గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 August 2015

ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అంశము ! పూర్తిగా చదివి షేర్ చేయండి !ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అంశము ! పూర్తిగా చదివి షేర్ చేయండి !

ఈ మధ్య కొంతమంది మంది మూర్ఖులు శుక్ల యజుర్వేదం లోని 40 వ అధ్యాయం లోని 9 వ మంత్రము ని చెప్పి వేదం లో విగ్రహారాధన చేయకూడదు అంటూ కొందరు మూర్ఖులు వాదిస్తున్నారు ! వీరికి 9 వ మంత్రము తర్వాత ఉన్న 10 మరియు 11 వ మంత్రాలను గమనించలేదు కాబోలు !! 9 వ మంత్రము నుంచి 11 వ మంత్రం వరకు ఒక మారు పరిశీలిద్దాము!
9) అంధం తమః ప్రవిశంతి
యే సంభూతి ముపాసతే |
తతో భూయ ఇవతే తమః
య ఉ సంభుత్యాగమ్ రతాః
ఈ మంత్రం యొక్క అర్థము ఎవరైతే సాకార సగుణ రూపాన్ని ఆరాదిస్తారో వారు కటిక చీకట్లలోకి పోతారు ఇక్కడ సగుణ సాకార రూపం అంటే పరమాత్మా నుంచి పుట్టినది ఏది అయిన కూడా సగుణ సాకార రూపమే అవుతుంది ! ఇక ఎవరైతే నిర్గుణ పరబ్రహ్మను ( సంభూతిని) పూజిస్తారో వారు అంతకన్నా ఎక్కువ అయిన చీకట్లలో ప్రవేశిస్తారు !
ఇక్కడ సగుణోపాసన అంటే మనిషి రూపాల మీద ఆకర్షనతోనో,స్వ ప్రయోజనాల మీద ఆసక్తితో ఆయా కోరికలు తీర్చే దేవతలను పూజించటం , కోరికలు తీరటం కోసం యజ్ఞ్యాలు , యాగాలు చేస్తుంటారు ! వీరి బక్థి అన్నది పూర్తి స్వార్థపూరితం ఎంతసేపు ఆర్జించటం కోసం కోరికలు తీరటం కోసం ఒక దేవుడిని కొలుస్తాడు ఆ దేవుడితో కోరిక తీరక పోతే మరొక దేవుడిని ఆరదిస్తాడు రెండవ దేవుడిని పూజించినపుడు కోరిక తీరింది అనుకో మొదట పూజించిన దేవుడు మీద చులకన భావం కలగటం , ఆ దేవుడిని పూజించే వారంటే తక్కువ భావం కలగటం కలుగుతుంది! వాస్తవానికి రెండవ దేవుడిని పూజిస్తున్నప్పటికి వాడి కర్మ ఫలించే సమయం వచ్చిందన్నమాట అంతే కానీ రెండవ దేవుడు గొప్ప మొదటి దేవుడు తక్కువ అని కాదు ఒక వేళ మొదటిదేవుదినే మరికొద్ది రోజులు పూజించి ఉన్న వాడి కర్మ ఫలించే సమయానికి కోరిక తీరేది ! ఈ విధంగా దేవుడిని ఒక కోరికలు తీర్చే వాడిగా బావిన్చేసి స్వార్థం కోసం పరమాత్మా ని గురించి ఆలోచించకుండా దృష్టి మొత్తం వ్యామోహాల మీదనే ఉన్నపుడు ముక్తి అన్నది అసాద్యం ! ముక్తి లేకపోవటమే అంధకారం !
సరే మరి కేవలం సగుణోపాసన చేస్తే ముక్తి లేదు అంధకారం అన్నారు బాగుంది మరి నిర్గుణోపాసన చేస్తే మరింత అంధకారం ఏందీ?? ఈ అనుమానం రాక తప్పదు|
నిర్గుణోపాసన అంటె రూపం లేని పరబ్రహ్మని పూజించటం మరింత అంధకారం లో తీసుకుపోతుంది !!
ఏ కర్మలు అనుభవించకుండా , చిత్తాన్ని ఏకాగ్ర పరచకుండా , ప్రాపంచిక వ్యామోహాలను వదలకుండా ఎంత ధ్యానం చేసినా మనస్సు దాని కోరికలవైపే పరిగెడుతుంది తప్ప పరమాత్మా మీద నిలవదు ఎంత కాలం ధ్యానించిన కర్మలని సంపూర్ణం చేయకుండా మనసు ఏకాగ్రత కుదరదు!! ఆకరుకి కర్మలని ఆచరించక , పరమాత్మని ఏకాగ్రతతో ధ్యానించక పతన స్థితి లో పడి పోతాడు ! కాబట్టి కేవలం నిర్గుణోపాసన చేయటం వల్ల మరింత చీకట్లలోకి పోవటం తథ్యం!
ఈ 9 వ మంత్రం లో సంపూర్ణంగా చెప్పబడింది కేవలం సగుణోపాసన (అసంభూతి ) , లేదా నిర్గుణోపాసన (సంభూతి) వల్ల అంధకారం ప్రాప్తిస్తుంది అని చెప్తోంది ! మరి దీని తర్వాతి మంత్రం ఏం చెప్తోందో చూద్దాం !!
10) అన్యదేవాహుః సంభవాత్
అన్యదాహుర సంభవాత్ |
ఇతిశుశ్రుమ ధీరాణాం
యే నస్త ద్విచచక్షిరే |
ఇక్కడ సంభవాత్ అంటే నిర్గుణ పరమాత్మని ఉపాసించటం , రెండవ పంక్తి లో అసంభవాత్( ర మరియు సం ల సంధి వల్ల అ చేరును ) అంటే సగుణోపాసన !
దీని అర్థం ఏంటంటే కేవలం నిర్గుణ పరమాత్మని ఉపాసించటం వల్ల ఒక ఫలితము , సగుణోపాసన చేయటం వల్ల వేరొక ఫలితము వచ్చును అని అర్థం ! కాని ముక్తి లబించదు !
మరి దీని తర్వాతి మంత్రం 11 వది గమనించినట్లైతే
11) సంభూతించ వినాశంచ
యస్తద్వేదో భయగ్ం సహ|
వినాశేన మృత్యుం తీర్త్వా
సంభూత్యా మృత మశ్నుతే||
దీని అర్థం ఎవరైతే నిరాకార నిర్గుణోపాసన , సాకార సగుణొపాసన సమన్వయము చేసి తెలుసుకుంటాడొ , అతడు సాకార సగుణొపాసన ద్వారా మార్పులతో కూడిన ప్రపంచాన్ని దాటి , నిరాకార నిర్గుణో పాసన ద్వార మార్పులు లేని పరమాత్మని పొందును !!
దీని పైన మంత్రం అంటే 10 వ మంత్రం లో స్పష్టంగా చెప్పబడింది నిర్గుణో పాసన వల్ల ఒక ఫలితము , సగుణో పాసన ద్వార వేరొక ఫలితము అని స్పష్టం చేసాడు కాని రెండిటిని కలిపి చేయటం వల్ల మాత్రమె పరమాత్మా తత్వాన్ని తెలుసుకొని ముక్తిని పొందగలము అని వేదం స్పష్టంగా చెప్తోంది కాని మూర్ఖులు కేవలం 9 వ మంత్రాన్ని ఉటంకించి 10 వ మరియు 11 వ మంత్రాలను చెప్పటం లేదు ! విగ్రహారాదన లేదు అన్నది పచ్చి అపద్దం కేవలం విగ్రహారాదన చేయటం తప్పు అంటుందే తప్ప విగ్రహరదనకి వ్యతిరేకం కాదు !!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML