గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 4 August 2015

నాలుగు ధామాలు -దేవాలయాలునాలుగు ధామాలు -దేవాలయాలు

భారతదేశంలో నాలుగు మూలల నాలుగు ధామాలు ఉన్నాయి . తమిళనాడులో రామేశ్వరం, గుజరాత్ రాష్రంలొ ద్వారకధామం ,ఉత్తరప్రదేశ్‌లో హరిద్వార్ వద్ద బదరీనాధ్ ధామం, ఒరిస్సారాష్ట్రంలో జగన్నాధ్ ధామం .

1. రామేశ్వర ధామం :


తమిళనాడులో , అరేబియా , బంగాళఖాతం కలిసిన చొట , సముద్ర మధ్యలో చిన్నద్వీపం రామేశ్వరం . ఇక్కడ రామలింగేశ్వర , శ్రీ కోదండ రామ స్వామి ,సేతువ మాధవస్వామిల ఆలయాలు ఉన్నాయి . మద్రాసు నుంచి రామేశ్వరంనకు బస్సు మరియు రైలు సౌకర్యాలు ఉన్నాయి .

2. బదరీనాధ్ ధామం :

ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ వద్ద బదరీనాధ్ కలదు . దీనినే బ్రహ్మకపాలం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పద్మాసనాసీనుడై ఉంటాడు. హరిధ్వార్ చేరుటకు వారణాసి , డిల్లీ , బొంబాయి , ఉజ్జయిని, హౌరా ల నుంచి రైలు సర్వీసులు ఉన్నాయి .

3. ద్వారక ధామం :

గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ కోస్తా తీర ప్రదేశమున , అరేబియా సముద్ర తీరంన ద్వారక ఉంది . శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి పరిపాలించింది ఈ ప్రదేశాన్నే . ద్వారకాదేశి ఆలయంలో శ్రీ కృష్ణ భగవానుల దర్శనం చేసుకొని , రుక్మిణి ఆలయం , స్వామి నారాయణ ఆలయం మొదలుగునవి దర్శించవచ్చును .

దేశంలో అన్ని ముఖ్య నగరములు నుంచి అహమ్మదాబాద్‌కు రైలు సర్వీసులు కలవు . అహమ్మదాబాద్ నుంచి ద్వారక దూరం 469 కి.మీ పూరి ధామం నుంచి కూడా ద్వారకకు రైలు సర్వీసు ఉంది . ఈ రైలు బండి (వయా) విజయవాడ మీదుగా పూరి నుంచి ప్రతి ఆదివారం బయలుదేరి మంగళవారం నాటికి ద్వారక చేరును .

4. జగన్నాధ్ ధామం :

ఒరిస్సా రాష్ట్రంలో , కోస్తా పట్టణమైన పూరి బంగాళఖాత తీర ప్రాంతములో ఉంది . ఈ పూరినే జగన్నాధ్ పూరి అంటారు . ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు , బాల రాముడు , చెల్లెలు సుభద్రల విగ్రహాలు ఉంటాయి . హిందువులకు మాత్రమే ప్రవేశం . జగన్నాధ్ ఆలయంలో చక్రతీర్ధం ,గోపీనాధాలయం మొదలుగునవి ఉన్నాయి .

పూరి చేరుటకు తిరుపతి నుంచి (వయా) విజయవాడ , వారణాసి నుంచి (వయా)ఖరగ్ పూర్ , పాట్నా నుంచి (వయా)ఖరగ్ పూర్ , ద్వారక నుంచి (వయా) విజయవాడ , హౌరా నుంచి (వయా)ఖరగ్ పూర్ మొదలగు ప్రాంతాల నుంచి రైలు సర్వీసులు ఉన్నాయి .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML