రాయదుర్గం / గుంతకల్లులోని పుణ్యక్షేత్రాలు: –
ప్రత్యేక శోభతో నేమకల్లు, మురడి, కసాపురం
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలోని మురిడి, నేమకల్లు, అలాగే గుంతకల్లు సమీపంలోని కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారిని శ్రావణ మాసంలో ఒకే రోజు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భక్తులు విశ్వసిస్తారు.
Sri Muridi Anjaneya Swamy Temple
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీ మురిడి ఆంజనేయస్వామి దేవాలయం
వ్యాసరాయలు తన దేశ పర్యటనలో భాగంగా కాసాపురం నెట్టికంటి ప్రాంతానికి వచ్చి భూగర్భంలో ఉన్న శ్రీఆంజినేయస్వామి శిలను వెలికి తీసి ప్రాణ ప్రతిష్ట చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒకే నక్షత్రంలో మురడి ఆలయంలో శ్రీఆంజినేయస్వామి మూలవిరాట్తోపాటు నేమకల్లు, కసాపురం ఆలయాల్లోని శ్రీఆంజినేయస్వామి విగ్రహాలను కూడా వ్యాసరాయలు ప్రతిష్టించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ మూడు దేవాలయాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ఆలయాలను క్రీ.పూ 450 సంవత్సరంలో ఆలయాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఒకే నక్షత్రంలో ప్రతిష్టించిన శ్రీఆంజినేయస్వామి ఆలయాలను పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శనివారాల్లో దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు. ఈ మూడు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే విధంగా ఆర్టిసి అధికారులు కూడా ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాలకు వెళ్తారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, వసతిసదుపాయాలు ఉన్నాయి. అన్నదానం, ప్రసాద పంపిణీకి ఇబ్బందిలేకుండా సదుపాయాలు చేశారు. శ్రీఆంజినేయస్వామిని తమల పాకులతో అలంకరించి పూజిస్తారు. ఈ ఆకుపూజలను నూతన దంపతులు కుటుంబ సమేతంగా కిరిటాలు, తోరణాలకు ఆకులను అమర్చి పూజలు చేస్తారు.
క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే:
మురడి శ్రీఆంజినేయస్వామి దర్శనం:
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకలోని డీ హీరేహాళ్ మండల పరిధిలో ఉన్న మురడి గ్రామంలో శ్రీ మురిడి ఆంజినేయస్వామి ఆలయం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి అనంతపురం నుంచి రాయదుర్గం మీదుగా వెళ్ళాలి. రాయదుర్గం నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. కర్ణాటక ప్రాంతామైన బళ్లారి నుంచి 45 కిలోమటర్ల దూరంలో ఉంది.
నేమకల్లు శ్రీఆంజినేయస్వామి దర్శ
Sri Nemakallu Anjaneya swamy temple 2
శ్రీ శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత శ్రీ నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయం
నం:
రాయదుర్గం తాలూకలోని బొమ్మనహాళ్ మండలంలో నేమకల్లు గామంలోని శ్రీ నేమకల్లు ఆంజనేయస్వామి జిల్లా కేంద్రానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి చేరుకోవాలంటే అనంతపురం నుంచి కళ్యాణదుర్గంకు చేరుకొని అక్కడి నుంచి కణేకల్లు క్రాస్ మీదుగా బళ్ళారికి వెళ్ళే బస్సు ఎక్కి నేమకల్లు రూటులో దిగాలి. అక్కడి నుండి ఐదు కిలోమీటర్లు ఆటోలు, ప్రైవేట్ బస్సుల్లో ఆలయం వద్దకు చేరుకోవాల్సి ఉంది.
కాసాపురం శ్రీఆంజినేయస్వామి దర్శనం:
గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలోని నెట్టికంటి శ్రీ కాసాపురం ఆంజినేయస్వామి ఆలయానికి వెళ్ళాలంటే అనంతపురం నుంచి గుంతకల్లుకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల సౌకర్యం ఉంది. ఈ ఆలయంలో అనంతపురం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.
హనుమాన్ దర్శన్ పేరుతో ఆర్టిసి బస్సులు:
శ్రావణ మాసంలో హనుమాన్ దర్శన్ పేరుతో మూడు ఆలయాలను దర్శించుకోవడానికి ఆర్టిసి ప్రత్యేక ప్యాకేజీ కింద బస్సులను నడుపుతుంది. ఉదయం 6 గంటల నుండి అనంతపురం, రాయదుర్గం, గుగంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, కర్నూలు తదితర డిపోల నుంచి ఆర్టిసి బస్టాండ్లలో బయలుదేరి సాయంత్రానికి మూడు దేవాలయాలను దర్శనం చేయించి ఆయా కేంద్రాలలో వదులుతారు. రాయదుర్గం నుంచి బయలుదేరు బస్సులు మొదటగా మురడి అనంతరం నేమకల్లు, కసాపురం ఆలయాలను దర్శించుకుని రాయదుర్గం చేరుతాయి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 14 August 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment