గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 1 August 2015

పుష్కరాలు అంటే

పుష్కరాలు అంటే
ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం.జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుతనాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.అలాగే నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు,మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు),మంగళ స్నానాలు అనిహిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడిఉంది.శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడంమోక్షదాయకమని పెద్దలు చెప్తారు.పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడనిపురాణాలు చెప్తున్నాయి.తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి.నదీ స్నానాలలో పూష్కర స్నానంపుణ్యప్రదమని హిందువుల విశ్వాసం.తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువునుండి జలం, జలంనుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నం ,అన్నం నుండి జీవుడు పుట్టాయనివివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.


పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారిభారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలోస్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.


పుష్కర నిర్ణయము-2015 :
మన్మథ నామ సంవత్సర అధికాషాఢ బహుళ త్రయోదశీ మంగళవారం అనగా 14 జూలై 2015 ఉదయం 6.26 ని.లకుబృహస్పతికి సింహరాశి ప్రవేశము సంభవించినది. కావున ఈ దినము నుండి గోదావరి నదికి పుష్కర ప్రారంభముగాఆచరింపదగును. పుష్కరవ్రతము ద్వాదశ దిన సాధ్యమగుటచే 14-7-2015 నుండి 25-7-2015 వరకు ఆధిపుష్కరములుగా ఆచరింపవలెను. ఈ గోదావరి నదికి మాత్రము అంత్యమందు 12 రోజులు కూడా, అనగా 31-7-2016నుండి 11-8-2016 వరకు అనగా బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశ పూర్వము వరకు పుష్కర కార్యక్రములనుయధావిధిగా ఆచరింపవలెను.


పుష్కర జననం :
పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటున్నారు. నదులు ఆపాపాలు స్వీకరించిఅపవిత్రులు అవుతున్నాయి. మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడుఅనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగామార్చమని కోరతాడు. ఈ విధంగా పుష్కరుడు పుష్కరతీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నదియందుఅంతర్భూతమై ఉన్నాడు.


పుష్కరుని చరిత్ర :
స్నాన శక్తిని చెప్పే - పుష్కరుడు కథ :
ఆధ్యాత్మిక పరంగా "తుందిలుడు" అనే ఒక మహర్షి శంకరుణ్ణి గురించి తపస్సు చేసాడు . ప్రత్యక్షమైన ఈశ్వరుడు ' ఏంకావాలి ' అన్నాడు . నన్ను నీలో లీనము చేసుకో స్వామీ అని అన్నాడు తుందిలుడు . శంకరుడు ఒక క్షణముఆలోచించి సరే నంటూ తనలో లీనముచేసుకున్నాడు .


తుందిలుడు అంటే పెద్ద బొజ్జ కలవాడని అర్ధం ... అంటే పంచభూతాలూ తనలో దాగున్న ప్రపంచం అని భావము . ఆపంచభూతాలూ ఒక్కటై శంకరుణ్ణి ప్రార్ధిస్తాయి. . . మేమంతా నీ అధీనములో ఉంటామని ... సరేనన్నాడు శంకరుడు . ఈకారణముగా శంకరుడుకి ఐదు తలలుంటాయి. పంచభూతలింగాల పేరిట -- కంచి (పృధ్వీలింగం) ,జంబుకేశ్వరము(జలలింగం), తిరుణ్ణామలై(తేజోలింగం), శ్రీకాళహస్తి (వాయులింగం), చిదంబరం (ఆకాశ లింగం) అనే ప్రదేశాలున్నాయి. ఈపంచభూతాలూ అన్నిటినీ అందరికీ ఈయగలిగిన శక్తి ఉన్నవని గ్రహించి ఈ పంచభూతాల సమిష్ఠి రూపానికి"పుష్కరుడు" (పుష్కలముగా అన్ని తనలోకలిగిన కారణముగా ఈయగలిగిన వాడు ) అని పేరు పెట్టారు.సృష్టిచేయాల్సిన అవసరము వచ్చిన బ్రహ్మ ... సృష్ఠి చేయడముకోసము పంచభూతాల అవసరము ఉందని గుర్తించిపంచభూతాల సమిస్టి రూపమైన పుష్కరుణ్ణి తనకీయమని శంకరుడు ని ప్రార్ధిస్తాడు .


బ్రహ్మ కున్న అవసరాన్ని గుర్తించిన శంకరుడు పుష్కరుణ్ణి బ్రహ్మకిచ్చేసాడు . ఇప్పుడు పంచభూతాలు సంకరునిఅధీనము నుండి బ్రహ్మ అధీనానికి వచ్చేసాయి . మరికొంత కాలానికి బుద్ధికి అధిష్టాత అయిన బృహస్పతి ఈ పుష్కరుణ్ణితనకీయమని బ్రహ్మని ప్రార్ధిస్తాడు . . . అంటే తన బుద్ధిశక్తిని ఆ బ్రహ్మ చేత సృష్టింపబడే అన్నిటికీ అందించాలనే భావముతో సరేనని బ్రహ్మ ఆ పుషరుణ్ణి బృహస్పతికి ఇచ్చేసాడు . ఆ పంచభూతాల సమిస్టిశక్తి అయిన పుష్కరుణ్ణి ఈ బృహస్పతిలోకములోని జనూలందరికీ వినియోగించదలిచి సంవత్సరానికి ఓ 12 రోజులు పాటు ఒక్కోనదిలో ఈ పుష్కరుణ్ణునిఉండవలదింగా ఆజ్ఞ చేస్తాడు . ఆ 12 రోజులు ఎందరు ఆ నదిలో స్నానము చేస్తే ఆ అందరికీ పంచభూత శక్తి చేరుతుందనిదీని భావము. అలా జరుగుతుందనే బృహస్పతి ఉద్దేశము .


ఏ నది ఏవైపుగా ప్రవహిస్తూ ఈ శక్తిని ఏ కాలములో పొందుతుందో ఆ రహస్యాన్ని కూడా మనకి వివరిస్తూ పుణ్యముకట్టుకున్నారు బృహస్పతి .


నది---------------------------------- రాశి
గంగా నది----------------------------మేష రాశి
రేవా నది (నర్మద)-------------------వృషభ రాశి
సరస్వతీ నది-------------------------మిథున రాశి
యమునా నది-----------------------కర్కాట రాశి
గోదావరి-------------------------------సింహ రాశి
కృష్ణా నది------------------------------కన్యా రాశి
కావేరీ నది----------------------------- తులా రాశి
భీమా నది----------------------------- వృశ్చిక రాశి
పుష్కరవాహిని/రాధ్యసాగ నది------ ధనుర్ రాశి
తుంగభద్ర నది------------------------ మకర రాశి
సింధు నది----------------------------- కుంభ రాశి
ప్రాణహిత నది-------------------------- మీన రాశి


బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలోఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది.పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరముఅని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.


గోదావరి పుష్కర మహత్మ్యం :
"బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఇందాద్యా సర్వదేవతాః!
పితరో ఋషయశ్చైవ తత్త్రవ నివ సంతతి!!
బృహస్పతి సింహరాశిలో సంచరించినపుడు గోదావరి పుష్కరాలు వస్తాయి
పుష్కర కాలంలో గంగా గోదావరీ కృష్ణవేణి నదుల్లో పన్నెండు సంవత్సరాలు స్నానం చేస్తే వచ్చే ఫలం కేవలం గోదావరిలోస్నానం చేయటం వలన కలుగుతుంది


"సింహరాశింగతే జీవే స్వర్గే మర్త్యే రసాతలే!
యానీవైసంతీ తీర్థాని గౌతమ్యాం తాని సంతహి!!
"అశ్వమేధ ఫలంచైవ లక్ష గోదానజం ఫలం!
ప్రాప్నోతి స్నాన మాత్రేణ గౌతమ్యాం సింహగే గురో"
వేయి సంవత్సరాలు రేవా నదిలో నూరు సంవత్సరాలు గంగా నదిలో స్నానం జపం తపా్సు చేయు ఫలితం
కేవలం పుష్కర కాలంలో గోదావరిలో స్నానం చేయటం వలన కలుగుతుంది..


"షష్టీ వర్ష సహస్రాణి భాగీరధ్యవ గాహనం
సకృద్గోదావరీ స్నానం సింహస్థేచ బృహస్పతౌః"
తా: అరవై వేల సంవత్సరాలు గంగానదిలో స్నానం చేయటం వలన ఎంత పుణ్యం లభిస్తుందో పుష్కర సమయంలోగోదావరిలో స్నానం చేయటం వలన అంతే పుణ్యం లభిస్తుంది..
దేవ గురవు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు భూమిపై ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్నిటి శక్తులను గోదావరిగ్రహించి మహా శక్తివంతమవుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML