రాయదుర్గం : ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం పక్కనే శ్రీ జంబుకేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. పూర్వం ఒక వర్తకుడు ఈ దారిలో వెళుతూ ఇక్కడ ఒక రోజు మజిలీ చేశాడట. వర్తకుJambukeswara Samy Templeని పరివారము ఇచ్చట గల రాతితో పాటు మరో రెండు రాళ్లు నుంచి వంట చేసుకున్నారట. అప్పుడు వంటకాలు చేసిన వారి శరీరం మండి పోసాగిందట. ఆ రోజు రాత్రి వర్తకునికి స్వామి కలలో కనిపించి నేను ఇక్కడ నెలకొన్న జంబుకేశ్వరుణ్ణి, నాపై పాత్రయుంచి వంట చేయించావు, నాకు ఇచ్చట ఆలయాన్ని నిర్మించమని శ్రీ స్వామివారు చెప్పారట. ఆ వర్తకుడు శ్రీ స్వామి వారి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించినాడని ప్రతీతి. ఇది స్వయం ఉద్భవ లింగం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ద —- రోజున శ్రీ స్వామి వారి రథోత్సవం నిర్వహించబడుతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment