గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 5 August 2015

షొడశోపచార పూజావిధి పరిచయంషొడశోపచార పూజావిధి పరిచయం

1.ఆవహనము: మన్స్పూర్తిగా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
2.ఆసనము: వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
3.పాద్యము: కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
4.అర్ఘ్యము: చేతులు పరిశుబ్రపరచడం.
5.ఆచమనీయము: దాహము(మంచినీళ్ళు) ఇచ్చుట.
6.స్నానము: ప్రయాణాలసట తొలగే నిమిత్తం.
7.వస్తము: స్నానంతరం ఫొ(మ)డి బత్తలనివ్వడము.
8.యజ్ఞోపవీతం: మార్గమధ్యమంలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం.
9.గంధం: శరీరం మీద సుగంధాన్ని చిలకడం.
10.పుష్పం: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు
11.ధుపము: సుగంధమయ వాతావరణాన్ని కల్పించడం
12.దీపము: పరస్పరం పరిచయానికి అనుకూలతకోసం
13.నైవేద్యము:తన స్థాఇననుసరించి తనకై సాధించిన దానినే ఇష్టదైవానికి కూడా ఇవ్వడం.14.తాంబూలము: మనం భక్తితోఇచ్చిన పదార్దాలవల్ల వారి ఇష్టాఇష్టాలకి(రుచులకి)కలిగే లోపాన్ని తొలగించడం. 15.నమస్కారము:గౌరవించడానికి సూచన
16.ప్రదక్షిణము: ముమ్మూర్తులా వారి గొప్పదనాన్ని అంగీకరించడం
సర్వ దేవతా నిత్య పూజా విధానము
పసుపు గణపతి పూజ
ఓంగురు ర్బ్రహ్మ గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షా త్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఇంటిలో ఈశాన్యమూల స్థలమును శుద్ది చేసి అలికి,బియ్యపుపిండితోగాని,రంగుల చూర్ణములతోగాని ముగ్గులు పెట్టి దైవస్థపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగా గాని,మరీ మట్టుగా గాని ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి,కుంకుమతో బొట్టు పెట్టి, వరిపిండితో చక్కగా ముగ్గు వేయాలి.సాదారణంగా అష్టదళపద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని,చిత్రపటమునుగాని ఆ పీటపై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసుకోవాలి.ఆ గణపతికి కుంకుమబొట్టు పెట్టాలి.పిదప ఒకపళ్ళెరంలో బియ్యంపోసి,దానిపై ఒక తమలపాకునుంచి,పసుపు గణపతిని ఆ తమలపాకుపై ఉంచాలి.పీటమీద నైఋతి దిశలో దీపారాధన చేసి,అగరువత్తులు వెలిగించి,ముందుగా యజమానులు(పూజచేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి

కేశవనామాలు-ఆచమనం:కుడి చేతి చూపుడు వ్రేలుకు,నడిమి వ్రేలుకు మద్యన బొటన వ్రేలుంచి,చూపుడువేలును బొటన వ్రేలుపైకి మడిచి తక్కిన మూడు వ్రేళ్ళూ చాపి,అరచేతిని దోనెలా మలచి ఉద్దరిణెడు ఉదకాన్ని యెడమచేతితో తీసుకుని కుడిచేతిలో పోసుకుని,ముందుగా
1. "ఓం కేశవాయస్వాహ" అని చెప్పుకుని లోనికి తీసుకోవాలి,ఆనీరు కడుపులో బొడ్డువరకు దిగిన తరువాత మరల పైవిధంగానే
2. "ఓం నారాయణాయ స్వాహ" అనుకుని ఒకసారీ,
3. "ఒం మాధవాయస్వాహ" అనుకుని ఒకసారి జలం పుచ్చుకోవలెను.అట్లు చేసి
4. "ఓం గోవిందాయనమః" అని చేతులు కడుగుకోవాలి.పిదప
5. "విష్ణవేనమః" అనుకుంతూ నీళ్ళు తాకి,మధ్యవ్రేలు,బొటనవ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.పిదప
6. "ఓం మధుసూదనాయనమః",పై పెదవిని కుడినించి ఎడమకి నిమురుకోవాలి.
7. ఓం త్రివిక్రమాయనమః క్రింద పెదవిని కుడినించి ఎడమకి నిమురుకోవాలి.
8,9.ఓం వామనాయనమః,ఓం శ్రీధరాయనమః , ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
10.ఓం హృషీకేశాయనమః ఎడమ చేతితో నీళ్ళు చల్లలి.
11. ఓం పద్మనాభాయనమః పాదాలపై ఒక్కొక్క చుక్కనీరు చల్లుకోవాలి.
12. ఓం దామోదరాయనమః శిరస్సుపై జలమును ప్రొక్షించుకోవలెను.
13.ఓం సంకర్షణాయనమః చేతివ్రేళ్ళు గిన్నెలా వుంచి గెడ్డము తుడుచుకోవలెను.
14. ఓం వాసుదేవాయనమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15,16. ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్దాయనమః నేత్రాలు తాకవలెను.
17,18. ఓం పురుషొత్తమాయనమః , ఓం అధోక్షజాయనమః రెండు చెవులూ తాకవలెను.
19,20. ఓం నారసిం హాయనమః,ఓం అచ్యుతాయనమః బొడ్డును స్పౄశించుకోవలెను.
21.ఓం జనార్ధనాయనమః చేతివ్రేళ్ళతో వక్షస్థలం,హృదయం తాకవలెను22. ఓం ఉపేంద్రాయనమః-చేతికొనతో శిరస్సు తాకవలెను.
23,24. ఓం హరయేనమః,ఓం శ్రీకృష్ణాయనమః-కుడి మూపురమును ఎడమ చేతితోను,ఎడమ మూపురమును కుడిచేతితోను తాకవలెను.

శివనామములు: ఏ దేవతను పూజించేందుకైనా పై కేశవనామములతోనే ఆచమనం చేయాలి.కాని,ప్రత్యేకించి-శివపూజకు మాత్రం శివనామాలతోనే ఆచమనం చేయాలి.ఆ శివనామాలను ఈ దిగువ ఇస్తున్నం.శివపూజను ప్రత్యేకించి ఈ విధంగానే చేయాలి.
ఓం శమ్న్నోరభేష్టయ ఆపో భవంతు ప్రీతయే
శంన్నో రభిస్రవంతు నః-(యజుర్వేదం)
అర్ధం:ఎడతెగని దాహమైపొఇందీ బ్రతుకు ఎంత దాహామో దాహం.అతువంతి దాహం సమస్తం తీరేలాగున-దివ్యగుణ సమన్వితమైన బ్రహ్మానందరస స్రవంతి నిత్యమై వెల్లివిరిసి ప్రవహించును గాక.
శివనామాలు
1.ఓం మహేశ్వరాయ నమః
2.ఓం మహాదేవాయనమః
3.ఓం సర్వెశ్వరాయనమః
4.ఓం శివాయనమః
5.ఓం శంకరాయనమః
6.ఓం శాశ్వతాయనమః
7.ఓం పశుపతేనమః
8.ఓం ఉమపతేనమః
9.ఓం బ్రహ్మధిపతే నమః
10.ఓం పరమేశ్వరాయనమః
11.ఓం భస్మాంగరాగాయనమః
12.ఓం మహేష్వాయనమః
13.ఓం నిత్యాయనమః
14.ఓం శుద్దయనమః
15.ఓం మృత్యుంజయాయనమః
16.ఓం భూతేశాయనమః
17.ఓం మృదాయనమః
18.ఓం శర్వాయనమః
19.ఓం సదాశివాయనమః
20.ఓం అభవాయనమః
21.ఓం సర్వజ్ఞాయనమః
22.ఓం భీమాయనమః
23.ఓం వాసుదేవాయనమః
24.ఓం త్రిపురాంతకాయనమః
ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమః

ఆత్మశుద్ది:ఆత్మశుద్దికై మార్జనం చేసుకోవాలి
శ్లో:అపవిత్రః పవిత్రోవా-సర్వావస్థాంగతోపివా
యః స్మరేత్పుండరీకాక్షం-సబాహ్యబ్యంతరశ్శుచిః
అని అనుకుని-కాసిని నీళ్ళు తలపై స్నానార్ధమన్నట్టుగా ప్రోక్షించుకోవాలి
భూశుద్ది:అలాగే మరి కాసిని నీళ్ళు చేతిలో పోసుకుని దిగువ మంత్రం జపిస్తూ చుత్తూ చల్లుకోవాలి.
"ఉత్తిష్టంతు భూతపిశాచాః యేతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే"
రెండక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవాలి. అలా భూ శుద్ది కాగానే
శ్లో:శుక్లాంబరధరం విష్ణుం-శశివర్ణం-చతుర్భుజం
ప్రసన్నవదనంధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే
శ్లో:అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
అని చెప్పుకుని చితికెడంత పసుపు,చిటికెడు అక్షతలు పసుపు వినాయకునిపై ఉంచాలి.పిమ్మట ఈ దిగువ శ్లోకములు జపించవలెను.
శ్లో:ఆపదా మపహర్తారాం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామంభూయోభూయోనమామ్యహం
శ్లో:య శ్శివో నామరూపాభాయాం యా దేవీ సర్వమంగళా
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ,ఓం శ్రీ ఉమామహేస్వరాభ్యామ్నమఃఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమఃఓం శ్రీ అరుంధతీవశిష్టాబ్యాం నమః,ఓం శ్రీ సీతారామాబ్యాం నమఃఓం శ్రీ మైత్రెయీకాత్యాఇనీ సహిత యజ్ఞవల్క్యాబ్యాం నమః,సర్వదిగ్దేవతాభ్యాం నమః,సర్వభూదేవతాభ్యాం నమః,రాష్ట్రదేవతాబ్యాం నమః,గ్రామదేవతాబ్యాం నమః,గృహదేవతాబ్యాం నమః,ఆదిత్యాది నవగ్రహదేవతాబ్యాం నమః
శ్లో:ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
ఓం సర్వేభ్యొ మహాజనేభ్యొ నమః అయం ముహుర్తస్సుముహూర్తొస్సు(అనుకుని ప్రణాయామమౌ చేయవలెను)
ప్రాణామాయ మంత్రము:(ఎవరి కుడిచేతితో వారు తమ ముక్కును పట్టుకుని ఈ దిగువ మంత్రము చెప్పుకోవలెను)ఓం భూః ఓం భువః-ఓ గ్ ం సువః-ఓం మహః-ఓం జనః-ఓం తపః-ఓ గ్ ం సత్యం-ఓం_తత్ సవితుర్ వరేణ్యేం-భర్గోదేవస్య ధీమహీ-ధియో యోనః ప్రచోదయాత్-ఓం అపోజ్యొతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సురోం.(పిమ్మట ఇట్లు సంకల్పం చెప్పుకోవలెను)
సంకల్పం:మమోపాత్తదురితక్షయద్వార,శ్రీ పరమేశ్వర(రీ)ప్రీత్యర్ధం,శుభే,శొభన ముహుర్తే,శ్రీ మహావిష్ణురాజ్ఞాయ-అని చెప్పుకోవాలి.(శివపూజలో మాత్రం "శ్రీ శివ శివ శంభోరాజ్ఞాయా" అని చెప్పుకోవాలి)ప్రవర్తమానస్య,అద్యబ్రహ్మణ,ద్వితీయపరార్ధే,శ్వేతవరాహకల్పే-వైవస్వతమన్వంతరే,కలియుగే,ప్రధమ పాదే,జంబూద్వీపే,భరతవర్షే,భరతఖండే,మేరోర్ధక్షిణదిగ్భాగే,శ్రీశైలస్య ఈశాన్యప్రదెశే-అస్మిన్-వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభ వాది షష్టి సంవవత్సరాణాం మద్యే(పూజా సమయము నాటికి నడుచుచున్న సంవత్సరము పేరుని చెప్పుకుని)సంవత్సరే-(జనవరి నెలలో వచ్చే సంక్రాంతి-పెద్దపండుగ మొదలుకొని,జూన్-జూలై నెలలలో వచ్చే కకాటక సంక్రమణం వరకూ అంతే జనవరి15 నుంచి జూలై 14 వరకూ గల ఆరు నెలలూ ఉత్తరాయణం,ఆ కర్కటక సంక్రాంతి మొదలు మళ్ళా పెద్దపండుగ దాకా జూలై15 నుండి జనవరి14 వరకు దక్షిణాయనం.పూజచేసే సమయాన్ని బట్టి,అది ఉత్తరాయణమో,దక్షిణ అయనమో తెసుకుని ఆ పేరు చెప్పుకోవాలి.)అయనే(ఋతువు పేరు అనుకోవాలి)ఋతౌ,(అది మన తెలుగు నెలల్లో ఏనెలయో తెలుసుకుని-ఆ నెల పేరు చెప్పవలేను),మాసే(అట్లే అమావాస్యకు ముందరిరోజులైనచో బహుళపక్షము,పున్నమికి ముందరి రోజులైతే శుక్లపక్ష్ము,ఇక్కడ అది ఏ పక్షమో అది చెప్పుకోవలెను.)పక్షే(ఆ రొజు యే తిధియో అది పంచమి అయినచో పంచమ్యాం తిధౌ అనుకోవాలి.)తిధౌ(అనునప్పుదు-ఆదివారాది వారములలో ఆరోజుయొక్క పేరు సోమారమ,గురువారమా అనునది యేదియినది చెప్పుకోవలెను.)వాసరేఅలా చెప్పిన పిదప -దిగువ విధముగా గొత్రనామాదులను చెప్పుకోవలెను .
పూజ చేయువారు పురుషులైనచో :శ్రీమాన్-గోత్రః-నామదేయః,శ్రీమతః-గోత్రస్య-నామదేయస్య(అనియు)
స్త్రీలైనచో:శ్రీమతిః గొత్రవతిః -నామదేయవతిః,శ్రీమత్యాః-గొత్రవత్యాః-నామదేయవత్యాః-(అనియు)గొత్రనామములు చెప్పుకొనిన అనంతరం ఎవరిమటుకువారే ఈ క్రింది విధంగా అనుకోవాలి.
అస్మాకంసహకుటుంభానాం-క్షేమస్థైర్య-విజయాయురారొగ్య-ఐశ్వర్యాభివృద్యర్ధం,సకలవిధమనోవాంచాఫలసిద్యర్ధం-శ్రీ ధనలక్ష్మీ ప్రదేవతాను గ్రహప్రస్సద సిద్యర్ధంశ్రీధనలక్ష్మీ ముద్దిశ్య-శ్రీధనలక్ష్మీ దేవతా ప్రీత్యర్ధం శ్రీ ధనలక్ష్మి పూజాం కరిష్యే-(అని చెప్పుకుని కుడిచేతి నడివ్రేలితో నీళ్ళను స్పృసించాలి)(కేవం వుదాహరణకోసం 'ధనలక్ష్మి దేవీ'పూజ చేస్తున్నట్టుగా ఆ పేరు వ్రాయడం జరిగింది.పై చెప్పిన ధనలక్ష్మి అని వున్న చోట మనం ఏ దేవతని పూజించబోతున్నమో ఆ దేవత పేరు చెప్పుకోవాలి)అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్ధం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే-అని చెప్పుకుని మరలా ఉదకమును స్పృశించవలెను

అటు పిమ్మట ఒక పాత్రకు(చెంబువంతిడానికి-లేదా గ్లాసుకు)పసుపు పూసి,గంధం,కుంకుమబొట్టు పెట్టి ఆ జలపాత్రలో ఒక పువ్వును కాని,పత్రినికాని ఉంచి యజమానులు(ఒకరైతే ఒకరు ,దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి- ఇలా అనుకోవాలి
శ్లో: కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితాః
మూలే తత్రస్థితో బ్రహ్మా-మధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతుసాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సా మవేదోహ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
అత్ర తిష్ఠంతు సావిత్రీ-గాయత్రీ చ సరస్వతీ
స్కందోగణపతిశ్చైవ శాంతిః పుష్ఠ్కరీ తధా-శ్లో: గంగే చ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధూ కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు
అయాంతుం దేవపూజార్ధం -మమ దురితక్షయ కారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మనాం చ సంప్రోక్ష్యహః
ఆ కలశమందలి నీరును పువ్వుతోగాని ఆకుతోగాని ఈదిగువ మంత్రం చదువుతూ-దేవతలపైనా,పూజాద్రవ్యాలపైనా,తమపైనా చిలకరించుకోవలెను.

మార్జనము: ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపివా
య స్మరేత్పుండరీకాక్షం స బాహ్యంభ్యంతరశ్శుచిః.
పిదప కాసిని అక్షతలు,పసుపు,గణప్తిపై వేసి,ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్ఠ చేవలెను.
శ్రీ మహగణాధిపతయే నమః ప్రాణ ప్రతిస్ఠాపన ముహుర్తస్సు -తధాస్తు.తరువాత దిగువ విధంగా చదువుతూ పసుపు వినాయకునకు నమస్కరించాలి.
సుముఖ శ్చై కదంతశ్చ కపిలో గజకర్ణః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతు ర్గణాద్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజః
షోడశైతాని నామాని యఃపఠేచ్చుఋణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం శ్రీ మహగణాధిపతియే నమః ధ్యాయామి-(అని కాసిని అక్షతలు పసుపు గణపతిపై వేయవలెను.)
ధ్యానం: శ్లో: భవసంచిత పాపఘ విద్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాసత్వం విఘ్న రాజ మహం భజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పశాంకుశధరం దేవం ధ్యే త్సిద్దివినాయకం
శ్లో: ద్యాయే ద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
ఓం శ్రీ మహగణాదిపతయే నమః ధ్యానం సమర్పయామి
.ఆవాహనం:
అత్రాగచ్చ జగద్వంద్వ -సురరా జి ర్చితేశ్వర
అనాధనాధ సర్వజ్ఞ-గౌరీగర్భసముద్భవ
ఓం శ్రీ మహగణాధిపతయే నమః-ఆవాహయామి
ఆసనం:
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై ర్విరాజితం
రత్నసిమ్హాసనం చారుప్రీత్యర్ధం ప్రతిగ్రుహ్యతాం
ఓం శ్రీ మహాగణపదిపతయేనమః - సిం హాసనార్ధం అక్షతాన్ సమర్పయామి-అని చెప్పుకుని అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం: గౌరిపుత్ర నమస్తేస్తు శంకర్స్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ మహగణాదిపతయేనమః అర్ఘ్యం సమర్పయామి-పువ్వుతో నీరు చల్లవలెను.

పాద్యం: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ మహాగణాదిపతయే నమః-పాద్యం సమర్పయామి అని పువ్వుతో నీరు చల్లవలెను.
ఆచమనీయం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో
ఓం శ్రీ మహగణాధిపతయేనమః_ఆచమనీయం సమ్ర్పయామి
మధుపర్కం: దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్వేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః -మధుపర్కం సమర్పయామి
పంచామృతస్నానం: స్నానం పంచామృతైర్ధేవ గృహాణ గణనాయక
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-పంచామృతస్నానం సమర్పయామి.(ఆవుపాలు,ఆవుపెరుగు,ఆవునెయ్యి,తేనె,పంచదార అనే ఆయిదింటినీ కలిపి పంచామృతములంటారు.
శుద్దోదకస్నానం: గంగాది సర్వతీర్ధ్యేభ్యై రాహ్రుతైరమలైర్జలైః
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్రనమౌస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-శుద్దోదకస్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం:రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-వుపవీతం సమర్పయామి.
గంధం: చందనాగరు కర్పూరం కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం
శ్రీ మహాగణాధిపతయేనమః గంధం సమర్పయామి.
అక్షతలు: ఆక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
ఓం శ్రీమహాగణాధిపతయేనమః అక్షతాన్ సమర్పయామి.
పుష్పములు: సుగంధాని సుపుష్పాణి,జాజికుంద ముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-పుష్పం సమర్పయామి.
అధాంగ పూజా
శ్రీమహాగణాధిపతయేనమః-పాదౌ పూజయామి
ఏకదంతాయనమః-గుల్భౌపూజయామి
శూర్పకర్ణాయనమః-జానునీ పూజయామి
విఘ్నరాజేనమః-జంఘే పూజయామి
అఖువాహనాయనమః-ఊరుం పూజయామి
హేరంభాయనమః-కటిం పూజయామి
లంబోదరాయనమః-ఉదరం పూజయామి
గణనాదాయనమః-నాభిం పూజయామి
గణేశాయనమః-హృదయం పూజయామి
స్థూలకంఠాయనమః-కంఠం పూజయామి
స్కంధాగ్రజాయనమః-స్కంధౌ పూజయామి
పాశహస్తాయనమః-హస్తౌ పూజయామి
గజవక్త్రాయనమఃవక్త్రం పూజయామి
విఘ్నహంత్రేనమః-నేత్రౌ పూజయామి
శూర్పకర్ణాయనమః-కర్ణౌపూజయామి
ఫాలచంద్రాయనమః-లలాటం పూజయామి
ఓం శ్రీమహాగణాధిపతయేనమః సర్వాణ్యంగాణి పూజయామి,
శ్రీ గణేశ్వురానుగ్రహసిద్ద్యర్ధం -పత్రం సమర్పయామి.అని చెప్పుకుని వినాయకునిపై పత్రియుంచవలెను.
ముఖ్య గమనిక:వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడూనూ గణేశుని తెలసి దళములతో పూజించరాదని పెద్దల వాక్కు.అనంతరం ఓం గజననాయనమః,ఓం గజవక్త్రాయనమః మొదలగు 108 పేర్లతో వినాయకుని పూజించవలెను.అంత ఓపిక లేనివారు ఈ దిగువ 16 పేర్లూ జపిస్తూ పత్రితో,పుష్పములతో,అక్షతలు వగైరాలతో పూజించవలెను.
1. ఓం సుముఖాయనమః-పత్రం సమర్పయామి
2. ఓం ఏకదంతాయనమః-పుష్పం సమర్పయామి
3. ఓం కపిలాయనమః-అక్షతాన్ సమర్పయామి
4. ఓం గజకర్ణాయనమః-గంధం సమర్పయామి
5. ఓం వికటాయనమః-పత్రం సమర్పయామి
6. ఓం విఘ్నరాజాయనమః-పుష్పం సమర్పయామి
7. ఓం గణాదిపాయనమః-అక్షతాన్ సమర్పయామి
8. ఓం ధూమకేతవే నమః-గంధం సమర్పయామి
9. ఓం గణాద్యక్షాయనమః-పత్రం సమర్పయామి
10. ఓం ఫలచంద్రాయనమః-పుష్పం సమర్పయామి
11. ఓం గజాననాయనమః-అక్షతాన్ సమర్పయామి
12. ఓం వక్రతుండాయనమః-గంధం సమర్పయామి
13. ఓం శూర్పకర్ణాయనమః-పత్రం సమర్పయామి
14. ఓం హేరంభాయనమః-పుష్పం సమర్పయామి
15. ఓం స్కందపూర్వజాయనమః-అక్షతాన్ సమర్పయామి
16. ఓం సర్వసిద్ది ప్రదాయకాయనమః-గంధం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-నానావిధ-పరిమళ పత్రపుష్ప శ్రీ గంధాక్షత పూజాం సమ్ర్పయామి.
పిదప అగరువత్తి వెలిగించి
శ్లో: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం గృహాణ దేవెశ విఘ్నరాజ నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః ధూపం సమర్పయామి-అనుకుంటూ గణపతికి చూపించవలెను.పిమ్మట దీపం వెలిగించి-స్వామికి చూపించుతూ
శ్లో: భక్త్యా దీపం ప్రయచ్చామి-దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘొరాత్ దివ్యజ్యొతిర్నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః సాక్షాత్ దీపం దర్శయామి.అటు తరువాత ఒక బెల్లం ముక్కను పసుపు గణపతి వద్దనుంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ "ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-గుడశకల నైవేద్యం సమర్పయామి.ఓం పాణాయస్వాహ,ఓం సమానాయస్వాహ,ఓం శ్రీ మహాగణాధిపతయేనమః"-అంటూ ఆరుమార్లు చేతితో స్వామికి నివేదనం చూపించాలి.పిదప "ఓం శ్రీమహాగణాధిపతయేనమః" నైవేద్యనంతరం-"హస్తౌ ప్రక్ష్యాళయామి"అని పువ్వుతోఒకసారి నీరు చిలకాలి
"పాదౌ ప్రక్ష్యాళయామి" అని మరోసారి నీరు చిలకాలి."పునః శుద్దచమనీయం సమర్పయామి" అని ఇంకొక పర్యాయం నీరు చిలకాలి.తదనంతరం
శ్లో: పూగీఫల సమాఉక్తం నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణసమాయుక్తం-తాంబూలంప్రతిగృహ్యతాం
అని చెబుతూ మూడు తమలపాకులు,ఒక పోక చెక్క స్వామి వద్ద ఉంచాలి.శుద్దాచమనీయం సమర్పయామి అనుకోవాలి.
కర్పూరం వెలిగించి--ఓం శ్రీమహాగణాధిపతయేనమః-కర్పూర నీరాజనం సమర్పయామి.అని ప్రదక్షిణగా తిప్పుతూ చిన్నగా ఘంట వాయించవలెను.అనంతరం మళ్ళా పువ్వుతో నీరు చిలుకుతూ "కర్పూర నీరాజానంతరం-శుద్దచమనీయం సమర్పయామి"అనుకోవాలి.
మంత్రపుష్పము:అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని
మం: ఓం -హిరణ్య గర్భస్థం-హేమబీజం విభావసో
అనంతంపుణ్యఫలదం-అ(ం)త శ్శాంతింప్రయచ్చమే
"ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.పిమ్మట స్వామికి సాష్టాంగ దండప్రమాణాలాచరించి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ-
శ్లో: ఆయుర్దేహి యసోదేహి-శ్రియంసౌఖ్యంచ దేహిమే
పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి అని ప్రార్ధించుకోవాలి.
అటుపైన పురుషుడు తన చేతితో అక్షతలు తీసుకుని,భార్యచేత అందులో ఉదకం పొయించుకొని--
"అవయా ధ్యానావాహనాది షొడశోపచార పూజయాచ-భగవాన్-సర్వాత్మకః-శ్రీ మహాగణాధిపతి స్సుప్రీతో సుప్రసన్నో వరదోభూత్వా-ఉత్తరేశుభకర్మ ణ్యవిఘ్నమస్తితి భవంతో బ్రువంతు-ఉత్తరేశుభకర్మ ణ్యవిఘ్నమస్తు--తధాస్తు.
"శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి" అనుకొని స్వామి వద్ద అక్షతలు తీసుకొని తమ తలపై వెసుకోవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి యెత్తి- తిరిగి క్రింద ఉంచి,పళ్ళెరములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీఠముపై నుంచవలెను.
శ్లో: గచ్చ -గచ్చ-గణాధ్యక్ష్య స్వస్థానం పార్వతీసుత
యత్ర మహేస్వరోదేవ స్తత్రగచ్చ గణాధిప
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-యధాస్థానం ప్రవేసయామి.శోభనార్ధం పునరాగమనాయచ.ఇతి శ్రీ హరిద్రాగణపతీ(పసుపు గణపతి) పూజా సమాప్తః
అధ శ్రీ సూక్త విధానేన ప్రధాన దేవతా పూజా ప్రారంభః
ఓం సహనాభవతు-సహనై భునక్తు-సహవీర్యం కరవావహై-తేజస్వినా మవధీతమస్తు-మావిద్విషావహై-మావిద్విషావహై-మావిద్విషావహై
అసలు మనము ఏదైవాన్ని పూజించదలచుకున్నామో ఆదైవారాధన యిప్పుడు ఆరంభం అవుతుంది.ఉదాహరణ కొరకు పూజ వద్ద 'ధనలక్ష్మీఅని వ్రాసినాము.ధనలక్ష్మీ అని వచ్చిన చోట మీ యిష్ట స్త్రీ దేవతా నామాన్ని చేర్చి పూజ చేసుకోవాలి.పునరాచమ్య:మొట్టమొదట చేసిన రీతిగానే కేశవ నామాలతో మరల ఆచమనం చేయాలి.తరువాత ,కొంచెము నీరు చేతిలో పొసుకుని నేలపై చిలకరించుతూ దిగువ శ్లోకము పఠించవలెను.
శ్లో: ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః
యేతేష మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణానాయమ్య:ఓం భూః -ఓం భువః-ఓం సువః-ఓం మహః-ఓం జనః-ఓం తపః-ఓగ్ ం సత్యం-ఓం తత్ సవితుర్ వరేణ్యం-భర్గో దేవస్య ధీమహీ ధియోయోనః ప్రచొదయాత్-ఓం ఆపోజ్యొతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సురోం

పునఃసంకల్ప్యః:ఓం శుభమితి శుభః-శుభేశోభనే-ముహుర్తే-జంబూద్వీపే,భరతవర్షే,భరతఖండే,మేరోర్దక్షిణదిగ్బాగే,శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే,గోదావరీతీరే(ఏ నదీ ప్రాంతంలో నివసిస్తుంటే ఆనది పేరు చెప్పుకోవాలి)(స్వంత యిల్లయితే) స్వగృహే అని (అద్దె యిల్లయితే) నివాసగౄహే అనిచెప్పుకోవాలి.శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య,అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే,శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే,కలియుగే ప్రధమపాదే,అస్మిన్వర్తమాన చాంద్రమానేన-వ్యావహారిక ప్ర్భవాది సంవత్సరాణాం మద్యే....తిధౌ....వాసరయుక్తాయం శుభే శొభనముహుర్తే-శ్రీ ధనలక్ష్మీ పరమేస్వరీదేవతా ప్రీత్యర్ధం శ్రీ ధన్లక్ష్మి ముద్దిస్య శుభనక్షత్ర,శుభయోగ శుభకరణ ఏవంగుణ విసేషణ విశిష్తాయాం,శుభే శోభనేముహుర్తే శ్రీమాన్....గోత్రః...నామధేయః.శ్రీమాన్...గోత్ర్స్య...నామధేయస్య(పురుషుడు ఒంటరిగా పూజ చేస్తే)మమ దర్మార్ధ కామ మొక్ష చతుర్విధ ఫలపురుషర్ధ సిద్ద్యర్ధం.సర్వాభీష్ట సిద్ద్యర్ధం-అనిన్నీ(స్త్రీలు ఒంటరిగా పూజ చేసుకునేటప్పుడు)అఖండిత సర్వవిధ సుఖ సౌభాగ్య సంతత్యాయురారోగైశ్వర్యాభి వృద్ద్యర్ధం అనిన్నె,(దంపతులు కలిసి చేసేలా ఉంతే)అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థర్య విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివృద్ద్యర్ధం ధర్మార్ధ కామ మొక్ష చతుర్విధ,ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలాప్రాప్త్యర్ధం(అనిన్నీ చెప్పుకోవాలి),అనంతరంశ్రీ ధనలక్ష్మీ పరమేశ్వరీ ప్రీత్యర్ధం-శ్రీ ధనలక్ష్మీ ముద్దిస్య,శ్రీ ధనలక్ష్మీ దేవతాం షొడశోపచార పూజాం కరిష్యే...
అధఃధ్యానం: శ్లో: భక్తలోభం భాస్కరాభం-బ్రహ్మాండ రాజ్యప్రదాం
సృష్టి స్థితిలయాధారాం-ధ్యాయామిత్వాంశ్రీ మాతరం
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః-ద్యానం సమర్పయామి.
నమస్కారం: శ్లో: క్షీరో దార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరోభవమే గేహే సురాసుర నమస్కృతే
ఓం శ్రీధనలక్ష్మీ దెవ్యేనమః-నమస్కారాం సమర్పయామి.
ఆవాహనం: మం: హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీంలక్ష్మీంజాతవేదో మమావహ
సాంగాం-సాయుధాం-సవాహనాం-సస్క్తీం-సబర్తృపుత్ర పరివార సమేతాంశ్రీ ధనలక్ష్మీ దేవతా మావాహయామి-స్థాపయామి-పూజయామి.
ఆసనం: మం: తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాం హిరణ్యవర్ణాం విందేయంగా మశ్వంపురుషానహం
శ్లో: సూర్యకొటి నిభస్ఫూర్తే-స్ఫురద్రత్న విభూషితే
సిం హాసన మిదం దేవీ స్వీకృతాం సురపూజితే
ఓం శ్రీ ధనలక్ష్మీ దేయేనమః-రత్న సిం హాసనం సమర్పయామి-రత్న సిం హసనార్ధే-అక్షతాన్ సమర్పయామి.(అక్షతలు వేయవలెను)
పాద్యం: మం: అశ్వపూర్వాం రధామధ్యం హస్తినాధ ప్రబోధినీం
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం
శ్లో: సువాసితం జలం రమ్యం సర్వతీర్ధ సమీకృతం
పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవనమస్కృతే
ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః-పాదయోపాద్యం సమర్పయామి.
అర్ఘ్యం: మం: కాంసోస్మితాం హిరణ్యప్రాకారా
మార్ద్రాంజ్వలంతీతృప్తాంత్పయంతీం
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియ
శ్లో శుద్దొదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యందాస్యామి తే దేవీ గృహాణ సురపూజితేఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః-హస్తయోరర్ఘ్యం సమర్పయామిఆచమనీయం: మం: చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లొకే దేవ జుష్తా ముదారం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మే నశ్యతాం త్వాం వృణే శ్లో: సువర్ణ కలశానీతం చందనాగురు సం యుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదేఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః-ముఖే ఆచమనం సమర్పయామిపంచామృతస్నానం: మం: ఆదిత్యవర్ణేతపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షొధబిల్వః తస్యఫలాని తపసా నుదంతు మయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ శ్లో: పయోధధిఘృతోపేతం శర్కరామధు సమ్యుతం పంచామృతస్నాన మిదం-గృహాణ శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః పంచామృతేనస్నాపయామి.ఒక పువ్వు పంచామృతంలో ముంచి దేవి పై చిలకరించవలెను.శుద్దొదక స్నానం: శ్లో: గంగాది సర్వతీర్దేబ్యః-ఆహృతై రమలైర్జలైః స్నానంకురుష్వ శ్రీదేవీ సర్వలోక సుతోషిణీఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః శుద్దోదకేన స్నాపయామివస్త్ర యుగ్మం: శ్లో:సు రాసురార్చితాంఘ్రే-సుదునుకూలవసనప్రియే వస్త్రయుగ్మంప్రదస్యామి-గృహాణహరివల్లభేఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః వస్త్రయుగ్మం సమర్పయామి.ఉపవీతం: మం: క్షుత్పిపాసామలాంజ్యేష్ఠ మలక్ష్మీం నాశయామ్యహం అభూతి మసమృద్దిం చ సర్వాన్నిర్ణుదమే గృహాత్ శ్లో: తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీత మిదం దెవీ గృహాణత్వం శుభప్రదేఓం శ్రీ ధన్లక్ష్మీ దేవ్యేనమః ఉపవీతం సమర్పయామి.గంధం: మం: గంధద్వారం ధురాధర్షాంనిత్యపుష్ఠాంకరీషిణిం ఈశ్వరీగ్ ంసర్వభూతానాంతామిహౌపహ్వయేశ్రియం శ్లో: శ్రీగంధం చందనం దివ్యగంధాద్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠే-ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాంఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః -గంధం సమర్పయామి అని కుడిచేతి నడిమి వ్రేలితో గంధమును చిలుకవలెను.
ఆభరణములు: మం: మనసః కామాకూతిం వాచ ంపత్య మసీమహి పసూనాగ్ ం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతామ్యసః శ్లో కేయుర కంకణైర్ధివ్యై ర్హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితేఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః ఆభరణాన్ సమర్పయామి.అక్షతలు: శ్లో: అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతా మబ్ధిపుత్రికేఓం శ్రీ ధనలక్ష్మి దేవ్యేనమః -అక్షతాన్ సమర్పయామిపుష్పములు: మం: కర్దమేన ప్రజాభూతా మయిసంభవకర్దమే శ్రియంవాసయ మేకులె మాతరం పద్మమాలీనీం శ్లో: మల్లికా జాజి కుసుమై శ్చంపకై ర్వకులైస్తధా శతపత్రైశ్చ కళ్హారై స్సర్వపుష్పాన్ ప్రతిగృహ్యతాంఓం శ్రీ ధన్లక్ష్మీ దేవ్యేనమః పుష్పం సమర్పయామి అని పువ్వులతో అమ్మవారి పాదములను పూజించవలెను.అధాంగ పూజ(ధన లేక ఏ యితర లక్ష్మీ పూజ కొరకైనాసరే)ఓం చంచలాయై నమః-పాదౌ పూజయామిఓం చపలాయై నమః-జానునీ పూజయామిఓం పీతాంబరధరాయైనమః-ఊరుంఓం కమలవాసిన్యైనమః-కటింఓం మదనమాత్రే నమః-స్తనౌ ఓం పద్మలయాయై నమః-నాభింఓం లలితాయై నమః-భుజద్వయంఓం కంభుకంఠైనమః-కంఠంఓం సుముఖాయైనమః-ముఖంఓం శ్రియ్యైనమః-ఓష్ఠం ఓం సునాసికాయైనమః-నాసికాంఓం సునేత్ర్యే నమః-నేత్రౌఓం రామాయై నమః-కంఠౌఓం కమలాలయాయై నమః-శిరంఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యేనమః-సర్వణ్యంగాని పూజయామి(గౌరి, సరస్వతి,సంతోషీమాత వగైర ఇతర దేవతలెవరికైనా సరే పనికి వచ్చే అధాంగ పూజ దిగువనిస్తున్నం)ఓం బక్తహృద్రమణ పాదాయై నమః-పాదౌఓం గుహ్యరూపయైనమః-జంఘేఓం నిర్గమాయై నమః-జానునీఓం జగత్ప్రసూత్యైనమః-ఊరుంఓం విశ్వయోనయే నమః-కటింఓం విశ్వమూర్తయేనమః-గుహ్యంఓం విశ్వంభరాయై నమః-నాభింఓం సుహృదాయై నమః-హృదయంఓం కంబుకంఠాయై నమః-కంఠంఓం మహాబాహవే నమః-బాహున్ఓం శరశ్చంద్రనిభాననాయై నమః-వదనం ఓం కంజదళనేత్రాయై నమః-నేత్రౌ పూజయామిపైవిధముగా అధాంగపూజ ముగిసిన పిదప యధాశక్తి ఆ దేవతయొక్క అష్టొత్తర శతనామావళికాని,సహస్ర నామావళి కాని చదువుతూ పూజించాలి.శ్రీ ధనలక్ష్మీ అష్టొత్తరత్తర శతనామ పూజా సమర్పయామి.తదనంతరం ధూపం వేయవలెను.

ధూపం: మం: అపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రీ యం వాసయమే

శ్లో: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం కపిలాఘృత సముక్తం ధూపోయం

శ్రీ ధనలక్ష్మీ దేయేనమః-ధూపమాఘ్రాపయామి అని సాంబ్రాణి ధూపం వేయవలెను.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML