గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 August 2015

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్‌

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 
తా. లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.

లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌. 
తా. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్. 
తా. శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వేంకటేశవ్రునకు మంగళమగు గాక.

సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్‌. 
తా. సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌. 
తా. నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక.

స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌. 
తా. స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు, సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్‌. 
తా. పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

అకాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్‌. 
తా. కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృతస్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌. 
తా. పురుషులందరికిని తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక. 

దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌. 
తా. దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపజేసి జీవలోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌. 
తా. తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రములవలనను, ఆయుధములవలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌. 
తా. శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 
తా. శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక!

నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే
వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్‌. 
తా. శుద్ధజ్ఞాన స్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు శ్రీ కి నివాసస్థానమైన శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్‌. 

తా. మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML