ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 4 August 2015

శ్రీ వ్యాసరయలవారు అంజనేయ స్వామి వారి ద్వాదశ నామ బీజాక్షరం తో యంత్రం రాసి దానిలో శ్రీ స్వామి వారి నిజరూపం చిత్రించగా స్వామి వారు ఆ యంత్రం లో బందిన్చాబడినారు . .

 శ్రీ వ్యాసరయలవారు(తదనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ,మంత్రాలయం ) హంపి క్షేత్రం లో తుంగభద్రా నది తీరం లో కర్మనుష్టానం చేస్తూ తను ధరించే గంధం తో తన ఎదురుగా ఉన్న శీలా పైన ఆంజనేయ స్వామి రూపం చిత్రించాడు . అది నిజ రూపం దరించి వెళ్తూ ఉంది . ఈ విధంగా అయదు సార్లు చిత్రించగా అదే విదంగా జరిగింది . చివరికి శ్రీ వ్యాసరయలవారు అంజనేయ స్వామి వారి ద్వాదశ నామ బీజాక్షరం తో యంత్రం రాసి దానిలో శ్రీ స్వామి వారి నిజరూపం చిత్రించగా స్వామి వారు ఆ యంత్రం లో బందిన్చాబడినారు . .
అప్పుడు స్వామి వారు వ్యాస రాయల వారు స్వప్నం లో స్వామి కనిపించి నేను ఈ క్షేత్రం లో ఉన్నాను దాన్ని తీసి ప్రతిస్టించమని చెప్పగా .. వ్యాసరయలవారు ఈ ప్రాంతాన 732 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిస్తించాడట. చిప్పగిరి గ్రామం లోని శ్రీ భోగేశ్వర స్వామి గుడి లో వ్యాసరయలవారు నిద్రిస్తుండగా నేను ఇక్కడ నుండి దక్షిణ దిక్కుగా కొద్దిరుపం లో భూమి లో ఉన్నాను నన్ను తిరిగి ప్రతిస్టించమని పలికారు . వ్యాసుల వారు దారి చూపించమని అడగగా ఆంజనేయుడు ప్రస్తుతం నా పైన ఎండిన వేప చెట్టు ఉంది అది నువ్వు రాగానే పచ్చగా చిగురిస్తుంది అని మార్గం సూచించారు .
వ్యాసరాయల వారు కసపురానికి విచ్చేసి శ్రీ స్వామి వారి మిద ఉండే వేప వృక్షానికి సమీపించగానే అది పచ్చగా చిగురించింది అప్పుడు వ్యాసుల వారు ఆ ప్రాంతాన్ని తవ్వించి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిస్టించాడు అని స్థల పురాణం చెబుతుంది . కసాపురం గ్రామానికి దగ్గరగా ఉండటం వలన కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు . నెట్టి కల్లు ( మంచి రాయి ) లో అవిర్బవిన్చినందున శ్రీ స్వామి వారికి నేట్టికంటి ఆంజనేయ స్వామి అనే పేరు ప్రసిద్దమైనది.
నేట్టికంటి అనగా ఒక కన్ను కలవాడని అర్థం . విగ్రహం లో స్వామి కుడి కంటి తో భక్తులను చూస్తూ వారి మనోభిస్టాలను నెరవేరుస్తున్నారు . స్వామి వారు కోరిన కోరికలు, వారి భాదలను తీర్చే కొంగు బంగారం.





No comments:

Powered By Blogger | Template Created By Lord HTML