గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 August 2015

రాజీవ్ దీక్షిత్ గారు తమ ప్రసంగాలలో చెప్పిన అద్భుతవిషయాలు.నిన్ననే తొలి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచంలో ఎక్కడాలేని అద్భుత కళానైపుణ్యం మన చేనేత పరిశ్రమకే లభ్యం. అసలు భారతీయ చేనేత, హస్తకళా నైపుణ్యం గురించి మీకు తెలుసా? చేనేత మగ్గం గురించి చరిత్రలో బ్రిటన్ అధికారులు ఏమన్నారో తెలుసా?

రాజీవ్ దీక్షిత్ గారు తమ ప్రసంగాలలో చెప్పిన అద్భుతవిషయాలు.

టవర్నీ
ఫ్రాన్స్ చరిత్ర కారుడు 1750
1. భారతీయ వస్త్రాలు చాలా మృదువుగా వుండేవి. చేతితో పట్టుకుంటే బరువు తెలిసేది కాదు.
2. కుట్టిన జాడలు కూడా కనిపించేవి కావు. ఢాకా, మాల్వా, సూరత్ లలో తయారయ్యే బట్టలు ధరిస్తే ధరించిన వాళ్ళు నగ్నంగా ఉన్నట్టు కనిపిచే వాళ్ళు. ఇంత సున్నితమైన పల్చటి బట్ట, దారం, భారత్ లోని నేత గాళ్ళు చేత్తో తయారు చేసేవారు.
విలియం వార్డ్
ఆంగ్లేయ అధికారి
1. భారత్ లో తయారయ్యే మఖమల్ గుడ్డను గడ్డిమీద పరిస్తే దానిమీద మంచు కురిస్తే అదికూడా కనిపించేంత సున్నింతంగా ఉన్నాయి. సహజసిద్దమైన రంగులు ఎలా ఉంటాయో వాటికి వేసిన రంగులు కూడా అంత సహజంగా ఉండేవి.
2. 13 గజాల తాను 100 గ్రాముల కంటే తక్కువ బరువు తూగేది. కొన్ని తానులు 40-50 గ్రాములు కూడా ఉండేవి.
3. 13 గజాల గుడ్డ ఉంగరంలోనుండి బయటకు వస్తుంది. 13 గజాల చీర అగ్గిపెట్టెలో పడుతుంది.
విలియం వార్డ్ చెప్పిన 3 వ విషయాన్ని నేను స్వయంగా కాశీలో చూచూను. -


అమరులు, స్వదేశీ ఉద్యమకారుడు,స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసం

తెనుగుసేత మదన్ గుప్త


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML