ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 13 August 2015

మహిమాన్వితమైన హరిక్షేత్ర కామరూపా దేవి .......మహిమాన్వితమైన హరిక్షేత్ర కామరూపా దేవి .......
.
హరిక్షేత్ర కామరూపాదేవి వందనం, అభివందనం. నీలాచలవాసినికి నిత్యాభివందనం. అంటూ కామరూపాదేవి అనబడే కామాఖ్యా దేవిని నిత్యార్చనల స్తుతిస్తూ ఉంటారు. ఈ కామాఖ్యదేవి కన్యక అని, పెళ్ళికాని పిల్ల కనుక కామరూపి అని ఆర్యోక్తి. సమానంగా లేని కొండప్రాంతం కనుక “అసమ” అన్న నాటి పేరు నేటి అస్సాంగా మారింది. నీలాంచలమున గల ఈ క్షేత్రానికి దగ్గరగా బ్రహ్మపుత్రానది కలదు. సతీదేవి యొక్క “యోని” భాగం ఈ పర్వతం మీద పడింది. ఈ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా వున్నది. ఇక్కడే వున్న నీలాంచల పర్వతం విష్ణుస్వరూపంగా భావించబడుతోంది కనుక ఇది హరిక్షేత్రమయింది.


కాముడికి ఖ్యాతి వచ్చిన క్షేత్రం కనుక ఆ క్షేత్రాన్ని “కామాఖ్యా క్షేత్రమని” కాముడికి మళ్ళీ జీవం వచ్చింది కనుక కామరూప క్షేత్రమని పిలచేవారు. ఆ తల్లిని కామరూపాదేవిగా అర్చించేవారు.

13వ శతాబ్దంలో బిష్వసింహుడు, శివసింహుడు అనే రాజ యువకులు అడవిలో తప్పిపోయిన తమ సైన్యం గురించి వెతుకుతూ, నీలాచల పర్వతం చేరి అక్కడ ఒక జ్వాల ఆ ప్రక్కన ఒక ముసలమ్మ కనిపించగా తమ దాహం తీర్చమని అడిగారు రాకుమారులు. వారికి బ్రహ్మకుండం చూపింది ములసమ్మ.

ఆ బ్రహ్మకుండంలోని నీరుతాగి సేదతీరిన రాకుమారులు అవ్వా! ఆ జ్వాల ఏమిటి? ఒంటరిగా ఎందుకున్నావని అడుగగా అది కామాఖ్యక్షేత్రమని, కూలిపోయిన గుడిని పునర్నిర్మిస్తే మీ కోరిక తీరుతుందని ముసలమ్మ తెలుపగా… ‘బంగారు గుడి కట్టించలేని అశక్తులము, ఇటుక ఇటుక మధ్యన బంగారు పలుకు వేసి కట్టిస్తాం… మమ్ము క్షమించి అనుగ్రహించమని ప్రార్థించగా… తల్లి ఆనందించి ఆశీర్వదించింది. అందుకే అంటారు అమ్మ వాత్సల్యానికి మించిన అనుగ్రహం లేదని. అమ్మ అనుగ్రహంతో ఆలయ నిర్మాణం పూర్తిచేసి నిత్యార్చనలకై అర్చక కుటుంబాలను ఏర్పరిచారు.

పిమ్మట కాలగతంలో శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరించేందుకు 16వ శతాబ్దంలో నరనారాయణుడు, చిలారై రాజసోదరులు నడుంకట్టారు.

ఈ ఆలయం సమీపంలోగల “ఉర్బసీ కుండం”లో స్నానమాచరించి కామాఖ్యా ఆలయంలో ప్రవేశించాలి.

మరో విశేషమేమిటంటే “అంబూషి మేళ”గా పిలువబడే సమయంలో అమ్మవారికి కట్టిన వస్త్రాలు ఎర్రబడతాయి. మృగశిరకార్తెవెళ్ళి ఆర్త్రకార్తె ప్రవేశించేవేళ, భూమి రజస్వలవుతుందని దేవీ భాగవతంలో ఉంది. ఈ సమయంలో 3 రోజులపాటు అమ్మవారి ఆలయాలను, చుట్టుపక్కల ఆలయాలను మూసివేస్తారు. నాల్గవరోజున అమ్మవారికి తలంటిపోసి ఆలయ సంప్రోక్షణ జరిపి అమ్మవారి దర్శనం కోసం ఆలయం తెరుస్తారు. కామాఖ్యాదేవి ఆలయం చుట్టుపక్కల ఏడుగురు అమ్మవార్ల ఆలయాలున్నాయి. అవి : 1. కాశి, 2. తార, 3.భువనేశ్వరి, 4.భైరవి, 5. చిన్న మస్తా, 6. భగళీ, 7.ధూమావతి ఆలయాలతోపాటు 1. కామేశ్వర, 2. సిద్ధేశ్వర, 3.కోటిలింగ, 4. అఘోర, 5. అమృతేశ్వర అనే పంచశివాలయాలున్నాయి.

ఈ క్షేత్ర సందర్శకులకు నిత్యమూ మహిమా చూపి ఆదరిస్తున్న బంగారు తల్లి కోర్కెలు తీర్చే కామాఖ్యమాత అనడంలో ఎటువంటి సందేహం లేదని ఎందరో భక్తులు కొనియాడుతున్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML