గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 1 August 2015

ఆది శక్తి అన్నపూర్ణా దేవి ...ఆది శక్తి అన్నపూర్ణా దేవి ...

కర్నాటక రాష్ట్రం లో పడమటి కనుమలు ప్రక్రుతి అందాలకు నిలయాలు .అక్కడే పవిత్ర దేవాలయాలన్నీ ఉండటం విశేషం .ఇప్పుడు హొరనాడు లో వెలసిన అన్న పూర్ణాదేవి ఆలయాన్ని గురించి తెలుసు కొందాం .కాశీ అన్నపూర్ణ తో బాటు అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం.


కర్నాటక లోని చిక్కమగలూర్ జిల్లాలో హొరనాడు అనే పంచాయితీ గ్రామం లో అన్న పూర్నేశ్వారి దేవి కొలువై ఉంది .జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు స్తాపించిన విగ్రహం ఇది తరువాత 1973 లో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. బెంగుళూర్ కు సుమారు మూడు వందల కిలో మీటర్ల దూరం లో పరవశించే ప్రక్రుతి లో హొరనాడు ఉంది ..మంగలూర్ కు నూట ముప్ఫై కిలో మీటర్లు


ఈ ఆలయం లో అన్నపూర్ణా దేవిని దర్శించాలను కొన్న యాత్రికులు కుల మత భేదాలకు అతీతం గా పై చొక్కా ,బనీనులు లేకుండా వచ్చి దర్శించుకోవాలనే నియమ ఉంది .దీన్ని అందరు భక్తులు శ్రద్ధ గా పాటిస్తారు ..బుజం మీద ఖండువా లేక తువ్వాలను కప్పుకొని భక్తీ గౌరవాల తో అమ్మ వారిని దర్శించి తరిస్తారు .

అన్నపూర్ణా దేవి విగ్రహం పూర్తిగా బంగారం తో చేసి ఉంటుంది .ఆ మూర్తి అతి సుందరం గా రమణీయం గా కృపా విలసనం గా చైతన్య స్పూర్తి గా దర్శన మిస్తుంది .అన్న పూర్ణా దేవి ని ఒక సారి దర్శించిన వారి ఇంట ఎప్పుడూ అన్నానికి కొదవ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ దేవి ప్రభావం గొప్పది .ఒక సారి శివుడు శాపానికి గురి అయితే అన్నపూర్ణ ను దర్శించి శాప విముక్తుడైనట్లు ఐతిహ్యం ఉంది .

కొండలపై ఉన్న ఘాట్ రోడ్లు ,లోయలు, అరణ్యాల గుండాపచ్చ్చదనం పరుచుకొన్న ప్రాంతాలను దాటుతూ ఇక్కడి వస్తూ ఉంటె చెప్ప లేని ఆనందం తో మనసు ఉప్పొంగి పోతుంది .ఆలయ పద్ధతులు చాలా విశేషం గా ఆకర్షించి ,పవిత్ర భావం అంతటా కనీ పిస్తుంది అమ్మ వారికి భక్తులు బియ్యాన్ని నైవేద్యం గా ఇవ్వటం ఇక్కడి ఆచారం. పూజారులు భక్తులకు అమ్మవారికి నివేదించిన బియ్యాన్ని ప్రసాదం గా తిరిగి ఇస్తారు ఈ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని వండుకొనే బియ్యం లో కలుపు కొని తింటారు .కూకే లో సుబ్రహ్మణ్య దేవాలయం అరేబియా సముద్ర తీరం లో ఉంది దీన్ని, ఉడిపిని ,మంజు నాద దేవాలయాన్ని శృంగేరి ని దర్శించి భక్తులు ఎంతో సంత్రుప్తికి లోనౌతారు ..అమ్మ వారిని’’ ఆది శక్త్యాత్మక అన్న పూర్నేశ్వరి’’ గా భావిస్తారు .అన్నపూర్నేశ్వరీ దేవి ని దర్శించిన అనుభూతి జీవితం లో మర్చి పోలేము .ఎత్తైన బంగారు విగ్రహం, దూరం నుండే మనల్ని ఆశీర్వదించే చల్లని చూపులు , మనకు అభయ ప్రదం గా ఉంటుంది ఇది ఇక్కడి ప్రత్యేకత .

నవరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుపుతారు . అక్షయ తృతీయ ను విశషం గా చేస్తారు . కార్తీక మాసం లో దీపోత్సవాన్ని కన్నుల పండువు గా నిర్వహిస్తారు . నవ రాత్రులలో నవ శక్తి రోపాలుగా అమ్మ వారిని అలంకరిస్తారు.ఫాల్గున మాసం లో రధోత్సవం చూసి తరించాల్సిందే . ఆలయ కమిటీ ఆధ్వర్యం లో స సామూ హిక ఉపనయనాలు, సామూ హిక వివాహాలు జరిపిస్తారు .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML