
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 2 August 2015
శని అంటే భయమా...
శని అంటే భయమా...
మానవుడు నవమాసాలు తల్లి గర్భంలో ఉండి ..ఆ తరువాత నవరంధ్రములతో భూమి పై పడతాడు. యా పుట్టిన వాడి జీవితం పైన నవగ్రహముల ప్రభావం ఉంటుంది. ఈ గ్రహాలే శుభ - అశుభ ఫలాలు ఇవ్వడం వల్ల మనిషి కష్ట సుఖాలు అనుభవిస్తుంటాడు. గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అనుగ్రహం , ప్రతి కూలంగా ఉంటె అది ఆగ్రహం .
అయితే ఈ గ్రహాలలో కొన్నింటిని మనం అశుభగ్రహాలుగా, మరికొన్నింటిని శుభగ్రహాలు ఉన్నాయి. శని, రాహువు, కేతుడు, కుజుడు అశుభ గ్రహములుగాను.. రవి, గురు, శుక్ర, చంద్ర, బుధ గ్రహాలు శుభ గ్రహాలు గా జోతిష శాస్త్రం చెపుతుంది.. ముఖ్యంగా శని విషయంలో మనకు అనేక భయాలు ఉంటాయి.
శని అనగానే భయం . ఒక వ్యక్తి జీవితంలోకి శని ప్రవేశిస్తే రెండున్నరేళ్లు ఉంటాడు. అంటే ఒక్క రాశి వదిలేసే సమయం అన్నమాట. శని 3 -6 -11 స్థానాల్లో యోగం ఇస్తాడు. 1 - 2 -4 -8 12 ఈ స్థానాల్లో ఉన్నపుడు కష్టాలు కలిగిస్తాడు. వరుసగా 12-1-2 స్థానాల్లోకి జరిగే సంచారమే ఏలినాటి శని అంటాము. సాడేసాత్ (అనగా ఏడున్నర ఏళ్ళు ) అని పిలుచుకొనే ఈ దశకు ఒక ప్రత్యేకత ఉంది. జాగ్రత్తగా గమనిస్తే- అన్ని గ్రహాలలోకి మానవుడికి ఎక్కువ ఉపకారం చేసేది శనే. ఆయన వల్ల అనేక శుభాలు కలుగుతాయి. వైభవాలు వస్తాయి. అందుకే ఆయన్ని మాత్రమె '' శనీశ్వరుడు '' అని సంబోదిస్తాము.
శని పంచాజ్ఞ బీజాక్షర శక్తి కలవాడు. ఒక బీజంలో మఱ్ఱి చెట్టు దాగి ఉన్నట్లు గా ఒక మహా వృక్షం ఉన్నట్లు గా శని బీజ మంత్రం లో అద్భుత శక్తి దాగి ఉంటుంది. ఆ పంచాజ్ఞ బీజాక్షరాలను మానవుడు జపిస్తే శనేశ్చరుని కరుణ చేత ప్రకృతి నుంచి అనేక శుభాలు కలుగుతాయి. మానవుడు కోరిన పనులన్నీ విజయవంతంగా జరుగుతాయి. ప్రకృతి మానవుని స్వాధీనంలో ఉంటుంది. ఉదాహరణకు గర్భస్రావం అయ్యే మహిళలకు ఎన్నాళ్లకు సంతానం కలుగని మహిళ లకు ఈ బీజాక్షరాలు జపిస్తే అతి త్వరితంగా సంతానం కలుగుతుంది. వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, బ్యాంకులకు సంబంధించి త్వరగా పనులు త్వరగా కావాలన్నా.. ఉద్యోగస్తులకు పదోన్నతి కలగాన్నా.. ఆర్థిక ఇబ్బందుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి బయట పడాలన్నా ఈ బీజాక్షరాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే అత్యంత శక్తిమంతమైన ఈ బీజాక్షరాలను కేవలం గురుముఖంగానే పొందాలి. గురువు చెప్పిన పద్ధతిలో నియమనిబంధనలను ఆచరించాలి. అప్పుడు శుభం కలుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment