ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Wednesday, 12 August 2015

వృక్షాలలో విశేషమైనది రావిచెట్టువదకాలం నుంచి వృక్షారాధనకు భారతీయ సంస్క్కృతిలో అధిక ప్రాధాన్యత ఉంది. రావిచెట్ట్టుకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రావిచెట్టు మాధవునకు ప్రియమైనది. మాధవ స్వరూపంగా కూడా రావిచెట్టును భావిస్తారు. ప్రాత: స్నానానంతరం రావిచెట్టుకు నీరు పోసి, పూజించి ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని పలుతంత్రాలలో పేర్కొనడం జరిగింది. సత్సంతానం కోసం అశ్వత్థ సమిథలతో హోమం చేయ్యాలని వసిష్ఠ హవన పద్ధతిలో చెప్పారు. అశ్వత్థ సమిధలతో హవనం చేయడం వల్ల అన్నిరోగాలూ నయమవు తాయని దేవీ భాగవతం చెబుతోంది.
అపశకునాలు ఎదురయినప్పుడూ, దురాక్రమణలు జరిగినపుడు, మశూచివంటివి ప్రబలినపుడు, ఆపదలు చుట్టుముట్టినపుడూ చెడును ఉపశమింప చేసేందుకు అశ్వత్థ పూజ చేయాలని వ్రతార్కం తెలియజేస్తూ పూజావిధానాన్ని ఎరుకపరిచింది. మణులు శిరోభూషణంగా ఉండే సర్పాలు రావిచెట్టుపైనే ఉంటాయి.
శత్రుబాధలు కలవారు 41 దినాలు రావిచెట్టు కింద కూర్చుని హనుత్సహస్ర నామ స్తోత్రం పారాయణ చేస్తే శత్రుభయం తొలగిపోతుందంటారు. హనుమంతుని స్మరిస్తూ రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల సంకటాలు, బాధల నుంచి విముక్తి లభిస్తుందని తులసీదాసు చెప్పిన సూక్తి. హనుమన్మంత్రాన్ని రావిచెట్టుకిందనే జపించాలనే నియమం ఉంది. నవగ్ర పూజల గురించి వింధ్యాచలం లోని భైరవకుండానికి చెందిన అక్షోభానంద సరస్వతీ మహారాజ్‌ చెబుతూ పూజ ముగిసిన అనంతరం పూజాసామాగ్రినంతటినీ ఒక కుండలో ఉంచి మూతపెట్టి రావిచెట్టు కింద పాతిపెడితే సమస్త గ్రహపీీడలూ తొలగిపోతాయన్నారు.
జపమాలను సంస్కరించేటప్పుడు తొమ్మిది రావి ఆకులతో విస్తరికుట్టి మధ్య ఆకులో జపమాలను ఉంచి మిగిలిన ఆకులను అష్టదళ కమలమువలె ఉంచి మధ్యనుండే జపమాలను పంచగవ్యంతో సంస్కరించి శుద్ధిచేయాలని మాలా సంస్కార నిధి అనే గ్రంథం తెలియ చేస్తోంది. ఏదైనా దీక్షారంభంలో చేసే కలశారాధన, కలశస్థాపనాది కార్యాల్లో పాలు ఉండెె (క్షీర వృక్ష శాఖలు) చెట్ల కొమ్మలు సమర్పించాలని, కలశంలో ఆ చెట్ల పెచ్చు, వేయాలని చెప్పబడింది. భూత, ప్రేతాలు ఆవహించినపుడు రావి ఆకులు వేసిన నీటితో స్నానం చెయ్యాలని చెబుతారు. పతి సౌఖ్యాన్ని, సమస్త సౌభాగ్యాలను కోరుకొనే స్త్రీలు సోమ వతీ అమావాస్య వ్రతం చేయాలని చెబుతారు.ఈ వ్రతాన్ని హేమాద్రి వర్షక్రియ కౌముది వ్రతార్కం, తదితర గ్రంథాలు ఎరుక పరిచాయి. మాఘమాసంలో అమావాస్య తిధి సోమవారం నాడు వచ్చిటనట్టయితే ఆ రోజు అశ్వత్థ మూలంలో విష్ణువును పూజించి రావిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి దాన ధర్మాలు చేయడంవల్ల మంచి జరుగుతుంది. రాహు మహాదశలో, శని అంతర్దశలో కష్టనష్టములు పీడలు, శత్రుభీతి, వంటి అనిష్టాలు సంభవించినప్పుడూ రావిచెట్టును పూజించి ప్రదక్షిణలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వృక్షాలలోకెల్ల విశేషమైన అశ్వత్థ వృక్షం నేను అని శ్రీకృష్ణపరమాత్ముడు గీతలో అర్జునునికి చెప్పడం జరిగింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML