ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 1 August 2015

దశపాపహర దశిమి


దశపాపహర దశిమిదశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూచేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్’ అని ఉంటుంది. అనగా ఈరోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా ‘కాశీ’లో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!


గంగావతరణ జ్యేష్ఠ శుక్ల దశమీ బుధవారం హస్తా నక్షత్రంలో అయినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది అంటున్నారు.వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణం జరిగిందని గ్రంథాంతరాల్లో ఉం ది. గంగావతరణకు ఇది మరొక తిధి. ఈరోజు గంగావతరణ అయినా కాకపోయినా ఈ పండుగ గంగానదిని ఉద్దేశించి చేయబడింది కావడం నిజం.


ఈ వ్రత విధానం (దశపాపహర దశమి) స్కంధ పురాణంలో ఉంది. గంగాదేవి కృపను సంపాదించటమే ఈ పండుగప్రధానోద్దేశం. దీన్ని గంగాత్మకమని అంటారు. గంగానీరు ఎంతో పవిత్రంగా ఎన్నినాళ్ళు న్నా చెడిపోదు. అసలు గంగానదితీరాలు అనేకం తీర్థ స్థలాలు. కాశీ, నాశిక్, హరిద్వార్, మధుర, ప్రయాగ మొదలైన నదీ తీరాల్లో ఈ పం డుగ బాగాచేస్తారు. అక్కడ గంగా దేవి ఆలయాలున్నాయి. గంగ పూజ కూడా అక్కడ చేస్తారు. ఈ రోజున గంగా స్నానం చేసి పూజచేసి గంగా స్తోత్రం పఠిస్తే దశ విధ పాపాలు తొలుగుతాయి అని వ్రతగ్రంధం.


ఈ గంగాత్మక దశమికి మరోపేరు దశపాపహార దశమి అని; దశ హర దశమి అని కూడా అంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం


శ్లోః లింగం దశాశ్వ మేధేశం
దృష్ట్యా దశహరాతి ధే
దశ జన్మార్జితైః పాపైః
త్యజ్యతే నాత్రసంశయః
దశహర తిధినాడు దశాశ్వ మేధ ఘట్టంలోని లింగము చూచినట్లయి తే లోగడ పది జన్మలలో చేసిన పాపంనిస్సందేహంగా నశిస్తుందని తాత్పర్యం.


స్నాన సంకల్పంలో కూడా ఈనాడు ‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర స ముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరప్రీత్యర్ధం దహ హర మహా పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే’’ జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన పది విధాలైన పాపాలుపోగొట్టే స్నానమని దీని భావం. పూజ కూడ పది పూవ్వులతో, పది రకాల పళ్ళతో నైవేద్యంగా చేస్తారు అని చెబుతారు.


గంగా దేవి పూజా మంత్రం


“ఓం నమో భగవత్యై దశపాపహరాయై
గంగాయై నారాయన్యై,
రేవత్యై, శివాయై, దక్షయై,
అమృతాయై, విశ్వరూపిన్యై,
నందిన్యైతే నమో నమః “


షోడశపచర విధిచే గంగాపూజ చేస్తూ అందులో ఈ మూల మంత్రా న్ని అహోరాత్రులు అయిదు వేలసార్లు జపించి వ్రతంపూర్తి చేయాలి.


జేష్ఠశుక్ల పౌర్ణమి నుంచి దశమి దాకా స్ర్తీలు పిండి వంటలు చేస్తారు. ప్రతి రోజు పదేసి భక్ష్యాలు గురువులకి దక్షిణలుసమర్పిస్తారు. పద కొండునాడు (ఏకాదశి) ఉపవాసం వుండి ఆ సమయంలో పచ్చి మంచి నీరు కూడా తాగకూడదు. అదేనిర్జలైకాదశి.


ఈ నిర్జలైకాదశి ఆదిలో భీముని వల్ల ఏర్పడినట్లు పురాణ గాధ ఉంది.
జేష్ఠమాసంలో ఎండలు ఎక్కువగా వుంటాయి. అలాంటి ఘోరమైన వేసవిలో ఏకాదశి నాడు పచ్చి మంచి నీరుపుచ్చుకోకుండ ఉపవాసం ఉంటారు. అందుకే దీనికి ‘నిర్జలైకాదశి’ అని పేరు వచ్చింది.
పురాణ గాధలో ‘భీముడు తిండిపోతు. ఒక్క పూట కూడా తినకుండా వుండలేడు. దశమి నాడు ఏకభుక్తం మాత్రం చేసిఏకాదశి నాడు ఒక పూట అయినా భోజనం లేకుండా అతను వుండలేడు అనే వారు. దీనితో వ్యాసుల వారిని సంప్రదించినభీమునితో ‘నీవు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిన నీళ్ళు కాని, అన్నం కాని తినకుండా వుండు’. అలా చేస్తే ఏడాదిలో 24 ఏకాదశివ్రతాలను చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని చెప్పెను. భీముడు అట్లే చేసాడు. దీనివలన ఇరువది నాలుగుఏకాదశుల ఫలం అతను పొందెను. అంటే ఈ నిర్జల ఏకాదశికి అంతటి ఫలితం మహత్తు వున్నాయి. ఇంకా వివరంగావిఫులంగా తెలియాలంటే ‘చతుర్వర్గ చింతామణి’ అను గ్రంధాన్ని చూడవచ్చు!


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML