ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 11 August 2015

సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి"నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది.



సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి"నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు గావించి, పాయసము నివేదించాలని ముక్కంటి.. శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.

అందుచేత నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి.


పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపమెలిగించాలి.

నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. "ఓం నాగరాజాయనమః" అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి.

వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుంది.

అలాగే.. నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

చలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . మంచో , చెడో ... విపరీత ధోరణి ఇది . హిడువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు . ఈ విధం గా బ్రాహ్మణులూ , ఋషులు , మునులు ... మానవజాతిని నమ్మించి సన్మార్గములో పయనించేటట్లు చేసారు .

నాగ జాతి జనము :
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది . ఈ నాగపూజా వెనుక యోగాపరమైన అంతరార్ధము కుడా ఉన్నది .. మన వెన్నెముక కు అడుగుభాగము లో మూలాధార చక్రమున్నది . ఆ చక్రం లో కుండలినీ శక్తి ఇమిదివున్నది .. అదే నాగదేవత , ధ్యానం to ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకొని వెళ్లి నట్లయితే మానవుడు మహానీయుదవుతాడు .. అదీ నాగశక్తి .
మూలము : రచన కర్త : డా .పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి .

నాగపంచమి నోము
పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది. ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.

ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాదువు త్రికాలజ్ఞానుదని విని అతనివద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమితని వినయపూర్వకముగా వేడుకున్నది.
అందుకా సాదు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించినది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజా చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.

ఉద్యాపన: శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే … పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

నాగపంచమి నోము

పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది. ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు. ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాదువు త్రికాలజ్ఞానుడని విని అతనివద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకున్నది.


అందుకు ఆ సాధుపుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.
ఉద్యాపన: శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.



శ్రావణ శుక్ల పంచమి ఉదయమే తలస్నానము చేసి, ద్వారమునకిరువైపులా ఆవుపేడతో అలికి, పసుపు, బియ్యం పిండితో, ముగ్గులు వేసి, పసుపుతోకాని, అవుపేడతో కాని, బియ్యం పిండితో కాని నాగ చిత్రములు వేసి, ఆవుపాలు, వడపప్పు నైవేద్యము పెట్టవలెను. ఇలా చేసిన యింటిలోని వారు నాగదోషములు, అకాల మృత్యువు నుండి కాపాడబడి, పిల్లలకి, కళ్ళు, చెవులు, మూగ దోషములు పోవును. ఆయిల్లు పసిపాపలతో కళ కళ లాడుతుండును. చతుర్ధి నాడు ఉపవాసము ఉండి, పంచమినాడు ఐదు తలల పాము చిత్రములువేసి అనంతాది నాగ రాజులను లాజలు, పంచామృతము, గన్నేరు, సంపెంగ, జాజి పూలతో పూజించి ఏమి తరగకుండా, వండకుండా ఉన్న సాత్విక ఆహారము, పెసలు, చిమ్మిరి, చలిమిడి, పాలు నైవేద్యము చేసి, అవి సేవించి, ఉపవాసము చేయవలెనని నియమము. ఆడువారు, పిల్లలు, కన్నెలు, పుట్ట వద్దకు వెళ్లి అలంకరించి, యగ్నోపవీతములు, వస్త్రములు సమర్పించి పాలు పోసి, పూజలు చేయుదురు. పిల్లలు లేనివారు పుట్టకి, రావి చెట్టు మొదలు ప్రతిష్టించబడిన ప్రతిమలకి ప్రదక్షిణములు చేయవలెను. ఆమట్టిని పోత్తి కడుపుకి రాసుకొందురు. కొన్ని ప్రదేశాలలో కొబ్బరి చిప్పలకి రంగులు వేసి దారాలు కట్టి త్రిప్పుట ఆచారము. దీనిని గురించి కొన్ని కధలు కూడా ప్రచారములో ఉన్నవి.



పూర్వమొక కాపు పొలము దున్నుచుండగా ఆ నాగలి ఒక బొరియలో దిగబడి అందులో వున్న నాగుపాము పిల్లలు చనిపోయెను. తల్లి పాము వచ్చి చూసి పిల్లలు చనిపోవుట చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్లి రైతుని, పిల్లలను చంపి, కసి తీరక పెండ్లి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళెను. ఆనాడు నాగ పంచిమి అవటం వలన ఆమె అనంత నాగుని పూజ చేయు చుండెను. ఆతల్లి పాము కొంత సేపు వేచి యుండవలసి వచ్చెను. ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్దములు తినెను. దాని ఆరాటము తీరింది. కుమార్తె పూజ ముగించి కనులు తెరువగా విషయము పాము ఆమెకు విషయం చెప్పింది. ఆమె క్షమాపణ అడుగగా క్షమించెను. కుమార్తె తనవారిని బ్రతికించమని కోరగా ఆమెకి అమృతము ఇచ్చెను. తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె వారిని బ్రతికించుకుంది. అప్పటినుండు ఈరోజు నాగలితో దున్నరాదు, కూరలు కూడా తరుగ రాదనే నియమము వచ్చెను.

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము... పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి. వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వచ్చును. ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడును. ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు. ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము. వానాకాలము నందు ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలియును. పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు. ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము. ఈ మట్టి నందు కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే కలిసి సువాసనల వెదజల్లును. ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడును. ఇది పరిశీలించి చూడవలసిన విషయమే కదా.. ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట కలదు. ఇది ప్రయోగశాలలో పరిశీలించవలసిన విషయము. చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును. ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి చికిత్సలో ఒప్పుకున్న విషయమే.

మరి రావి చెట్టుకింద ప్రతిష్టించబడిన విగ్రాహాలకి కూడా పూజ చేస్తాము కదా.... రావి చెట్టు వృక్ష రాజము. నాగ ప్రతిష్ట రావి చెట్టు క్రింద చేస్తారు. ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు. అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేయును. దీనిని ఒజోన్స్ అంటారు. ఇది ప్రకృతి నియమము. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు కలిగి యుండును. మానవుడి ఆరోగ్యముపైన, స్త్రీల పైన ఇవి మంచి ప్రభావము చూపును.

అందువలన రావిచెట్టుని చుట్టుకొనుట, ప్రదక్షిణాలు చేయట నియమాలు చేసినారు. 40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా నుండును. నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది. నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్టించుతారు. అప్పుడు పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్టించుతారు. నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిది అయి ఉండాలి. రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపును. అందువలన నాగ పంచమి నాడు ఈ నియమాలు చేసినారు. మన పెద్దలు.వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML