గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 4 August 2015

మహాపతివ్రతా శిరోమణి ద్రౌపది :మహాపతివ్రతా శిరోమణి ద్రౌపది :

ద్వాపర యుగం నుంచి కలియుగానికి మారేసరికి ఈ యుగంలో అత్యంత వివాదాస్పదమైన మహిళ ఎవరు అంటే వెంటనే వచ్చే పేరు ద్రౌపది. భారతదేశంలో లిఖిత పూర్వక ఆధారాలతో కనిపించిన గర్వించదగిన మహిళలలో ద్రౌపది అతి కీలకమైనది. ఆమెలో స్త్రీత్వం పరిపూర్ణంగా ఉంది. ఆమె గురించి విశ్లేషణలు చేసినా, నవలలు రాసినా సరిగా అర్థం చేసుకుని రాసి ఉంటే అది వేరేగా ఉండేది. మాతృస్వామ్యం అంతమై పితృస్వామ్యం బలమూనుకుంటున్న రోజులలో కనిపించిన మహిళ ద్రౌపది.
నిజమైన మానుష ధన్మానికి, మానవతకు, మానవ మనస్తత్వానికి ప్రతీక ద్రౌపది. అచ్చమైన మనిషిగా పుట్టినది కనుకనే ఆమె నరుడు అని పేరుతెచ్చుకున్న అర్జనుని చేపట్టింది. రావణాసురుడు సీతను లంకకు అపహరించుకుపోయి పెళ్ళి చేసుకోమని ఎంత వత్తిడి చేసినా, ఎన్ని విధాల ప్రలోభ పెట్టినా లొంగనట్టే ద్రౌపది కూడా దుర్యోధన, కీచక, సైంధవుల వంటి ఎందరో పరమవీరులు రాజకీయంగా వత్తిడితెచ్చినా, ఆమె అందానికి దాసులై వెంటపడినా, వేధించినా అన్నిటినీ సహించిందే తప్ప ఎట్టిపరిస్థితులలోనూ ధర్మం దాటలేదు. తన భర్తలను సైతం కట్టుదాటిపోకుండా కట్టడిచేసి అంతిమ విజయం ధర్మదేవతకే అంకితం చేసింది. తెగింపు, పంతం, పట్టుదల, అసహాయత, అబలత్వం, పరమకారుణ్యం, పరిపూర్ణమైన మాతృత్వానికి ఆమె ప్రతీకగా నిలిచింది. ఇదంతా ఆమె వ్యక్తిత్వం.
' ఆది పర్వం - సప్తమాశ్వాసం 'లో అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి.
ద్రుపద మహారాజు, ద్రోణుడు బాల్య స్నేహితులు. ఇద్దరు ఒకే గురువు ఐన అగ్నివేశుని వద్ద విద్యాభ్యాసం చేసారు. విద్యాభ్యాసం తరువాత ద్రుపదుడు రాజ్య పాలన చేస్తున్న సందర్భంలో కటిక బీదతనం భరించలేని ద్రోణుడు బాల్య మిత్రుడి వద్దకి సహాయం అర్ధించి వస్తాడు.
ద్రుపదుడు బాల్య మిత్రుని అపహాస్యం చేసి సహాయము చెయ్యక పంపి వేస్తాడు. అందుకు కోపించిన ద్రోణుడు అర్జనుడిని పంపి ద్రుపదుడిని బంధించి తన వద్దకు పిలిపించుకుని అవమానించి పంపుతాడు. అవమానం భరించలేని ద్రుపదుడు - అసమాన ధనుర్విద్యా వేత్త ఐన అర్జనుడివంటి అల్లుడు - ద్రోణుడిని చంపగలిగే కొడుకు కావాలని కోరికతో యాజుడనే బ్రహ్మర్షిని ఆశ్రయిస్తాడు. ఆ యాజుడు ద్రుపదుడి చేత " కాంక్షిత సిద్ధి " అనే క్రతువు చేయిస్తాడు. అందునుండి ద్రుష్టద్యుమ్నుడు, ఆతరువాత అతిలోక సౌందర్య రాశి ఐన కన్యక అవతరించారు.
ద్రౌపది, దుష్టద్యుమ్నుడు ల జననం నన్నయగారి మాటల్లోనే ...
క. జ్వాలాభీలాంగుఁడు కర, వాలబృహచ్చాపధరుఁ డు వరవర్మ కిరీ
టాలంకారుఁ డు వహ్నియ, పోలె రధారూడుఁ డొక్క పుత్రుఁ డు పుట్టెన్
మరియు.....
తరలము. కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ యు
త్పలసుగంధి లసన్మహోత్పల పత్ర నేత్ర యఠాళ కుం
తలవిభాసిని దివ్యతేజము దాల్చియొక్క కుమారి ద
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ ప్రసన్నమూర్తి ముదంబుతోన్
నీలోత్ఫల శ్యామలాంగి ఐన ద్రౌపది ఆవిర్భవించగానే యఙ్ఞవాటిక అంతా నల్ల కలువల పరిమళాలతో నిండిపోయింది. అరాళవినీల కుంతల- ఆకర్ణాంత పద్మ పత్ర విశాలాక్షి, అమృతోపమ ధరహాస వదనారవింద అయిన ఆదేవి శ్రీదేవిలా భాసించింది.
ఆ విధంగా ఆ బాలబాలికలు జన్మించగానే ఆకాశవాణి - ' ద్రోణుడిని నిర్జించే ఈ బాలుడు ద్రుష్టద్యుమ్న నామంతో ద్రుపద పుత్రునిగా ప్రసిద్ధుడవుతాడు. ఈ శ్యామలాంగియైన బాలిక ద్రుపద నందనయై ' కృష్ణ ' అనే పేరున వర్ధిల్లి- అర్జునుడిని వివాహమాడి ఉభయ వంశాలను పునీతం చేస్తుంది ' అని పలికింది.
ఆ కృష్ణా దేవినే - ద్రుపద నందన కనుక " ద్రౌపది " అని, పాంచాల రాజకుమారి కనుక " పాంచాలి " అనీ, యఙ్ఞకుండాన ఆవిర్భవించింది కనుక " యాఙ్ఞసేనీ " అని కూడా పిలుస్తారు.
ఎందుకు ఐదుగురిని వివాహం చేసుకోవటం ?
ఈ విషయం కూడ భారతంలో పంచేంద్రియోపాఖ్యానం పేరున వివరించబడింది. పాండవులు ఐదుగురి ఒకే స్త్రీ ని ఎలా వివాహము చేసుకోవాలి అని సందేహించినపుడు కృష్ణద్వైపాయనుడు వారి సమస్యకు చెప్పిన సమాధానమే ఈ పంచేంద్రియోపాఖ్యానం.
పూర్వం మౌధ్గల్యుడనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు ఇంద్రసేన. ఆమె అందగత్తె, ఆరోగ్యవతి, చెక్కు చెదరని యవ్వన ఖని.
అయినా ఆమె పాతివ్రత్య విషయంలో ఏ ఒక్కరికీ తీసిపోనిదై ఉండేది. మౌధ్గల్యునికి కుష్టువ్యాధి సోకింది. అది ముదిరిపోయి చూడటానికే భయంకారంగా ఉండేవాడు. అయినా ఆమె పతివ్రతా ధర్మాన్ని విస్మరించకుండ సర్వోపచారాలు చేసేది.ఒకనాటి భోజనంవేళ మౌధ్గల్యుడి యొక్క బొటనివేలు రోగంతో కుళ్ళి, కీళ్ళూడి విస్తరిలో పడిపోయింది. అయినాసరే, ఆమె ఏవగించుకోకుండా దాన్ని పక్కకి పెట్టి ఎంగిలిని భుజించింది. ముని సంతోషించి ఏదైనా వరం కోరుకో మన్నాడు. అందుకు ఆమె ఆమె కోరిక ప్రకారం ఆ ముని తన తపోబలంతో ఐదుగురు యువకులుగా మారి ఆమె కోరిక తీర్చాడు. తరువాత తపోలగ్నుడై పరమ పదించాడు. కామం తీరని ఆ కాంతామణి దుఃఖిస్తు కాలం గడిపి మరణించింది.
మరు జన్మలో ఆమె కాశీరాజు కుమార్తెగా ఉద్భవించింది. దురదృష్టవశాత్తూ ఆ జన్మలో ఆమెకు వివాహం కాలేదు. ఆ దుఃఖంతో ఆమె పరమశివుడి కోసం తపించింది. శివుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడా పిల్ల " పతిం దేహి - పతిం దేహి - పతిం దేహి - పతిం దేహి - పతిం దేహి " అని ఒకే స్వరంలో అయిదు సార్లు అర్ధించింది. " తధాస్తు. వచ్చేజన్మలో నీకు అయిదుగురు భర్తలు లభిస్తారు " అన్నాడు శివుడు. ఆమె ఆశ్చర్యపోయింది.
" దేవా! భర్తను ఇమ్మని ఐదుసార్లు అడిగాను గాని, అయిదుగురు భర్తల నిమ్మని అడగలేదు. కానీ నువ్వు అలా అనుగ్రహించావు. అదే తధ్యమైతే ఆ పతుల సహచర్య వేళ ప్రత్యేక శుశ్రుతా భాగ్యము, కామేచ్చాతృప్తి, నిత్య కన్యత్వ సిద్ధి, సౌభాగ్య ప్రాప్తి కలిగేలా అనుగ్రహించు " అంది.
" అలాగే. నీవు వెళ్ళి ఇంద్రుడి నిక్కడికి తీసుకురా " అన్నాడు శంకరుడు.
కాశీరాజకుమారి ఆకాశగంగా తీరం చేరి- అక్కడ దుఃఖిస్తు కూర్చొని ఉంది. ఇంద్రుడు ఆమె దుఃఖానికి కారణం అడిగాడు. తనతో వస్తే చెపుతా అంది.
ఇంద్రుడు ఆమెను అనుసరించాడు. ఒకచోట ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి పాచికలాడుతున్నాడు. అతడు శివుడని గుర్తించలేని ఇంద్రుడు తనను గౌరవించలేదని ఆ యువకుని తూలనాడాడు. అందుకు అలిగిన శివుడు ఇంద్రుని గర్వం అణచటానికి అక్కడున్న హిమశిఖరాన్ని తొలగించి తెమ్మన్నాడు. ఇంద్రుడలా చెయ్యగానే- ఆ శిఖరం వెనక అచ్చం అతనివలనే ఉన్న నలుగురు ఇంద్రులు కాన వచ్చారు. అప్పుడు శివుడు ఇంద్రుని చూసి " ఇంద్రా ! ఆ నలుగురితోను కలిసి నువ్వు కూడా భూలోకంలో పుట్టు. మీరైదుగురూ మానవులుగా పుట్టాలి " అన్నాడు.
అందుకు అమరేశ్వరుడు భయపడి " హే శివా ! నేను అవతరిస్తే స్వర్గపాలనం చెడిపోతుంది. అందువల్ల నా అంశతో మరో ఇంద్రుడిని వెలయిస్తాను. అతనితో కలసి ఈ నలుగురిని కూడా భూమిపై అవతరించమను " అని కోరాడు. శివుడూ అంగీకరించాడు. ఇంద్రుడు తన నుండి మరొక ఇంద్రుడిని ఆవిష్కరించి తను స్వర్గానికి వెళ్ళి పోయాడు. ఈ విధంగా యేర్పడిన పంచేద్రులు యమ , వాయు, ఇంద్రాశ్వనీ దేవతల ప్రేరణ వలన పంచపాండవులుగా జన్మించారు. ఆ పంచేద్రుల స్వర్గ లక్ష్మి ద్రౌపదిగా జన్మించింది.
పేరుకి ఐదుగురు భర్తలైనా అందరూ ఇంద్రుని అంశలే ... ఈ విధంగా పేరుకి ఐదుగురు భర్తలైనా అందరూ ఇంద్రుని అంశలే కాబట్టి ద్రౌపదికి ఒకరే భర్త ఐదురూపాల్లో ఉన్నట్టు నిరూపించారు.
ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి.
ద్రౌపది అసలు పేరు కృష్ణ. ఈ పేరు సాంగత్యం ఉన్నందుకోయేమోగాని ఆమె శ్రీకృష్ణుని అభిమాన పూర్వకమైన చెల్లెలు కాగలిగింది. ఎనలేని సాయం అందుకోగలిగింది. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో చేసిన అనేక లీలలలో కీలకమైన లీల ద్రౌపది మాన సంరక్షణ సమయంలో ఎడతెగని చీర దానం చేసి చరిత్ర సృష్టించాడు. ఈమె పాంచాల రాజు ద్రుపదుని కుమార్తె. పాంచాల రాకుమారి కనుక ఆమెను పాంచాలి అని కూడా పిలిచేవారు. ద్రుపదుని కుమార్తె కనుక ఆమెను ద్రౌపది అని కూడా పిలిచారు. ఈ పేరే బాగా స్థిరపడి జనవ్యవహారంలో నిలిచింది. పాండవ పత్ని అయినా అయిదుగురు మహా వీరులకు ఇల్లాలైనా వాళ్ళ భార్యగా కాక పుట్టింటి సంబంధాన్ని సూచించే పేరుతో ప్రసిద్ధికెక్కడం విశేషం. అది ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనం. అంటే మహావృక్షాల వంటి పాండవుల నీడలో ఆమె గడ్డిపరకలా మారి తన ఉనికిని పోగొట్టుకోకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న వ్యక్తిగా లోకం గుర్తించిందనడానికి ఇదే ఉదాహరణ. ఆమెను పాంచాలి అన్నా అదీ పుట్టింటి నుంచి సంక్రమించిన పేరే కావడం గమనార్హం. పెద్దలు పెట్టింది పేరు కాదని, పిల్లలు ఎదిగితెచ్చుకునేదే అసలు పేరని పెద్దలు అంటారు. ఇది ద్రౌపది అక్షరాలా వర్తిస్తుంది. తండ్రి తరఫు పురోహితులు ఆమె శరీరపు రంగును దృష్టిలో ఉంచుకొని పెట్టిన కృష్ణ పేరు ప్రచారంలో మిగలలేదు. ద్రుపదుడు ఆమె కోసం తపించి యజ్ఞఫలంగా పొందాడు. అంతటి శక్తిమంతురాలైన బిడ్డ కనుకనే తండ్రిపేరును నిలబెట్టడమే కాదు పుట్టింటి గౌరవానికి సంకేతంగా నిలిచింది. ద్రౌపది పేరే జనం నోట్లో పడి ద్రోవదిగా మారింది. పురాణ పరిజ్ఞానం సరిగాలేక తడబడే వారు ఆమెను ద్రౌపతిగా పిలుస్తారు. పతి అన్నమాటే పదిగా మారిపోయి ఉంటుందని వారి అనుమానం. అది నిజం కాదు. అలాగే పాంచాలి పేరు కూడా అపోహలకు గురైంది. పాంచ్‌ అంటే అయిదు కనుక అయిదుగురి భార్య కనుక పాంచ్‌ ఆలి అనే పేరే పాంచాలిగా మారిందని కొందరు అంటుంటారు. ఈ రెండు కేవలం అపోహలతో ప్రచారంలోకి వచ్చిన పేర్లు.
వరమున పుట్టిన ద్రౌపది మీద అభాండాలు వేయటం తగదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML