గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 3 August 2015

శ్రీ కోదండ రామస్వామి దేవాలయం- రామతీర్థం

శ్రీ కోదండ రామస్వామి దేవాలయం- రామతీర్థంవిజయనగరానికి 12 కి మీ దూరం లో చంపావతి నది సమీపం లో రామతీర్థం గ్రామం లో నీలాచలం కొండాను అనుకోని వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం చాల పురాతనమైనది .సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం పశుపతి రాజుల కాలం లో నిర్మించబడింది అని చెబుతారు . ఆలయం మొత్తం ఒక పెద్ద రాతి పైన నిర్మించబడింది . సీతారామలక్షమనులు ఈ ప్రాంతం లో ఒక బక్తుని కోరికను తీర్చడానికి స్వయంగా వచ్చారు అని కూడా స్థల పురాణం చెబుతుంది . ఆలయం లో ఉన్న కోదండ రామ స్వామి విగ్రహాలు నిటి లో దొరకడం వలన ఈ క్షేత్రానికి శ్రీ రామతీర్థం అని పేరు వచ్చింది అని చెబుతారు . అక్కడ ఉన్న కోనేరు కి భాస్కర పుష్కరిణి అని పిలుస్తారు . ఆలయం లో ఉన్న ధ్వజ స్థంబాన్ని తాకితే సర్వ పాపాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. 


శ్రీమన్నారాయణుడి అవతారాల్లో రామ, కృష్ణావతారాలు ప్రత్యేకం. విష్ణుమూర్తి ధర్మ రక్షణ కోసం రామావతారం ఎత్తాడు. త్రేతాయుగంలో ధర్మరక్షణ చేసిన రాముడే, ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడు. ధర్మమార్గాన్ని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలబడతాడు. ఆ సందర్భంలోనే కృష్ణుడు పాండవులకు సీతారాముల ప్రతిమలను ఇచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రతిమలు పూజాభిషేకాలు అందుకుంటోన్న క్షేత్రంగా 'రామతీర్థం' దర్శనమిస్తుంది. విజయనగరం జిల్లాలో గల ఈ క్షేత్రం శ్రీరామచంద్రుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది.
పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతూ, ఎల్లవేళలా తమపట్ల అనుగ్రహాన్ని కలిగి ఉండమని కృష్ణుడిని ప్రార్థిస్తారు. దాంతో ఆయన తాను రామావతారంలో సంచరించిన ప్రాంతంలో అరణ్యవాసాన్ని కొనసాగించమని పాండవులతో చెబుతాడు. సీతారాముల ప్రతిమలను ఇచ్చి, వాటిని పూజిస్తూ వుండటం వలన వారు కోరుకునే రక్షణ లభిస్తుందని అంటాడు. అలా పాండవులచే పూజించబడిన ఈ ప్రతిమలు ఆ తరువాత కాలంలో కనిపించకుండా పోయాయి. చాలాకాలం క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలికి స్వప్నంలో రాముడు కనిపించి తన జాడను తెలియజేశాడు.


అదే సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తోన్న రాజుకి కూడా కలలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. అలా ఇక్కడి రాముడు వెలుగులోకి వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.


ప్రత్యేక కార్యక్రమాలు : 

శ్రీ రామ నవమి ,వైకుంట ఏకాదశి కి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . 


వెళ్ళు మార్గం : 

విజయనగరం నుండి 12 కి మీ దూరం లో రామతీర్తం గ్రామం Lord Sri Rama is the temple at Ramatheertham in Nellimarla Mandal of Vizianagaram District, Andhra Pradesh. Ramatheertham is the home to this ancient and famous temple of Ramachandra Swami that is said to be about 1000 year old. 


Sri Rama Temple in Ramatheertham is situated on the hills called Bavikonda with the gracious Champa River flowing at its foot between Bhaskara Lake and Neelachalam Hills. The temple is built entirely on a huge rock. The idols in this temple are installed and worshipped by the Pandavas during their exile for twelve years in the forest. The idols are now covered with silver Kavacham to which daily rituals are performed. Pedda Jeeyar installed a Rama Sthambam in this temple. Annual festivals like Chaitra Sukla Navami or Sri Rama Navami (in the month of April) and Vaikunta Ekadasi (in the month of Marghashirsha as per Tamil calendar) are the grand ceremonial festivals in this temple.


How to Reach:-

Road: It is on the National High way from Visakhapatnam to Srikakulam. The Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) operates point-to-point bus services from Vizianagaram, Srikakulam, visakhapatnam

Rail: Vizianagaram is the nearest Railway Station, 12 Kms away.
Air: Visakhapatnam Airport is 60Kms from the Temple .No comments:

Powered By Blogger | Template Created By Lord HTML