గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 4 August 2015

రాధాకృష్ణ గారు చనిపోవడానికి సంవత్సరం ముందే తాను ఎప్పుడు ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టేది సంవత్సరం, తారీఖు, సమయంతో సహా డైరీలో రాసిపెట్టారంట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నిజం ఎప్పుడూ నిజమే

కంటికి కనిపించేదే నిజం అని నమ్మే కొందరికి, ఇస్రో డైరెక్టర్ గారు రాకెట్ నమూనాని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత వుంచడం హాస్యాస్పదంగా అనిపించొచ్చు. ప్రముఖ వ్యక్తులు - సాధువుల సాంగత్యంలో గడపడం మూఢత్వంగా అనిపించొచ్చు. వైద్యులు శస్త్ర చికిత్స ముందు భగవంతుణ్ణి ప్రార్ధించడం ఛాదస్తంగా అనిపించొచ్చు. ఒక్కసారి "మంత్రపుష్పం" లోని శ్లోకాలని అర్ధసహితంగా ఆకళింపు చేసుకుంటే ఈ విశ్వంలో మన స్థానం ఎంత అల్పమో అర్ధం అవుతుంది. జ్యోతిషం ఉత్త ఛాదస్తం అని నేను వాదించే రోజుల్లో, ప్రముఖ రచయిత శ్రీ. భమిడిపాటి రాధాకృష్ణ గారి దగ్గర ఒక సినిమా కథ కోసం పనిచేసే అవకాశం కలిగింది. రాధాకృష్ణ గారు జ్యోతీషం చెప్పేవారు. ఆయన చెప్పేవిధానం కూడా విచిత్రంగా వుండేది. జ్యోతీషం చెప్పించుకోవడానికి వచ్చిన వ్యక్తి వివరాలు ఏమీ ఆయన తీసుకునేవారు కాదు, వాళ్ళ పేరు తప్ప. వచ్చిన వ్యక్తికి - తల్లి తండ్రులు పెట్టిన పేరుని ఇంటిపేరుతో సహా రాసుకుని, ఆ పేరుని అచ్చులు, హల్లులుగా విడదీసి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్యనిచ్చి, దాన్ని గుణించి జాతక చక్రం వేసేవారు. దాని గురించి నాకు అవగాన లేకపోవడం, పైగా జ్యోతీషం మీద ఆసక్తి లేకపోవడంతో నేను దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఆ సమయంలో పేరున్న గొప్ప వ్యక్తులు చాలామంది, ఆయన దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు "సమాజంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, బలహీనతలకి ఎవరూ అతీతులు కారు" అని నవ్వుకునేవాణ్ణి. కొన్నాళ్ళ తర్వాత అదే విషయం రాధాకృష్ణ గారి దగ్గర ప్రస్థావించినప్పుడు, "అది బలహీనత కాదు సత్తిబాబూ (నన్నలా పిలిచేవారు)! నమ్మకం ఇచ్చే బలం. శాస్త్రం తప్పుచెప్పదు. శాస్త్రాన్ని మిడిమిడి జ్ఞానంతో అర్ధం చేసుకుని చెప్పడం వల్ల జరిగే తప్పులు, జ్యోతీషశాస్త్రం మీద ఆపాదింపబడుతుంది. నిజం చెప్పాలంటే వ్యక్తుల పేరులోనే వారి జీవిత రహస్యం దాగి వుంది. తల్లి తండ్రుల స్పందనలోంచి ఒక బిడ్డ నామం పుడుతుంది. ఆ స్పందన astral influence వల్ల పుడుతుంది. దాన్ని క్రోడీకరించి నేను జాతకం చెబుతున్నాను. ఈ విద్య కూడా నేను నేర్చుకోలేదు. ఊహించని విధంగా అలవడింది" అని, జ్యోతీషం గణితమంత ఖచ్చితమైన శాస్త్రమని గట్టిగా చెప్పేవారు. ఇంతకు ముందు రాధాకృష్ణ గారి వద్ద జ్యోతీషం చెప్పించుకున్న వ్యక్తులు, కొన్ని రోజుల తర్వాత ఆనందంగా వచ్చి వారు చెప్పినట్లే జరిగిందని హర్షం వ్యక్తం చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసేది. ఆయనవద్ద నేను చూసిన సంఘటనలు జ్యోతీషం మీద నాకు నమ్మకం కలిగేలా చేసాయి. ఆ తర్వాత వృత్తి రీత్యా నేను హైదరాబాద్ కి మకాం మార్చేసాను. ఒకసారి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, వారి సలహా కోసం చెన్నై వెళ్లాను. అప్పటికే రాధాకృష్ణ గారు కూడా వారి స్వస్థలమైన రాజమండ్రి వెళ్ళిపొయ్యారని తెలిసింది. నేను హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. కొన్ని సంవత్సరాల తర్వాత వారు చనిపోయినట్లు పేపర్లో చదివాను. అదే సమయంలో రాధాకృష్ణ గారి సమకాలికులోకరు రాసిన ఉత్తరం న్యూస్ పేపర్లో(ఈనాడు అనుకుంటా) ప్రచురితమైంది. రాధాకృష్ణ గారు చనిపోవడానికి సంవత్సరం ముందే తాను ఎప్పుడు ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టేది సంవత్సరం, తారీఖు, సమయంతో సహా డైరీలో రాసిపెట్టారంట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నిజం ఎప్పుడూ నిజమే. (పుష్కర మహత్యం అబద్దం, జ్యోతీషం అవాస్తవం, పూజల వల్ల ప్రయోజనం లేదు అంటూ ఈ మధ్య వార్తా పత్రికలలో, T.V మాధ్యమాల్లో వస్తున్న చర్చలు చూసిన తర్వాత ఇంతకు ముందు ఒక పత్రికకి రాసిన నా అభిప్రాయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను).

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML