోగం ద్వారా తెలుసుకుంటాడు ఈ జాతకుడు. అందుకే రాముడు నిత్యధనుర్ధారి. (ధనువంటే విల్లు కాదు, ధర్మం అని అర్థం). ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా తనని తాను రామునిగాపుట్టించుకోవాలనుకున్నాడు శ్రీహరి. ఆ ప్రణాళికనే అమలు చేస్తూ అలానే జన్మించాడు కూడా!
రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః


ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా..
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా


శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా


క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా


వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా..
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా


జయతు జయతు మంత్రం ,జన్మ సాఫల్య మంత్రం -
జనన మరణ భేద క్లేశ విచ్చేద మంత్రం
సకల నిగమ మంత్రం ,సర్వ శాస్త్రైక మంత్రం –
రఘు పతి నిజ మంత్రం ,రామ రామేతి మంత్రం ||

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML